‘’మళ్ళీ పెళ్లి’ చిత్రాన్ని కృష్ణ గారికి అంకితం చేస్తున్నాను: నరేష్

సూపర్ స్టార్ కృష్ణ గారి 81వ జన్మదినోత్సవం సందర్భంగా ‘’మళ్ళీ పెళ్లి’ చిత్రాన్ని సవినయంగా  కృష్ణ గారికి అంకితం చేస్తున్నాను: ‘మళ్ళీ పెళ్లి’ బోల్డెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో డా. నరేష్ వి.కె

నవరసరాయ డా. నరేష్ వి.కె గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్ళీ పెళ్లి’. మెగా మేకర్ ఎంఎస్ రాజు రచన, దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో పవిత్ర లోకేష్ కథానాయికగా నటించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 26న విడుదలైన ఈ చిత్రం బోల్డెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ వేడుకలో చిత్రసీమలో50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రిటీ వరల్డ్ రికార్డ్ నిర్వాహకులు డా. నరేష్ వి.కె ను సెలబ్రెటీ వరల్డ్ రికార్డ్ తో సత్కరించారు.

సక్సెస్ మీట్ లో డా. నరేష్ వి.కె మాట్లాడుతూ.. ఒక సినీ కుటుంబంలో పుట్టడం, సినిమాల్లోకి రావడం, 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. తన భార్య ఆలోచనలని ప్రజల్లోకి తీసుకు రావడానికి సూపర్ స్టార్ కృష్ణ గారు విజయ కృష్ణ మూవీస్ ప్రారంభించారు. ఇది ప్రపంచంలో చాలా అరుదు. రియల్ బోల్డెస్ట్ కపుల్ అంటే కృష్ణ గారు, విజయ నిర్మల గారు. వాళ్ళ రథం మళ్ళీ ముందుకు వెళ్లాలని విజయ్ కృష్ణ మూవీస్ మళ్ళీ ప్రారంభించాను. చాలా సంతోషంగా గర్వంగా వుంది. మళ్ళీ పెళ్లి కి వచ్చిన రిజల్ట్ తో కృష్ణగారు, విజయ నిర్మల గారి ఆశీస్సులు అందుకున్నాం.

సూపర్ స్టార్ కృష్ణ గారి 81వ జన్మదినోత్సవం సందర్భంగా సవినయంగా సగర్వంగా మళ్ళీ పెళ్లి చిత్రాన్ని కృష్ణ గారికి అంకితం చేస్తున్నాను. యంఎస్ రాజు ఈ కథ చెప్పినపుడు ఇలాంటి సినిమా విజయ్ కృష్ణ మూవీస్ ఖచ్చితంగా రావాలని అనుకున్నాం. ఎంటర్ టైన్ మెంట్, మెసేజ్ కలిపితే మళ్ళీ పెళ్లి. ఈ సినిమాని  నేను, పవిత్ర, టీం అంతా ఇష్టపడి చేశాం. రాజు గారు అద్భుతమైన సినిమా ఇచ్చారు. మాస్ క్లాస్ యూత్ ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు.

ఫ్యామిలీ ఆడియన్స్ రోజురోజుకి పెరుగుతున్నారు. సురేష్ ప్రొడక్షన్ వారికి కృతజ్ఞతలు. చాలా అద్భుతంగా డిస్ట్రిబ్యుట్ చేశారు. మా పీఆర్వో వంశీ శేఖర్ టీంకి కృతజ్ఞతలు. జునైద్ చాలా అద్భుతంగా ఎడిట్ చేశారు. బాల్ రెడ్డి ఎక్స్ లెంట్ విజువల్స్ ఇచ్చారు. సురేష్ బొబ్బిలి, ఆరుళ్ దేవ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మళ్ళీ పెళ్లి మ్యూజికల్ హిట్. శరత్ బాబు గారిని చాలా మిస్ అవుతున్నాను.

జయప్రద గారు నా పక్కన ఎప్పుడూ ఒక అమ్మగా నిలబడుతుంది. ఆమె ఈ పాత్ర చేయడం ఆ పాత్రకి నెక్స్ట్ లెవల్ ఎలివేషన్ వచ్చింది.  మీడియా ఎంతగానో సహకరించింది. చాలా మంచి రివ్యూలు ఇచ్చారు. కన్నడ వెర్షన్ ని త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. ఒక తెలుగు నటుడిగా చాలా గర్వంగా వుంది. కన్నడ రిలీజ్ తర్వాత పెద్ద ఓటీటీ రిలీజ్ వుంటుంది. నేను బ్రతికున్నంత కాలం యాక్టింగే చేస్తా. మంచి కథలు వుంటే తీస్తా. సోషల్ సర్విస్ చేస్తా. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’’ తెలిపారు.

పవిత్ర లోకేష్ మాట్లాడుతూ.. జీవితానికి సంబధించిన సీక్రెట్స్ కి ఎవరూ బయటికి చెప్పారు. కానీ కొన్ని సార్లు సీక్రెట్లు చెప్పాల్సిన అవశ్యత వుంటుంది. ఇది సమాజంలోని కథ అనుకుంటే మేము గెలిచినట్లే. మళ్ళీ పెళ్లి చిత్రాన్ని విమర్శనాత్మకంగా సపోర్ట్ చేస్తున్నారు. యంఎస్ రాజు గారు చాలా అందమైన చిత్రం తీశారు. ఆయన అనుభవం అంతా ఈ సినిమాలో కనిపిస్తుంది. మళ్ళీ పెళ్లి చిత్రం నరేష్ గారి వలనే సాధ్యమైయింది. ఈ చిత్రంలో విజయ కృష్ణ మూవీస్ ని మళ్ళీ ప్రారంభించడం ఆనందంగా వుంది. ఇందులో నా పాత్ర ద్వారా మహిళలు వారి హక్కుల కోసం నిలబడితే  ఆనందపడతాను. సమాజం మహిళని గౌరవిస్తే ఆనందంగా పడతాను అన్నారు.

సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ .. ‘మళ్ళీ పెళ్లి’ సినిమాని ఇంత పెద్ద విజయం ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన నరేష్ గారికి, యంఎస్ రాజు  గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ తెలిపారు. ఈ సక్సెస్ మీట్ లో రవి వర్మ,  అన్నపూర్ణ, వరప్రసాద్ మిగతా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago