ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో శనివారం నాడు రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ గారు, ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు, ఎమ్మెల్యే బత్తుల బలరాం గారు, ఎమ్మెల్సీ హరి ప్రసాద్ గారు, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గారు, కుడా చైర్మన్ తుమ్మల బాబు గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ నమస్కారాలు. ఈవెంట్‌ను వీక్షిస్తున్న ప్రతీ ఒక్కరికీ నమస్కారాలు. అలానే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నమస్కారాలు (నవ్వుతూ). మన సినిమా పరిశ్రమకు మూలాలైనా రఘుపతి వెంకయ్య నాయుడు, దాదా సాహెబ్ ఫాల్కే, రాజ్ కపూర్, సత్య జిత్ రేని మర్చిపోలేం, తెలుగు ఖ్యాతిని ఎగరేసిన నాగిరెడ్డి గారిని, బీఎన్ రెడ్డి గారిని, రామబ్రహ్మం గారు, తెలుగు జాతి కీర్తి పెంచిన ఎన్టీ రామారావు గారిని, ఏఎన్నార్ గారిని తలుచుకుంటాం. పవన్ కళ్యాణ్ ఉన్నా.. రామ్ చరణ్ ఉన్నా.. దానికి కారణం చిరంజీవి గారు. మీరు కళ్యాణ్ బాబు అని అరిచినా, ఓజీ అని అరిచినా, డిప్యూటీ సీఎం అని అరిచినా దానికి చిరంజీవి గారే ఆద్యులు. సీఎం చంద్రబాబు గారి సహకారం, మద్దతు వల్లే ఈ రోజు ఇక్కడ ఇలాంటి ఈవెంట్‌ను నిర్వహించుకోగల్గుతున్నాం. హోం మినిస్టర్ అనిత గారికి, డీజీపీ గారికి, జిల్లా యంత్రాంగానికి థాంక్స్. ఈ రోజు కార్యక్రమానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలకు నమస్కారాలు. శంకర్ గారు చేసిన జెంటిల్మెన్ సినిమాను చెన్నైలో చూశాను. ప్రేమికుడు సినిమాకు అమ్మమ్మతో వెళ్లాను. సామాజిక సందేశాన్ని అందిస్తూ శంకర్ గారు సినిమాలు తీస్తుంటారు. ఈ రోజు రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్థాయికి వెళ్లారు. దానికి కొంత మంది సౌత్ దర్శకులు కారణం. అందులో శంకర్ గారు ఒకరు. తమిళంలో శంకర్ గారు సినిమాలు తీసి తెలుగు వారిని మెప్పించారు. ఆయన తెలుగులో సినిమా చేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఇక దిల్ రాజు గారు నా తొలిప్రేమ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు. నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు వకీల్ సాబ్ సినిమా ఇచ్చారు దిల్ రాజు. ఆయన ఇచ్చిన డబ్బులే జనసేనకు ఇంధనంగా మారింది. మేం ఆంజనేయ స్వామి భక్తులం. అన్నయ్యకు అబ్బాయి పుట్టాడని మా నాన్న గారు ఎంతో ఆలోచించి రామ్ చరణ్ అని పేరు పెట్టారు. రాముని చరణాల వద్ద ఉండే వాడు..

