బాబాయ్ నన్ను ఆదరించినట్లే అభిరామ్ ని కూడా ఆదరిస్తారని కోరుతున్నాను: రానా దగ్గుబాటి

బాబాయ్ విక్టరీ వెంకటేష్ గారిని, నన్ను ఆదరించినట్లే అభిరామ్ ని కూడా ఆదరిస్తారని కోరుతున్నాను: ‘అహింస’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రానా దగ్గుబాటి

*జూన్ 2న అహింసతో మళ్ళీ పుడుతున్నాను : అభిరామ్

*రామానాయుడు గారి కోసం అహింస సినిమా చేశాను: డైరెక్టర్ తేజ

వెండితెరపై వైవిధ్యమైన ప్రేమ కథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస ‘తో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌ పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. జూన్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ చీరాలలో గ్రాండ్ గా నిర్వహించారు. హీరో రానా దగ్గుబాటి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. చీరాలకు రావడం చాలా ఆనందంగా వుంది. ఈ రోజు మేమ్ ఏం చేసినా,  ఎంత దూరం వెళ్ళినా అది మా తాతగారు వేసిన ఫ్లాట్ ఫాం. తేజ గారు ఆయనకి నచ్చిన వ్యక్తులతోనే సినిమా చేస్తారు. నాకు ,ఆయనకు వున్న సింక్ ఏ డైరెక్టర్ యాక్టర్ కి ఉండదు. ఆయనతో ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. నన్ను నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఒక రీజనబుల్ గుడ్ లుకింగ్ ఫెలో నుంచి యాక్టర్ గా చేసింది డైరెక్టర్ తేజ గారే. అలాంటి దర్శకుడి చేతిలో మా తమ్మడు లాంచ్ అవ్వడం చాలా ఆనందంగా వుంది. అభి.. ఆల్ ది వెరీ బెస్ట్. బాబాయ్ విక్టరీ వెంకటేష్ గారిని, నన్ను ఆదరించినట్లే అభిని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాతో లాంచ్ అవుతున్న నటీనటులందరికీ ఆల్ ది బెస్ట్. తేజ గారు ఆర్పీ గారి కాంబినేషన్ ని మళ్ళీ చూడటం ఆనందంగా వుంది. మా బ్రదర్ ని లాంచ్ చేస్తున్న నిర్మాత కిరణ్ గారికి థాంక్స్. జూన్ 2 సినిమా విడుదలవుతుంది. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’’ తెలిపారు    

అభిరామ్ మాట్లాడుతూ.. వెంకటేష్ గారి అభిమానులకు, రానా ఫ్యాన్స్ కి.. అందరికీ కృతజ్ఞతలు. చిన్నప్పటి నుంచి తాతతో చాలా సెట్స్ లో తిరిగాను. నాకు సినిమా అంటే చాలా ఇష్టం. నన్ను హీరోగా చూడాలనేది తాత గారి కోరిక. ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ వుంటాయి. తేజ గారు ఈ సినిమాతో నన్ను లాంచ్ చేశారు. ఎంతోమంది హీరోలకు ఆయన లైఫ్ ఇచ్చారు. నాకు కూడా ఒక లైఫ్ ఇచ్చారు. దాన్ని ఫుల్ ఫిల్ చేసుకుంటానని చెబుతున్నాను. కిరణ్ గారు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఆర్పీ పట్నాయక్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. తేజ గారు ఆర్పీ గారి కాంబో మళ్ళీ రిపీట్ అవుతుంది. నాన్న, అమ్మా, బాబాయ్, అన్న.. నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళే నా పిల్లర్స్. జూన్ 6 తాతగారి బర్త్ డే. జూన్ 2న అహింస తో మళ్ళీ నేను పుడుతున్నాను. ఆయన బర్త్ డే మంత్ లో నా సినిమా విడుదలౌతుంది. తాత నా పక్కనే ఉంటారు. ఈ సినిమాతో నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ తాత. ఐ లవ్ యూ’’ అన్నారు

తేజ మాట్లాడుతూ..నేను రకరకాల మందిని పరిచయం చేశాను. అభిరాంనే ఎందుకు పరిచయం చేయాలి ? అభిరాం వాళ్ళకే సొంత నిర్మాణ సంస్థ ఉంది. వాళ్ళే చేసుకోవచ్చు. కానీ దీనికి కారణం రామానాయుడు గారు ఉన్నప్పుడు మా మనవడితో సినిమా చేయాలని అడిగారు. చేస్తానని చెప్పాను. తర్వాత ఆయన ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. కొన్నిరోజుల తర్వాత ఆయన వెళ్ళిపోయారు. అక్కడి నుంచి నాకు గిల్ట్ పట్టుకుంది. అంత పెద్ద మనిషి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా మాట తప్పాననే గిల్ట్ ఉండిపోయింది. అప్పుడు అభిరాం కోసం కథ రెడీ చేశాను. సురేష్ గారికి చెబితే ఆయన పెద్ద ఆసక్తి చూపలేదు. తర్వాత సరే అన్నారు. ఈ సినిమా రామానాయుడు గారి గురించి చేశాను. అంతకుముందు రానా తో నేనే రాజు నేనే మంత్రి సినిమా చేశాను.  మళ్ళీ రానా గారితో సినిమా చేయబోతున్నా. ఈ సినిమాకి రాక్షస రాజు అనే పేరు అనుకుంటున్నాను.  అహింస తో అభిరాం, గీతిక పరిచయం అవుతున్నారు. ఇద్దరిని చాలా కష్ట పెట్టా. నా దెబ్బకి సగం అయిపోయారు(నవ్వుతూ) చీరాలలో ఈ వేడుక జరగడం ఆనందంగా వుంది’’ అన్నారు.

