“ఇట్స్ ఓకే గురు” సినిమా నుంచి ‘నిలవదే నిలవదే..’ లిరికల్ సాంగ్ రిలీజ్

Must Read

చరణ్ సాయి, ఉషశ్రీ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా “ఇట్స్ ఓకే గురు”. ఈ చిత్రాన్ని వండర్ బిల్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సురేష్ అనపురపు, బస్వ గోవర్థన్ గౌడ్ నిర్మిస్తున్నారు. దర్శకుడు మణికంఠ ఎం రూపొందిస్తున్నారు. త్వరలో ఇట్స్ ఓకే గురు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి ‘నిలవదే నిలవదే..’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

‘నిలవదే నిలవదే..’ పాటను సంగీత దర్శకుడు మోహిత్ రెహ్మానియక్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా..లక్ష్మీ ప్రియాంక ఫీల్ గుడ్ లిరిక్స్ రాశారు. సిద్ధార్థ్ మీనన్ ఆకట్టుకునేలా పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే – ‘నిలవదే నిలవదే ..ఎదురుగా నా మది..తపన తెరచాటులో..తగని ఆరాటమే, రెండై ఉన్న ప్రాణాలే ఒకటయ్యాయిలా, నీతో ఉన్న కాలాలే మధురమే…’ అంటూ మంచి లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట.

నటీనటులు – చరణ్ సాయి, ఉష శ్రీ,, సుధాకర్ కోమాకుల తదితరులు

టెక్నికల్ టీమ్

డీవోపీ, ఎడిటర్ – సన్నీ.డి
మ్యూజిక్ – మోహిత్ రెహ్మానియక్
బీజీఎం – ఎ.జె. ప్రియన్
డైలాగ్స్ – కడలి సత్యనారాయణ, చైతన్య
లిరిక్స్ – లక్ష్మీ ప్రియాంక, రాహుల్ రెడిన్ఫినిటీ, ప్రణవ్ చాగంటి
బ్యానర్ – వండర్ బిల్ట్ ఎంటర్ టైన్ మెంట్స్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాతలు – సురేష్ అనపురపు, బస్వ గోవర్థన్ గౌడ్
దర్శకత్వం – మణికంఠ.ఎం

Latest News

త్వ‌ర‌లోనే నితిన్ 36వ సినిమా షూటింగ్ ప్రారంభం

నితిన్ హీరోగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై రూపొంద‌నున్న యూనిక్ సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌.. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నితిన్...

More News