ఆంజనేయుడు.. ఎంత బలం ఉన్నా వినయ విధేయంగా ఉంటాడు.. హనుమాది సిద్దులున్నా కూడా ఎంతో వినయంగా ఉండేవాడు.. అందుకే రామ్ చరణ్ అని మా నాన్న పేరు పెట్టారు. నాకు చిరంజీవి పితృసమానులు. నేను రామ్ చరణ్‌కు బాబాయ్‌లా ఉండను. రామ్ చరణ్ నాకు సోదర సమానుడు. రామ్ చరణ్ రంగస్థలం సినిమాకు అవార్డు వస్తుందని అనుకున్నాను. గోదారి తీర ప్రాంతాల్లో జీవించకపోయినా.. అద్భుతంగా నటించారు. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టార్ అవుతాడు. సంకల్ప బలం, పట్టుదల, కార్యదక్షత ఉంటే.. అందరూ మెగాస్టార్ చిరంజీవిలా ఎదగొచ్చు. ఆయన అంతలా ఎదగబట్టే నేను ఈ రోజు ఇలా ఈ స్థాయిలో ఉన్నాను. మా అన్నయ్య చిరంజీవి షూటింగ్‌లు చేసి ఇంటికి అలిసిపోయి వచ్చేవారు. ఆ టైంలో ఖాళీగా ఉండే నేను.. ఆయన షూస్, సాక్సులు తీసి కాళ్లు తుడిచేవాడిని. ఈ హీరో సినిమా పోవాలని మా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. సర్వేజనా సుఖినోభవంతు అని మా తండ్రి గారు మాకు నేర్పించారు. అందరూ బాగుండాలని మేం కోరుకుంటాం. రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చూస్తే నాకు అసూయగా అనిపిస్తుంది. నాకు హార్స్ రైడింగ్ రాదు. కానీ గబ్బర్ సింగ్ టైంలో హార్స్ రైడింగ్ పెట్టారు. నాకు హార్స్ రైడింగ్ రాదు అని గుర్రం దగ్గరకు వెళ్లి చెప్పా. దానికి క్యారెట్ పెట్టాను. అది నన్ను సురక్షితంగా తీసుకెళ్లింది. కానీ రామ్ చరణ్ మాత్రం హార్స్ రైడింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ చూశాను. నాకు చాలా నచ్చింది. సామాజిక సందేశం ఇచ్చేలా ఉందనిపిస్తోంది. ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరూ క్షేమంగా తిరిగి వెళ్లాలి. మీకు ఏమైనా అయితే నా గుండెకు గాయమైనట్టుగా ఉంటుంది. సినిమాను సినిమాలా చూడండి. టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ప్రతీ టికెట్ మీద జీఎస్టీ ఉంటుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. సినిమా రంగానికి రాజకీయ రంగు పులమడం నాక్కూడా ఇష్టం ఉండదు. అన్ని ఇండస్ట్రీల వ్యక్తులు కలిసి సినిమాల్ని చేస్తున్నారు. హాలీవుడ్‌ని అనుకరించడం కాకుండా మన మూలాల్ని పైకి తెచ్చేలా కథల్ని తీసుకురావాలి. స్వర్గీయ ఎన్టీరామారావు ఎప్పుడూ కూడా ఎవ్వరి మీద వివక్షను చూపించలేదు. చంద్రబాబు గారు సైతం ఎప్పుడూ తెలుగు చిత్ర సీమ అభివృద్దికి దోహద పడుతూనే ఉన్నారు. శంకర్ గారు తీసిన ఒకే ఒక్కడు, శివాజీ వంటివి చూస్తుంటే ఓ తృప్తి కలుగుతుంది. సినిమాలో మంచి చెడులూ ఉంటాయి. ఏది తీసుకోవాలనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. వినోదంతో పాటు ఆలోచింపజేసే చిత్రాలు కూడా రావాలని కోరుకుంటున్నాను. విలువల్ని నేర్పించే చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను. ఆంధ్ర ప్రదేశ్ తరుపున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి, శంకర్ గారికి, దిల్ రాజు, శిరీష్ గార్లకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఎస్ జే సూర్య గారు చాలా మంచి దర్శకులు. ఆయనలో మంచి నటులు కూడా ఉన్నారు. నటుడు కావాలనే కోరిక ఉందని ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. నటుడిగా ఆయన అందరినీ ఆకట్టుకుంటున్నారు. గేమ్ చేంజర్ టీంకు ఆల్ ది బెస్ట్. కొత్త సంవత్సరంలో బాక్సాఫీస్ బద్దలైపోవాలి. మగధీరుడు, అల్లూరి సీతారామరాజుగా జీవించేశాడు.. రామ్ చరణ్ అందరి హీరోలకు చాలా మంచి ఫ్రెండ్.. ఏడాదికి కనీసం వంద రోజులు అయ్యప్ప మాల, ఆంజనేయ స్వామి మాల అని అంటాడు. అహంకారం రాకుండా ఉండాలని చేస్తుంటాని చెబుతుంటాడు. ఆస్కార్ వరకు వెళ్లినా ఒదిగే ఉంటాడు. ఉంటే సూట్‌లో కనిపిస్తాడు.. లేదంటే అయ్యప్ప మాలలో చెప్పులు లేకుండా కనిపిస్తాడు.. రామ్ చరణ్ మా బంగారం.. నా తమ్ముడులాంటి వాడు.. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు.. అద్భుత విజయాలు కలగాలని బాబాయ్‌గానే కాకుండా అన్నగానూ ఆశీర్వదిస్తున్నాను’ అని అన్నారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘రాజమండ్రి బ్రిడ్జ్ మీద పవన్ కళ్యాణ్ గారు మొదటి సారి ర్యాలీ చేసినప్పుడు జన సంద్రం కనిపించింది. మళ్లీ ఇప్పుడు ఇక్కడ కూడా అలానే అనిపిస్తోంది. ఈ ఈవెంట్‌కు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్. సినిమాలో నేను గేమ్ చేంజర్‌ని కావొచ్చు. కానీ ఈ రోజు ఇండియన్ పాలిటిక్స్‌లో పవన్ కళ్యాణ్ గారు రియల్ గేమ్ చేంజర్. పవన్ కళ్యాణ్ గారి లాంటి వారిని చూసే శంకర్ గారు ఇలాంటి పాత్రలని రాసి ఉంటారు. ఇంకో సందర్భంలో మరింతగా మాట్లాడుతాను. నన్ను క్షమించండి’ అని అన్నారు.

శంకర్ మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ ఈవెంట్‌కు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు థాంక్స్. నేను నా కూతురి పెళ్లి శుభలేఖ ఇచ్చేందుకు ఆయన దగ్గరకు వెళ్లాను. ఆయన మిమ్మల్ని ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎంతో చక్కగా మాట్లాడారు. ఆయనతో ఉన్న కొన్ని క్షణాల్లోనే ఎంతో నచ్చేశారు. నా ఇన్నేళ్ల కెరీర్‌లో ఒక్క తెలుగు సినిమా చేయలేదు. అయినా నన్ను ప్రేమిస్తూనే వచ్చారు. ఎలాగైనా ఓ తెలుగు సినిమా చేయాలని అనుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారు, రామ్ చరణ్ గారికి థాంక్స్. తెలుగు లొకేషన్లలోనే షూట్ చేశాం. మినిస్టర్, కలెక్టర్‌కు జరిగే వార్ నేపథ్యంలో సినిమా ఉంటుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ అద్భుతంగా ఉంటుంది. రామ్ చరణ్ గారు తన పాత్రల్లో జీవించేశారు. ఎంతో సహజంగా నటించారు. అంజలి గారు, కియారా గారు, శ్రీకాంత్ గారు, నవీన్ చంద్ర గారు, ఎస్ జే సూర్య గారు ఇలా అందరూ చక్కగా నటించారు. తమన్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. నాకు సపోర్ట్ చేసిన నా టీం అందరికీ థాంక్స్’ అని అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ ఈవెంట్‌కు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్. శంకర్ గారు ఈ కథను చెప్పిన మన రాష్ట్రంలో జరిగే ఎన్నో ఘటనలు గుర్తుకొచ్చాయి. రామ్ చరణ్ గారు మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తారు. రామ్ చరణ్ గారి నటన అద్భుతంగా ఉండబోతోంది. తమన్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. సంక్రాంతికి రాబోతోన్న చిత్రాలకు టికెట్ రేట్ల పెంపు కోసం జీవో ఇచ్చిన ప్రభుత్వానికి థాంక్స్. జనవరి 10న మా చిత్రం రాబోతోంది. పెద్ద విజయం సాధించబోతోన్నామనే నమ్మకంతో ఉన్నామ’ ని అన్నారు.

సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ మాట్లాడుతూ.. ‘ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక నమస్కారాలు. సినిమా సినిమాకి ఎదుగుతూ వస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని ఇక్కడ చూడటం ఆనందంగా ఉంది. ఈ ఈవెంట్‌ ఇక్కడ జరుగుతుండటం సంతోషంగా ఉంది. సినిమా పరిశ్రమకు కావాల్సిన అనుమతులు, ప్రోత్సాహం ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దంగా ఉంది. భారతీయ సినిమా చరిత్రలో ఈ సినిమా గేమ్ చేంజర్‌లా ఉండాలని కోరుకుంటున్నాను. నిర్మాత దిల్ రాజుకు ఆల్ ది బెస్ట్. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ థాంక్స్’ అని అన్నారు.

