టాలీవుడ్

విశ్వక్ సేన్ యాంకర్ గా,’ఫామిలీ ధమాకా’ అను సరికొత్త గేమ్ షో

విశ్వక్ సేన్ యాంకర్ గా,’ఫామిలీ ధమాకా’ అను సరికొత్త ఫామిలీ గేమ్ షో తో సెప్టెంబర్ 8 న వస్తున్న ఆహ*

– ఈ షో తోటి ఓటిటి లో డెబ్యూ చేయనున విశ్వక్ సేన్ – 

*ఆగ‌స్ట్ 28, హైద‌రాబాద్‌*: తెలుగు ఆడియెన్స్‌కి తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించ‌టంలో ఆహా ఎప్పుడూ ముందుంటుంది. ఈ మాధ్య‌మం నుంచి మ‌రో అద్భుత‌మైన రియాలిటీ షో ‘ఫ్యామిలీ ధ‌మాకా’ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి సిద్ధంగా ఉంది. సెప్టెంబ‌ర్ 8 నుంచి ఆహాలో ఈ షో స్ట్రీమింగ్ అవుతుంది. ప్ర‌తీ శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల‌కు ఈ షో నుంచి కొత్త ఎపిసోడ్ అంద‌రినీ ఆక‌ట్టుకోనుంది. ఈ షోను వీక్షించే ప్రేక్ష‌కుల్లో ఉత్తేజాన్ని పెంచేలా ఎన్నో భావోద్వేగాలు, స‌వాళ్ల క‌ల‌యిక‌గా ఈ షో ఓ రోల‌ర్ కోస్ట‌ర్‌లా మ‌న ముందుకు రానుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు మీరు చూసిన షోస్‌కు ఇదెంతో భిన్న‌మైనది. కుటుంబాల మ‌ధ్య అనుబంధాలను తెలియ‌జేస్తూనే అంద‌రినీ ఈ షో ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఈ షోతో టాలీవుడ్ వెర్స‌టైల్ యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ హోస్ట్‌గా మారుతుండ‌టం విశేషం. ఆయ‌న త‌న‌దైన హోస్టింగ్‌తో న‌వ్వుల ప్ర‌యాణంలో ప్రేక్ష‌కుల‌ను కూడా భాగం చేయ‌బోతున్నారు. ఈ షోను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఫ్రిమాంటిల్ ఇండియా నిర్మిస్తోంది. 

వెర్స‌టైల్ యంగ్ హీరో *విశ్వ‌క్ సేన్* మాట్లాడుతూ *‘‘ఆహా’వారి ఫ్యామిలీ ధమాకా షోతో నేను హోస్ట్‌గా మార‌టం మ‌ర‌చిపోలేని అనుభూతి. ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ షో ద్వారా ఎన్నో కుటుంబాలను కలిసాను. చాల ఆనందంగా ఉంది. ఈ తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి నేను ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను’’* అన్నారు.

*సీనియర్ వైస్ ప్రెసిడెంట్, నాన్ సబ్ స్క్రిప్ష‌న్ రెవెన్యూ బిజినెస్‌, కంటెండ్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ ‘‘ప్రేక్ష‌కులు కు  ఉహించ‌ని కొత్త‌ద‌నంతో కూడిన ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందించ‌టంలో ఆహా వాళ్లు ఎప్పుడూ ముందుంటారు. అలాంటి వాటిలో ఫ్యామిలీ ధ‌మాకా ఒక‌టి. విశ్వ‌క్ సేన్ ఈ షోను హోస్ట్ చేయ‌టం అనేది అందరిలోనూ ఆస‌క్తిని పెంచుతోంది. క‌చ్చితంగా ఈ షో అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంద‌నే న‌మ్మ‌కం ఉంది’’* అన్నారు.

*ఫ్రిమాంట‌ల్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఆరాధ‌న బోలా మాట్లాడుతూ ‘‘ఆహాతో మా జ‌ర్నీ ఎప్ప‌టి నుంచో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇండియ‌న ఐడ‌ల్ రెండు సీజ‌న్స్‌లో మేం క‌లిసి ప్రేక్ష‌కులను ఎంట‌ర్‌టైన్ చేశాం. ఇప్పుడు ఫ్యామిలీ ధ‌మాకాతో మీ ముందుకు రాబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఫ్రిమాంటిల్‌లో అతి పెద్ద‌దైన గేమ్ షో ఫ్యామిలీ ఫ్యూడ్ ను ఆధారంగా చేసుకుని ఫ్యామిలీ ధ‌మాకాను రూపొందించాం. ఈ ఫ్యామిలీ ప్ర‌పంచ వ్యాప్తంగా 63 ప్రాంతాల్లో రూపొందిస్తున్నారు. ఓ దేశంగా చూస్తే మ‌నది వ‌సుదైక కుటుంబం అనాలి. అందులోని ప‌లు కోణాలు,హాస్యం, భావోద్వేగాలు వీట‌న్నింటినీ క‌ల‌గ‌లిపి ప్ర‌శ్న‌లుగా చేసి విశ్వ‌క్ సేన్ ప్రేక్ష‌కుల‌ను అడుగుతారు. అది కూడా ఎంట‌ర్‌టైన్‌మెంట్ పంథాలో. ఇది ప్ర‌తీ ఒక‌రికీ న‌చ్చుతుంది’’ అన్నారు.*

ఫ్యామిలీ ధ‌మాకా… ఎంట‌ర్‌టైన్మెంట్‌, ఉత్సాహాన్ని పెంచే స‌వాళ్ల క‌ల‌యిక‌. సెప్టెంబ‌ర్ 8 న ప్రారంభం కానున్న ఈ షో కోసం ఆహాను ట్యూన్ చేయండి

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

1 day ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago