పోస్ట్ ప్రొడక్షన్ లో ”నేనే సరోజ” !

యంగ్ హీరో కౌశిక్ బాబు, శాన్వి మేఘన జంటగా శ్రీమాన్ గువ్వడవెల్లి దర్శకత్వంలో  ఎస్ 3 క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై రచయిత డా. సదానంద్ శారద నిర్మిస్తున్న చిత్రం ”నేనే సరోజ” ! ఉరఫ్ కారం చాయ్ అనేది ఉప శీర్షిక. ప్రముఖ నటీనటులు సుమన్, చంద్రమోహన్, ఆనంద్, చక్రపాణి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ సందర్బంగా చిత్ర నిర్మాత సదానంద్ శారద మాట్లాడుతూ .. నేడు సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.. ముఖ్యంగా సమాజంలో ఆడపిల్లల పట్ల ఇంకా చూపుతున్న వివక్షతను ఎదురిస్తూ ఎదిగిన ఈ తరం ఆడపిల్ల కథ ఇది. ఈ పాత్రలో హీరోయిన్ శాన్వి మేఘన చక్కగా నటించింది. అలాగే హీరో కౌశిక్ బాబు నేటి తరం కుర్రకారుకు అద్దం పట్టే పాత్రలో ఆకట్టుకుంటాడు. నటన, డాన్స్, ఫైట్స్ అన్ని విషయాల్లో చాలా చక్కని ప్రతిభ కనబరిచాడు. ఈ సినిమా తెలంగాణ గ్రామీణ జీవితానికి అద్దం పట్టేలా వరంగల్ కోట, ఇక్కడి ప్రధాన ప్రదేశాల్లో షూటింగ్ చేసాం. ఇందులో ముఖ్యంగా ”కారం చాయ్” అన్న పదం ఈ సినిమా ద్వారా ఈ తరం అమ్మాయిలకు అస్త్రం కానుంది అని తెలిపారు. 

దర్శకుడు శ్రీమాన్ గుమ్మడవెల్లి మాట్లాడుతూ .. షూటింగ్  పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఆసక్తికరమైన కథ,కథనంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మాత గారు సపోర్ట్ అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి చిత్రాన్ని ఫిబ్రవరి లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. 

కౌశిక్ బాబు, శాన్వి మేఘన, సుమన్, చంద్రమోహన్, ఆనంద్, చక్రపాణి, ఆర్ ఎస్ నంద, తపస్వి, వింజమూరి మధు, బిందెల సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. 

ఈ చిత్రానికి కెమెరా : కర్ణ, సంగీతం : రమేష్ ముక్కెర, పాటలు : గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, డా. కె సదానంద్, గానం : గీతా మాధురి, మాళవిక, మధుప్రియ, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, నిర్మాత : డా . సదానంద్ శారద, దర్శకత్వం : శ్రీమాన్ గుమ్మడవెల్లి.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago