సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పాటలను, సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ గౌరవిస్తారు. ప్రాంతీయ సంస్కృతికి పెద్దపీట వేస్తూ రూపొందుతోన్న చిత్రాలకు భారీ విజయాలు అందిస్తున్నారు. తెలుగు సినిమాల్లో తెలంగాణ పండుగ బతుకమ్మ నేపథ్యంలో పాటలు అప్పుడప్పుడూ వినబడుతున్నాయి. ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అందులో కొత్తేమీ లేదు. బాలీవుడ్ సినిమాలో బతుకమ్మ పాట వినబడితే… విశేషమే కదా!
బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన బాలీవుడ్ సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. ఆయన సరసన బుట్ట బొమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమాలో తెలంగాణ సంస్కృతిలో భాగమైన, ఆడబిడ్డల మనసుకు దగ్గరైన బతుకమ్మ పండుగ నేపథ్యంలో పాటను రూపొందించారు.
‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లో బతుకమ్మ పాటను నేడు విడుదల చేశారు. అందులో భలే ముద్దు ముద్దుగా పూజా హెగ్డే నృత్యం చేశారు. తెలంగాణ పల్లె సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా పాటను చిత్రీకరించారు. లంగా వోణి వేసి, కొప్పులో మల్లెపూలు పెట్టి, మెడ నిండా నగలతో బతుకమ్మ పాటలో పూజా హెగ్డే తెలంగాణ పడుచులా పూజా హెగ్డే నృత్యం చేస్తుంటే అలా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్, సల్మాన్ ఖాన్ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించడం ఈ పాట ప్రత్యేకత.
బతుకమ్మ పాట గురించి బుట్ట బొమ్మ పూజా హెగ్డే మాట్లాడుతూ ”బతుకమ్మ పర్వదినం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భారతీయ సంస్కృతిలో పువ్వులను పూజించే గొప్ప పండుగ ఇది. తెలంగాణ అమ్మాయిలు సంబరంగా చేసుకునే, ఎంతో విశిష్టత ఉన్న బతుకమ్మ పండుగ పాటలో నేను కనిపించడం ఆనందంగా ఉంది. సల్మాన్ ఖాన్ గారు, వెంకటేష్ గారు, భూమిక గారితో పాటలో సందడి చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. తెలంగాణ బతుకమ్మ పండుగకు మా టీమ్ నుంచి భక్తితో సమర్పించిన కానుక ఇది. ‘కీసీ కా భాయ్ కిసీ కీ జాన్’ తెలుగు ప్రేక్షకులు అందరికీ తప్పక నచ్చుతుంది. ఈద్‌కి విడుదలవుతున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడండి” అని అన్నారు.
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…