‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొన్న పాన్ ఇండియా నటుడు సముద్రఖని

Must Read

‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ లో భాగంగా దర్శకుడు ఎం.శశికుమార్ ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించిన ‘పాన్ ఇండియా నటుడు సముద్రఖని’ ఈరోజు హైటెక్ సిటీ లోని శిల్పారామంలో రావి మొక్కను నాటారు.

ఈ సందర్భంగా నటుడు సముద్రఖని మాట్లాడుతూ.. ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ లో పాల్గొనే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు. ప్రకృతి పచ్చగా ఉంటేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారని, ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ను గొప్ప సామాజిక ఉద్యమంగానే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యతగానూ తీర్చిదిద్దిన అధినేత జోగినపల్లి సంతోష్ కుమార్ గారు మరియు నిర్వాహకుల నిరంతర కృషి ఎంతో ప్రశంసనీయం. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నేను నా ఇంటి నుంచే మొదలు పెడుతున్నాను.

ఈ బృహత్తర ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి నా కుమారుడు హరివిఘ్నేశ్వరన్, కూతురు శివానీ మరియు ప్రముఖ దర్శకులు హెచ్.వినోత్ లకు సినీ నటుడు సముద్రఖని ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ను విసిరాడు.

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News