హుషారు వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తేజస్ కంచర్ల. ఇప్పుడు మరింతగా ప్రేక్షకులకు దగ్గరయ్యే కథాంశాలతో సినిమాలు చేయటంపై తన దృష్టిని సారిస్తున్నారు. అందులో భాగంగా తేజస్ చేస్తోన్న తాజా చిత్రం ‘ఉరుకు పటేల’తో ఆడియెన్స్‌ను అలరించబోతున్నారు.‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్. సెప్టెంబర్ 13న సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ మూవీ నుంచి ‘పట్నం పిల్ల..’ అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఇది గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగాల ప్రధానంగా సాగే చిత్రం. లిరికల్ సాంగ్ గమనిస్తే.. హీరోయిన్ పట్నం నుంచి సెలవులకు పల్లెటూరుకి వస్తుంది. అక్కడ హీరో ఆమెను చూసి మనసు పారేసుకుంటాడు. తన మనసులోని ప్రేమలో తెలియజేసేందు తను పడే పాట్లు, మనసులోని భావాలను వ్యక్తం చేసే పాట ఇదని అర్థమవుతుంది. ఈ చిత్రానికి ప్రవీన్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. ‘పట్నం పల్ల..’ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.
లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాల భాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…