‘కల్కి 2898 AD’ జూన్ 27 గ్రాండ్ గా విడుదల  

Must Read

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’ జూన్ 27, 2024న ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్ వంటి ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్ తో సహా  దీపికా పదుకొణె, దిశా పటాని లాంటి ప్రముఖ తారాగణంతో రూపొందతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విడుదల తేదీకి సరిగ్గా రెండు నెలల ముందు ఈరోజు చేసిన అనౌన్స్మెంట్ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న ఎక్సయిట్మెంట్ మరింత పెంచింది. సోషల్ మీడియా ద్వారా, మేకర్స్ ఈ బిగ్గెస్ట్ న్యూస్ ను అనౌన్స్ చేశారు.

అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ పాత్రను ఇటీవలి విడుదల చేసిన గ్లింప్స్ ద్వారా ప్రేక్షకులని ‘కల్కి 2898 AD’ వరల్డ్ లోకి తీసుకెళ్ళి ఆశ్చర్యపరిచారు.  ముఖ్యంగా లెజెండరీ యాక్టర్ అద్భుతమైన డి-ఏజింగ్ ట్రాన్స్ ఫర్మేషన్ సర్ ప్రైజ్ చేసింది. ఈ ట్రూ పాన్-ఇండియా టీజర్ తెలుగు, తమిళం,  మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ సహా భాషల సమ్మేళనాన్ని ప్రజెంట్ చేసింది.

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 AD’ ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్ గా అలరించనుంది. అన్ బిలివబుల్ తారాగణంతో వైజయంతీ మూవీస్ నిర్మాణంలో జూన్ 27, 2024న చాలా గ్రాండ్ గా విడుదల కానుంది.

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News