టి.డి.ఆర్ సినిమాస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్.1 గా కుంచం శంకర్ దర్శకత్వంలో తలారి దినకరణ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు గురువారం (ఆగస్ట్ 21) నాడు ఘనంగా జరిగాయి. ముహుర్తపు సన్నివేశానికి రామ్ అబ్బరాజు క్లాప్ నివ్వగా, ప్రశాంత్ కుమార్ దిమ్మెల కెమెరా స్విచాన్ చేసి గౌరవ దర్శకత్వం వహించారు. రామ్ అబ్బరాజు, ప్రశాంత్ దిమ్మెల, అడిదాల విజయ్‌పాల్ రెడ్డి స్క్రిప్ట్ అందించారు. పవన్ కేసరి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించనుండగా.. కెమెరామెన్‌గా సాయి పని చేయనున్నారు. ఇక ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా…
డైరెక్టర్ కుంచం శంకర్ మాట్లాడుతూ .. ‘మా చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన మీడియాకు థాంక్స్. నాకు సహకరించి ఇక్కడకు వచ్చిన మా మూవీ టీంకు థాంక్స్’ అని అన్నారు.
విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ .. ‘మా మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నేను ఇంత వరకు కొత్త దర్శకులతోనే పని చేశాను. శంకర్ గారు మంచి కథను రాసుకున్నారు. ఈ కథ నాకు చాలా నచ్చింది. మంచి ట్యూన్స్ వస్తున్నాయి. పవన్ పెద్ద హీరో అవుతాడని అనిపిస్తోంది. కావ్య గారు ఈ మూవీకి పెద్ద ఎస్సెట్ అవుతారు. విప్లవ్ గారితో బేబీ మూవీకి పని చేశాను. మాలాంటి కొత్త వారిని ఎంకరేజ్ చేస్తున్న దినకరణ్ గారికి థాంక్స్’ అని అన్నారు.
త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మిగిలిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
నటీనటులు: పవన్ కేసరి, కావ్యా కళ్యాణ్ రామ్, సుగుణ, సుప్రియ, దివిజ ప్రభాకర్, మొయిన్ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: టి.డి.ఆర్.సినిమాస్
దర్శకత్వం: కుంచం శంకర్
నిర్మాత: తలారి దినకరన్ రెడ్డి
మ్యూజిక్: విజయ్ బుల్గానిన్
ఎడిటర్: విప్లవ్
ఆర్ట్: క్రాంతి ప్రియం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఐ.జి.సంతోష్
కాస్ట్యూమ్స్: శ్రీదేవి తెతాలి
పి.ఆర్.ఒ: వంశీ కాకా
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…