ఎస్ జే సూర్య మాట్లాడుతూ.. ‘నా స్నేహితుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూస్తుండటం ఆనందంగా ఉంది. ఆయన్ను ఇలా చూడటంతో నాకు మాటలు రావడం లేదు. ఆయన్ను ఇక్కడ చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ ఈవెంట్ చరిత్రలో నిలవబోతోంది. ఆయన రావడమే ఈ ఈవెంట్‌కు ప్రత్యేకత. నా జీవితంలో ఏ ఆర్ రెహమాన్, పవన్ కళ్యాణ్ గారు నా ఆలోచనా ధోరణిని మార్చేశారు. ఖుషి కథ చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని మార్పులు చెప్పారు. ఓ పాటను, మూడు ఫైట్లను యాడ్ చేశారు. మాట ఇస్తే నిలబడాలి అని పవన్ కళ్యాణ్ గారు నాకు నేర్పారు. గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్ గారు రెండు పాత్రల్లో అదరగొట్టేశారు. శంకర్ గారు విజన్, తమన్ గారి మ్యూజిక్ అదిరిపోయింది. రామ్ చరణ్‌తో నాకు ఉండే సీన్లు నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ పర్ఫామెన్స్‌కు అవార్డు వస్తుందని సుకుమార్ గారు చెప్పారు. అప్పన్న పాత్రలో రామ్ చరణ్ ఇరగ్గొట్టేశారు. సంక్రాంతికి రాబోతోన్న ఈ చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ ఈవెంట్‌కు వచ్చిన పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన శంకర్ గారికి థాంక్స్. ఎస్ జే సూర్య గారి నుంచి చాలా నేర్చుకున్నాను. అంజలి గారు, సముద్రఖని గారు ఇలా అన్ని పాత్రలు అద్భుతంగా ఉంటాయి. తమన్ గారు మంచి సంగీతాన్ని అందించారు. సినిమా సినిమాకు రామ్ చరణ్ తన స్థాయిని పెంచుకుంటూనే వెళ్తున్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగే ఉంటాడు. అప్పటికీ ఎప్పటికీ రామ్ చరణ్ బిహేవియర్‌లో ఏమీ మారలేదు. సుకుమార్ గారు చెప్పినట్టు ఈ సినిమాకు జాతీయ అవార్డు రావాలి. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

తమన్ మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ ఈవెంట్‌కు పొలిటికల్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు రావడం ఆనందంగా ఉంది. గేమ్ చేంజర్‌లోని కొండ దేవర పాటను ఈ రోజు ఇక్కడే లైవ్‌లో పాడుతాను. సోల్ ఆఫ్ గేమ్ చేంజర్ సాంగ్‌ను కూడా ఇక్కడే రివీల్ చేస్తున్నాం. ఈ పాటలన్నీ తెరపై అద్భుతంగా ఉండబోతోన్నాయి. జనవరి 10న గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోంది’ అని అన్నారు.

అంజలి మాట్లాడుతూ.. ‘రాజమండ్రిలో ఈవెంట్ జరుగుతుంటే ఆ కిక్కే వేరప్పా. ఇక్కడి నుంచే వెళ్లి హీరోయిన్‌గా మారి.. మళ్లీ ఇప్పుడు గేమ్ చేంజర్ కోసం ఇలా రావడం ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారెతో వకీల్ సాబ్‌లో పని చేశాను. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎదిగారు. ఈ రోజు మాకోసం ఆయన రావడం ఆనందంగా ఉంది. నటిగా డిఫరెంట్ పాత్రలను చేయాలని అందరికీ ఉంటుంది. నా తల్లి పేరు పార్వతి. ఈ చిత్రంలో నేను పోషించిన కారెక్టర్ నేమ్ పార్వతి. నాకు ఈ కారెక్టర్ చాలా టచ్ అయింది. నాకు ఇంత మంచి పాత్రను రాసిన, ఇచ్చిన శంకర్ గారికి థాంక్స్. దిల్ రాజు గారి ప్రొడక్షన్స్‌లో నేను చేస్తున్న మూడో చిత్రమిది. తమన్ సంగీతం బాగుంది. ఈ రోజు ఇక్కడ వినబోయే సాంగ్ నాకు చాలా స్పెషల్. రామ్ చరణ్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. మా కోసం ఇక్కడకు వచ్చిన ఆడియెన్స్, అభిమానులకు థాంక్స్. జనవరి 10న గేమ్ చేంజర్ రాబోతోంది. అందరూ థియేటర్లోనే సినిమాను చూడండి’ అని అన్నారు.

Tfja Team

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

3 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

4 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

2 weeks ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 weeks ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

2 weeks ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

2 weeks ago