మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ‘వార్ 2’ టీజర్‌కు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ YRF స్పై యూనివర్స్ ఫ్రాంచైజ్‌లో రానున్న ‘వార్ 2’ ఇప్పుడు ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది. ‘వార్ 2’ టీజర్ మీద ప్రేక్షకులు కురిపిస్తున్న ప్రేమకు ఎన్టీఆర్ ఉప్పొంగిపోయారు.
ఈ మేరకు ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘ప్రజల నుండి వస్తున్న ప్రేమ, ప్రశంసలను చూస్తుంటే నేను నటుడిని అయినందుకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఇంతటి ప్రేమ లభించడం చూస్తుంటే ఇదొక వరంలా అనిపిస్తుంది. మీరు చూపించే ఈ ప్రేమ నాకు చాలా విలువైనది. ‘వార్ 2’ మీద మీరు చూపిస్తున్న ప్రేమకు థాంక్స్. ఈ YRF స్పై యూనివర్స్ చిత్రంలో నన్ను పూర్తిగా కొత్తగా చూపించారు. ఈ మూవీ కోసం మేం అంతా కూడా ఎంతో సరదాగా కలిసి పని చేశాం. దేశంలోని ప్రతి మూల నుంచి వస్తున్న ప్రేమను చూసి నేను ఉప్పొంగిపోయాను.
“ఈ పాత్ర నాకు చాలా ప్రత్యేకమైనది. వార్ 2 కోసం ఇంతలా ఎదురు చూస్తున్నారు.. థియేటర్లో మీ స్పందన చూడటం నాకు మరింత ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. YRF స్పై యూనివర్స్ ఎల్లప్పుడూ కొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. YRF స్పై యూనివర్స్ బాక్సాఫీస్ బెంచ్‌మార్క్‌లను సృష్టిస్తుంది. మా ‘వార్ 2’ ఒక్క టీజర్‌తోనే ఇంతటి ప్రభావం చూపించడం, ఆడియెన్స్‌పై ముద్ర వేయడం చూసి నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. ఆగస్టు 14 నుండి థియేటర్లలో అభిమానుల సందడి చూసేందుకు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను’ అని అన్నారు.
ఆదిత్య చోప్రా నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘వార్ 2’లో కియారా అద్వానీ కథానాయికగా నటించారు. ఆగస్టు 14న హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో ‘వార్ 2’ భారీ ఎత్తున విడుదల కానుంది.
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…
శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…