విడుదల కు సిద్ధంగా ఉన్న “నేనెవరు” చిత్రం

కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు నిర్మాతలుగా… నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘నేనెవరు’. పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సాక్షి చౌదరి హీరోయిన్ కాగా.. తనిష్క్ రాజన్, గీత్ షా సహాయ పాత్రల్లో, బాహుబలి ప్రభాకర్ విలన్ గా నటిస్తున్నారు. రాధ గోపి తనయుడు ఆర్.జి.సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “నేనెవరు” అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని దర్శకుడు నిర్ణయ్ పల్నాటి తెలిపారు.

హీరో కోలా బాలకృష్ణ, దర్శకుడు నిర్ణయ్, సంగీత దర్శకుడు ఆర్.జి.సారథిలకు చాలా మంచి పేరు తెస్తుందని నిర్మాతలు భీమినేని శివప్రసాద్ – తన్నీరు రాంబాబు పేర్కొన్నారు. బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న “నేనెవరు”ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నామని తెలిపారు.ఈ చిత్రంలో రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఎడిటర్ గా కోలా భాస్కర్ చివరి చిత్రం “నేనెవరు” కావడం విశేషం. ఈ చిత్రానికి కెమెరా: సామల భాస్కర్, ఎడిటింగ్: కోలా భాస్కర్ ఫైట్స్: రియల్ సతీష్, కొరియోగ్రఫీ: చంద్రకిరణ్.జె, పి.ఆర్.ఓ: ధీరజ్ – అప్పాజీ, పబ్లిసిటీ డిజైన్స్: వాల్స్ అండ్ ట్రెండ్స్, పోస్ట్ ప్రొడక్షన్: ప్రసాద్ లాబ్స్, ఎడిటింగ్: కోలా భాస్కర్, పాటలు: కృష్ణకాంత్, సంగీతం: ఆర్.జి.సారథి, సహనిర్మాతలు: పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి, నిర్మాతలు: భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు, దర్శకత్వం: నిర్ణయ్ పల్నాటి!!

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago