మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుo భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రం.. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్ర మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ఇటీవలే మేకర్స్ ప్రారంభించారు. ‘న్యాయం చేయరా దేవుడా..’ డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ డ్యాన్స్ నెంబర్‌తో ప్రేక్షకులను అలరించబోతున్నట్లుగా సాంగ్ గ్లింప్స్ వదిలిన మేకర్స్.. తాజాగా ఇదే పాటకు సంబంధించిన ఫుల్ లిరికల్ సాంగ్‌ను ఆస్కార్ విజేత చంద్రబోస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దర్శకనిర్మాతలతో పాటు చిత్రానికి సంబంధించిన పలువురు హాజరయ్యారు.
ఈ పాట ఆవిష్కరణ అనంతరం లిరిసిస్ట్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘ధర్మస్థల నియోజకవర్గం’ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో ‘న్యాయం చేయరా దేవుడా..’ అనే లిరికల్ సాంగ్‌ని విడుదల చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ పాటకు నేనే సాహిత్యం అందించాను. సునీత గారు ఆలపించారు.ఈ సినిమా డైరెక్టర్ జై జ్ఞాన ప్రభ తోట గారు మంచి విజన్ ఉన్న డైరెక్టర్ . ఆయనకు సాహిత్యం పై మంచి పట్టు ఉంది.ఆయనకు తగ్గట్టు మంచి టెస్ట్ ఫుల్ నిర్మాత భాస్కర్ గారు కలిసి నా నుంచి చక్కటి సాహిత్యాన్ని రాబట్టారు. మహావీర్ ఎల్లంధర్ స్వరాలు సమకూర్చారు. సినిమా చాలా బాగుంటుంది. ఇందులో మంచి మెసేజ్ ఉంది. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, యూనిట్‌కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నానని అన్నారు.
చిత్ర దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ.. ‘న్యాయం చేయరా దేవుడా..’ పాటకు లిరిక్స్ అందించడమే కాకుండా, మేము అడగగానే ఆవిష్కరించిన ఆస్కార్ విజేత చంద్రబోస్ గారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సినిమాకు ఆయన ఎంతగానో ప్రోత్సాహం అందించారు. ఒక డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ చిత్రంలో సీనియర్ నటులైన సాయికుమార్, సుమన్‌లతో పాటు యంగ్ హీరోస్ కూడా నటిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు లేని విధంగా.. డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ తో ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నారు. ఈ సాంగ్‌తోనే మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మొదలు పెట్టబోతున్నాం. ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చేలా ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. చంద్రబోస్ గారి లిరిక్స్, స్టార్ సింగర్ సునీత ఆలపించిన పాటలు ఈ చిత్రానికి మరో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. అన్ని హంగులతో ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నాం. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు.
సంగీత దర్శకుడు మహావీర్ ఎల్లెందర్ మాట్లాడుతూ.. నేను సంగీతాన్ని అందించిన ధర్మ స్థల నియోజక వర్గం సినిమా నుండి ఈ రోజు ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్ర బోస్ గారు స్వరపరిచిన న్యాయం చేయరా దేవుడా సాంగ్ ఆయన చేతుల మీదుగా విడుదల చేయడం అదృష్టం గా భావిస్తున్నాను. ఈ చిత్రంలోనీ పాటలన్నీ చాలా వైవిద్యం గా ఉంటాయి. ప్రతి ఒక్కరికి నచ్చేలా మా చిత్రం లోని పాటలను డైరెక్టర్ గారు చిత్రీకరించారు. ఈ చిత్రం డెఫినెట్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను.అన్నారు
చిత్ర నిర్మాత మేరుం భాస్కర్ మాట్లాడుతూ.. సినిమా అంతా అద్భుతంగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా అభ్యర్థనను మన్నించి, సాంగ్ విడుదల చేసిన చంద్రబోస్ గారికి కృతజ్ఞతలు. ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం. దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట ప్రతీది చాలా క్లారిటీగా ఇందులో చూపించారు. త్వరలోనే టీజర్ లాంచ్ చేసి, విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు.
సాయికుమార్, సుమన్, నటరాజ, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల , కాలకేయ ప్రభాకర్, పృథ్వి, శివ తదితరులు నటించిన ఈ చిత్రానికి
లిరిక్స్: చంద్రబోస్,
సింగర్: సునీత,
డి ఓ పి: వెంకట హనుమ,
ఫైట్స్: నందు మాస్టర్,
కొరియోగ్రఫీ: శ్రష్టి వర్మ,
డైలాగ్స్: అస్లాం,
ఎడిటింగ్: సాయిబాబు తలారి,
సంగీతం: మహావీర్ ఎల్లంధర్,
ఆర్ట్: భార్గవాచారి నౌండ్ల ,
పి ఆర్ ఓ: బి. వీరబాబు,
నిర్మాత: మేరుo భాస్కర్,
స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జై జ్ఞాన ప్రభ తోట.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…