గీతికా మాట్లాడుతూ.. ఈ రోజు నేను ఇక్కడ నిలబడటానికి కారణం తేజ గారు. ఆయనకి పాదాభివందనం. కిరణ్ గారికి, సురేష్ గారికి కృతజ్ఞతలు. జూన్  2న అందరూ సినిమా చూడండి’’ అని కోరారు

ఎమ్మెల్యే కరణం బలరాం మాట్లాడుతూ…రామానాయుడు గారితో మాకు ఎంతో అనుబంధం వుంది. రామానాయుడు గారి కుటుంబం ఇచ్చిన డొనేషన్స్ తో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.  అభి హీరోగా పరిచయం కావడం ఆనందంగా వుంది. అభి భవిష్యత్తు బాగుండాలి. మీ అందరి ఆశీస్సులు అభి పై వుండాలి’’ అని కోరారు.

సురేష్ బాబు మాట్లాడుతూ.. అభిని నటుడిగా చూడటం  మా నాన్నగారి కోరిక. నేను ఆయనకి మాటిచ్చాను. అభితో నేను సినిమా తీస్తున్నాను’’ అని తేజ చెప్పారు. నటుడు కావాలనేది అభి డ్రీమ్. ఆ డ్రీమ్ కిరణ్ తేజ వలన తీరింది. ఈ వేడుక చీరాలలో చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ వూరిలో చాలా జ్ఞాపకాలు వున్నాయి. ఎమ్మెల్యే  బలరాం గారు, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గారు ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు  

శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రామానాయుడు గారు మా కుటుంబానికి ఆప్తులు. నాకు గురు సమానులు. సినిమా అంటే ఆయనకి ప్రాణం, ఊపిరి. దేశంలోని అన్ని భాషల్లో సినిమాలు తీసిన మూవీ మొఘల్. సురేష్ బాబు, వెంకటేష్ బాబు లని కూడా సినిమాల్లో ప్రోత్సహించారు. తర్వాత మూడో జనరేషన్ కోసం ఎదురు చూశారు. రానా ని పరిచయం చేశారు. అభిని కూడా నటుడ్ని చేయాలనే కోరిక ఆయనకి ఉండేది. ఆ కల ఈ రోజు నిజం కావడం ఆనందంగా వుంది. తేజ చాలా విలక్షణమైన దర్శకుడు. ప్రతిభను గుర్తించి బయటికి తీసుకు వచ్చే దర్శకుడు. రామానాయుడు గారు అభిని ఆశీర్వదిస్తున్నారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు.

ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. అభిరాం ని పరిచయం చేస్తూ తేజగారు, ఆనంది ఆర్ట్స్, మేము అందరం కలసి చేసిన ఈ సినిమా చాలా బాగా వచ్చింది. మళ్ళీ జయం స్టైల్ లో పవర్ ప్యాక్డ్ సినిమా ఇది. మీ అందరికీ నచ్చుతుంది. అభి చాలా కష్టపడ్డాడు. తన కష్టానికి తగిన ఫలితం ఇవ్వాలని కోరుకుంటున్నాను. తేజ గారి చేతిలో కొత్త వాళ్ళు ఆణిముత్యాలు అవుతారు. ఆ వరుసలో అభి కూడా ఓ పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.

అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. నువ్వు నేను సినిమాకి కీబోర్డ్ ప్లేయర్ గా చేశాను. ఇప్పుడు అహింసకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశాను. తేజ గారికి కృతజ్ఞతలు. తేజ గారి స్టైల్ సినిమా ఇది. అభి ఈ చిత్రంతో పెద్ద స్టార్ అవుతారు.  

మనోజ్ టైగర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నా భోజ్ పురి సినిమాని రామానాయుడు గారు ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు అభిరాం సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. వెంకటేష్ గారిని, రానా గారిని ఎలా ఐతే ప్రేమించారు అలాంటి ప్రేమ అభిమానం అభిరాంకి ఇవ్వాలి” అని కోరారు

కమల్ కామరాజు మాట్లాడుతూ.. తేజ గారి లాంటి దర్శకులతో పని చేయాలని ఎప్పటి నుంచో వుండేది. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. తేజ గారి నుంచి కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో వున్నాయి. ఇందులో చాలా పవర్ ఫుల్ రోల్ చేశాను. ఈ సినిమా ద్వారా చాలా మంది ఆర్టిస్ట్ లు బయటికి వస్తారు. అభిరాం అద్భుతంగా చేశారు. థియేటర్ లో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు” అన్నారు

రజిత్ బేడి మాట్లాడుతూ .. బాలీవుడ్ లో దాదాపు 50 సినిమాలకు పైగా చేశాను. ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కావడం ఆనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన తేజ గారికి కృతజ్ఞతలు. నిర్మాత కిరణ్ గారి థాంక్స్. మీ అందరి ఆశీస్సులు కావాలి” అన్నారు.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

21 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago