*’పంజా వైష్ణవ్ తేజ్ ‘ హీరోగా ‘శ్రీ లీల‘ నాయికగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం
* వైష్ణవ్ తేజ్ మాస్ అవతారం ఈ చిత్రం
*దర్శకుడు గా శ్రీకాంత్.ఎన్.రెడ్డి పరిచయం
*ముగింపు దశలో చిత్రం షూటింగ్
*ఆకట్టుకుంటున్న విడుదల తేదీ ప్రచార చిత్రం
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో రూపు దిద్దు కుంటున్న చిత్రం షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీకాంత్.ఎన్.రెడ్డి దర్శకుడు గా ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. కథానాయికగా ‘శ్రీ లీల‘ నటిస్తున్న ఈ చిత్రాన్ని
నిర్మాతలు ఎస్. నాగవంశీ , సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు.
ఆంగ్ల సంవత్సరాది శుభ వేళ ఈ చిత్రానికి సంభందించి ఓ ప్రచార చిత్రాన్ని ఈరోజు విడుదల చేసింది చిత్ర యూనిట్. 29 ఏప్రిల్, 2023 న చిత్రం విడుదల అన్నది ఈ ప్రచార చిత్రం లో గమనించ వచ్చు. తీగల కంచె ఆవల అస్పష్టంగా కనిపిస్తూ కథానాయకుడు నిలుచున్న తీరు, మరో వైపు కంచె తగలబడుతున్న వైనం, ఆసక్తిని రేకెత్తిస్తూ, ఆకట్టుకుంటోంది ఈ విడుదల
తేదీ ప్రచార చిత్రం.
తొలిచిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం అనిపిస్తుంది. ఈ విషయాన్ని గతంలో
పౌరుషా నికి ప్రతీకగా విడుదల అయిన ప్రచార చిత్రం నిరూపించింది. అంతేకాదు భారీస్థాయిలో చిత్ర నిర్మాణం జరుగుతోంది.
వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం. పూరి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ చిత్రం అంటున్నారు చిత్ర దర్శక,నిర్మాతలు.
ఇప్పటికే చిత్రం చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్రం టైటిల్, అలాగే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు
డి ఓ పి: డుడ్లే
ప్రొడక్షన్ డిజైనర్: ఎ ఎస్ ప్రకాష్ఎడిటర్: నవీన్ నూలిసమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాతలు ఎస్. నాగవంశీ , సాయి సౌజన్య.
రచన- దర్శకత్వం: శ్రీకాంత్.ఎన్.రెడ్డి
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…