మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాకింగ్ డ్యాన్స్ మూవ్స్ తో అదరగొట్టిన ‘పెద్ది’ పాన్ ఇండియా వైరల్ సాంగ్ చికిరి చికిరి రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ మోస్ట్ ఎవైటెడ్ మోస్ట్ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ అయిన చికిరి చికిరి ప్రోమోకు అద్భుతమైన స్పందన వచ్చింది, లిరికల్ వీడియోపై భారీ అంచనాలని పెంచింది. భావోద్వేగాలను అద్భుతంగా చూపించే దర్శకుడు బుచ్చి బాబు సాన, ఈసారి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రహ్మాన్‌తో పని చేయడం తన కల నెరవేరినట్టుగా చెప్పారు. రహ్మాన్‌పై ఆయనకున్న అభిమానాన్ని ఈ ప్రమోలోనే చూపించారు.  పాట సిట్యుయేషన్ రహ్మాన్‌  పై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆయన ఈ పాటని సిట్యుయేషన్ తగ్గట్టుగా అద్భుతంగా మలిచారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఈ రోజు మేకర్స్ ఫస్ట్ సింగిల్‌ ని రిలీజ్ చేసి ఎక్సయిట్మెంట్ ని మరింత పెంచారు.

పర్వత ప్రాంతంలో నివసించే పెద్ది.. ఓ రోజు గ్రామంలో తన చికిరిని చూసిన క్షణం నుంచే ఆమె అందం, అమాయకత్వం అతనిని మంత్ర ముగ్ధుడ్ని చేస్తాయి. ఆమెను చూసి కలిగిన ఆ ఆనందాన్ని ప్రతి క్షణం వేడుక చేసుకుంటాడు. ఈ బ్యూటీఫుల్ ఫీలింగ్స్ ని లిరిసిస్ట్ బాలాజీ తన సాహిత్యంలో ఎంతో అద్భుతంగా మలిచారు.

ఏఆర్ రహ్మాన్ సంగీతం అద్భుతంగా వుంది. ఫోక్ ఎనర్జీ, మోడర్న్ బీట్‌లతో కంపోజ్ చేసిన చికిరి అదిరిపోయింది. గాయకుడు మొహిత్ చౌహాన్ తన ఎనర్జిటిక్ వోకల్స్ తో పాటకు జీవం పోశారు. జాని మాస్టర్ కొరియోగ్రఫీతో పాట విజువల్స్ మరింత బ్యూటీఫుల్ గా మారాయి.

రామ్ చరణ్ రాకింగ్ డ్యాన్స్ మూవ్స్ తో అదరగొట్టారు. ఆయన ఎక్స్‌ప్రెషన్స్, రిథమ్, హ్యాపీనెస్ ప్రతి ఫ్రేమ్‌లో అద్భుతంగా వున్నాయి. ఆయన హుక్ స్టెప్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సాంగ్ ప్రేమను సెలబ్రేట్ చేస్తున్న అనుభూతి ఇస్తోంది.

జాన్వీ కపూర్ ఇంట్రో షాట్ ఈ సాంగ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఆమె దీపాన్ని ఎత్తి తన లుక్‌ని రివీల్ చేసే సీన్ మ్యాజిక్ లా ఉంది. ఆమె గ్రేస్, చార్మ్ అద్భుతంగా వుంది.

పాట ట్యూన్, లిరిక్స్, విజువల్స్, ఎనర్జీ అన్నీ కలిపి“చికిరి చికిరి”ను నెక్స్ట్ పాన్-ఇండియా వైరల్ సాంగ్‌గా నిలబెట్టాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, డాన్స్ ఛాలెంజ్‌లకు ఇది పర్ఫెక్ట్ సాంగ్. చికిరి ‘పెద్ది’ మ్యూజికల్ జర్నీకి బ్లాక్‌బస్టర్ స్టార్ట్ ఇచ్చింది.

ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  

ఈ సినిమాకి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు డీవోపీ కాగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్.

పెద్ది మార్చి 27, 2026న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ

సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: బుచ్చిబాబు సానా
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
హ నిర్మాత: ఇషాన్ సక్సేనా
సంగీతం: ఏఆర్ రెహమాన్
DOP: ఆర్ రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

3 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

6 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago