ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ “స్కై” సినిమా నుంచి ‘నిన్ను చూసిన..’ లిరికల్ సాంగ్ రిలీజ్

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా “స్కై”. పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న “స్కై” సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తాజాగా ఈ చిత్రం నుంచి ‘నిన్ను చూసిన..’ అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటకు పృథ్వీ పెరిచెర్ల మంచి లిరిక్స్ రాయగా, మనీష్ కుమార్, వైష్ణవి ఆకట్టుకునేలా పాడారు. శివప్రసాద్ బ్యూటిఫుల్ ట్యూన్ తో కంపోజ్ చేశారు. “స్కై” సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ‘తపనే తెలుపగ..’, ‘పోయేకాలం నీకు..’ సాంగ్స్ ఛాట్ బస్టర్స్ గా మారి మిలియన్ వ్యూస్ రీచ్ అయ్యాయి. తాజాగా రిలీజ్ చేసిన ఈ ‘నిన్ను చూసిన..’ సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్ ఆదరణ పొందుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

నటీనటులు – మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ భారతి, రాకేశ్ మాస్టర్, ఎంఎస్, కేఎల్ కే మణి బమ్మ, తదితరులు

టెక్నికల్ టీమ్

బ్యానర్ – వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – పృథ్వీ పెరిచెర్ల
డీవోపీ – రసూల్ ఎల్లోర్
ఎడిటర్ – సురేష్ ఆర్స్
పబ్లిసిటీ డిజైనర్ – కృష్ణ డిజిటల్స్
డిజిటల్ మీడియా – వినీత్ గౌడ్
ప్రొడ్యూసర్స్ – నాగిరెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు
డైలాగ్స్ , స్టోరీ – పృథ్వీ పెరిచెర్ల, మురళీ కృష్ణంరాజు
మ్యూజిక్ – శివ ప్రసాద్
లిరిక్స్ – పృథ్వీ పెరిచెర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – స్వాతి పెన్మెత్స, లిఖిత గుంటక
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

6 days ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

1 week ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago