సమాజాన్ని జాగృతం చేసే కథలు, చక్కటి కుటుంబ ఇతివృత్తంతో యాభైకి పైగా సినిమాలను తీసిన ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మాతగా తొలిసారి సినీరంగంలోకి అడుగుపెట్టి తీస్తున్న చిత్రమిది. ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రంలో రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు ప్రధాన పాత్రధారులు. వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకత్వం వహించనున్నారు.
హైదరాబాద్ లోని అన్నపూర్ణా స్టూడియోలో ఆగష్టు 9న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకుంటుందని చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య వెల్లడించగా, దర్శకుడిగా ఎప్పటికీ గుర్తుంచుకునే అద్భుత చిత్రాలను అందించిన నాన్న సమర్పణలో ఈ చిత్రం ద్వారా నిర్మాతగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశిస్తుండటం ఆనందంగా ఉందని ముత్యాల అనంత కిషోర్ తెలిపారు. ఇతర విషయాలను చిత్రం ప్రారంభం రోజున వివరిస్తామని ఆయన చెప్పారు.
దర్శకుడు వి.శ్రీనివాస్ (సిప్పీ) మాట్లాడుతూ, ఓ వైవిధ్య భరిత , ఫామిలీ ఎంటర్ టైనర్ గా ప్రతీ ఒక్కరూ చూసి తీరాల్సిన చిత్రంగా దీనిని మలచనున్నామని చెప్పారు.
ఈ చిత్రంలో రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, రఘుబాబు, శుభలేఖ సుధాకర్, సాహిత్య, వైష్ణవి, దేవిప్రసాద్, ఆదర్శ్ బాలకృష్ణ, శాంతకుమార్, గౌతం రాజు తదితరులు నటీనటులు.
ఈ చిత్రానికి మూల కథ: శరవణన్, కదా విస్తరణ: ముత్యాల సుబ్బయ్య, మరుదూరి రాజా, మాటలు: నివాస్, పాటలు: భువనచంద్ర, సంగీతం: కోటి, డి.ఓ.పి: ఎన్.సుధాకర్ రెడ్డి, ఎడిటింగ్: నాగిరెడ్డి, ఆర్ట్: వెంకటేశ్వరరావు, సమర్పణ: ముత్యాల సుబ్బయ్య, నిర్మాత: ముత్యాల అనంత కిషోర్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.శ్రీనివాస్ (సిప్పీ
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…