బాలయ్య బెస్ట్ విషష్ తో పైలం పిలగా సెప్టెంబర్ 20న థియేటర్స్ లో

‘పైలం పిలగా’ ఈ వారం సెప్టెంబర్ 20న థియేటర్ లో సందడి చేయబోతున్న సినిమా. ‘పిల్ల పిలగాడు’ వెబ్ సిరీస్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సాయి తేజ హీరో గా, పుష్ప , పరేషాన్ చిత్రాలతో వెలుగులోకి వచ్చిన పావని కరణం హీరోయిన్ గా, యాడ్ ఫిలిం మేకర్ ఆనంద్ గుర్రం దర్శకత్వంలో తెరకెక్కింది. మొదటి సింగల్ ‘సోడు సోడు ‘  పాటను దర్శకుడు శేఖర్ కమ్ముల గారు రిలీజ్ చేయగా, టీజర్ ని డైరెక్టర్ హరీష్ శంకర్ గారు, ట్రైలర్ ను డైరెక్టర్ వెంకటేష్ మహా గారు లాంచ్ చేసారు . 

మంచి పాటలు,  ఎంటర్టైనింగ్ టీజర్, ఎంగేజింగ్  ట్రైలర్ ప్రేక్షుకుల దృష్టిలో పడి, సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇటీవల బాలయ్య బాబు గారు ఈ  ‘పైలం పిలగా’ చిత్ర టీజర్, ట్రైలర్ ను చూసి మూవీ టీంని ప్రశంసించడం విశేషం. టీజర్, ట్రైలర్ లోని  డైలాగ్స్ ను ఎంజాయ్ చేస్తూ నటీనటులు, సాంకేతిక వర్గం, షూటింగ్ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. నా మొట్ట మొదటి యాడ్ డైరెక్ట్ చేసిన ఆనంద్ గుర్రం మొట్ట మొదటి సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నా అంటూ మూవీ టీం కి అల్ ది బెస్ట్ చెప్పారు.

  పైసాను ప్రేమించే పిలగాడు, ప్రకృతిని ప్రేమించే పిల్ల. మేఘాల్లో మేడలు కట్టుకోవాలని కలలు కనే మొనగాడు, చెట్టు కింద చిన్న గూడు చాలు అనుకునే  అమ్మాయి మధ్య చిగురించిన ప్రేమ ఒకవైపు, ఎక్కడికైనా సరే,  ఎంత దూరమైనా సరే వెళ్లి కోట్లు సంపాదించి తన ఊళ్ళో కింగ్ అనిపించుకోవాలనే ఆరాటం ఇంకోవైపు, ఈ ఈస్ట్ వెస్ట్ సంఘర్షణని వినోదాత్మకంగా తెలిపే హాస్యభరిత వ్యంగ చిత్రం ‘పైలం పిలగా’.

హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ లో  మొదటి చిత్రం ‘పైలం పిలగా’ ను  రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు. డబ్బింగ్  జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. యశ్వంత్ నాగ్ ఆరు అద్భుతమైన పాటలతో మెలోడియస్ సంగీతాన్ని అందించారు. కెమెరా సందీప్ బద్దుల, ఎడిటింగ్ రవితేజ, శైలేష్ దరేకర్, స్టైలిస్ట్ హారిక పొట్ట, లిరిక్స్ ఆనంద్ గుర్రం, అక్కల చంద్రమౌళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ ఒడ్నాల పనిచేసిన ఈ చిత్రానికి రవి వాషింగ్టన్, కృష్ణ మసునూరి, విజయ్ గోపు సహా నిర్మాతలుగా వ్యవహరించారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

21 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

22 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

22 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago