యూత్ బేస్డ్ లవ్ స్టోరీస్ ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటాయి. ప్రేమలోని సంఘర్షణ, ఎమోషన్స్ మీద తీసే చిత్రాలు ఎవర్గ్రీన్ గా ఉంటాయి. ప్రస్తుతం “ప్రేమికుడు” నేటి తరానికి, ట్రెండ్ కి తగ్గట్టుగా సాగే ఓ రా అండ్ బోల్డ్ రొమాంటిక్ చిత్రం. రామ్ వెలుగు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పండు చిరుమామిళ్ల ప్రధాన పాత్రలో నటించారు. గురుదేవ్ స్టోరీ టెల్లర్స్ బ్యానర్‌పై రామ్ యాదవ్ గొట్టె, చెరుకూరి సాయి కుమార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పండు చిరుమామిళ్ల బోల్డ్ అండ్ ఇంటెన్స్ పాత్రను పోషించినట్టుగా కనిపిస్తున్నారు. “అన్‌ఫిల్టర్డ్” అనే ట్యాగ్‌లైన్ తో ఈ సినిమా ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. పోస్టర్‌లో హీరో నేలపై నగ్నంగా పడుకుని ఉండటం, ఆ సిగరెట్, చేతికి సంకెళ్ళు, శరీరంపై రక్తపు మరకలు చూస్తోంటే అందరినీ మెస్మరైజ్ చేసేట్టుగా ఉన్నాయి.
ఈ మూవీకి ఆదిత్య లొల్ల సినిమాటోగ్రాఫర్ కాగా, చీదెళ్ల నాగార్జున రచయితగా పని చేస్తున్నారు. ఇతర వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.
తారాగణం: పండు చిరుమామిళ్ల తదితరులు
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: గురుదేవ్ స్టోరీ టెల్లర్స్
నిర్మాతలు – రామ్ యాదవ్ గొట్టె, చెరుకూరి సాయి కుమార్
దర్శకుడు: రామ్ వెలుగు
DOP – ఆదిత్య లోల్ల
రచయిత: చీదెళ్ల నాగార్జున
పోస్టర్ డిజైనర్: గౌతమ్ అంబటి
PRO: సాయి సతీష్