పంజా వైష్ణవ్ తేజ్ ,సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ చిత్రం

*’పంజా వైష్ణవ్ తేజ్ ‘ హీరోగా ‘శ్రీ లీల‘ నాయికగా  సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం

* వైష్ణవ్ తేజ్ మాస్ అవతారం ఈ చిత్రం

*దర్శకుడు గా శ్రీకాంత్.ఎన్.రెడ్డి పరిచయం

*ముగింపు దశలో చిత్రం షూటింగ్ 

*ఆకట్టుకుంటున్న విడుదల తేదీ ప్రచార చిత్రం

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో రూపు దిద్దు కుంటున్న  చిత్రం షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీకాంత్.ఎన్.రెడ్డి దర్శకుడు గా  ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. కథానాయికగా ‘శ్రీ లీల‘ నటిస్తున్న ఈ చిత్రాన్ని

నిర్మాతలు ఎస్. నాగవంశీ , సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు. 
ఆంగ్ల సంవత్సరాది శుభ వేళ ఈ చిత్రానికి సంభందించి ఓ ప్రచార చిత్రాన్ని ఈరోజు విడుదల చేసింది చిత్ర యూనిట్. 29 ఏప్రిల్, 2023 న చిత్రం విడుదల అన్నది ఈ ప్రచార చిత్రం లో గమనించ వచ్చు. తీగల కంచె ఆవల అస్పష్టంగా కనిపిస్తూ కథానాయకుడు నిలుచున్న తీరు, మరో వైపు కంచె తగలబడుతున్న  వైనం, ఆసక్తిని రేకెత్తిస్తూ, ఆకట్టుకుంటోంది ఈ విడుదల

 తేదీ ప్రచార చిత్రం.

తొలిచిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం అనిపిస్తుంది. ఈ విషయాన్ని గతంలో 

పౌరుషా నికి ప్రతీకగా విడుదల అయిన ప్రచార చిత్రం నిరూపించింది. అంతేకాదు భారీస్థాయిలో చిత్ర నిర్మాణం జరుగుతోంది.

వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం. పూరి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ చిత్రం అంటున్నారు చిత్ర దర్శక,నిర్మాతలు. 

ఇప్పటికే చిత్రం చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్రం టైటిల్, అలాగే చిత్రానికి  సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు 

డి ఓ పి: డుడ్లే

ప్రొడక్షన్ డిజైనర్: ఎ ఎస్ ప్రకాష్ఎడిటర్: నవీన్ నూలిసమర్పణ: శ్రీకర స్టూడియోస్

నిర్మాతలు ఎస్. నాగవంశీ , సాయి సౌజన్య.

రచన- దర్శకత్వం: శ్రీకాంత్.ఎన్.రెడ్డి 

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

13 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

13 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

13 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago