*హీరో నవీన్ చంద్రకు దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అవార్డు: ఒక గొప్ప గౌరవం

ఇంపాక్ట్ స్టార్ నవీన్ చంద్ర మరో అద్భుతమైన ఘనత సాధించారు. ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. “మంత్ ఆఫ్ మధు” సినిమాలోని ఆయన అద్భుతమైన నటనకు గాను ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించింది. భారతీయ సినిమా చరిత్రలో దిగ్గజాలైన దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ పేరిట ఇవ్వబడే ఈ అవార్డు అందుకోవడం నవీన్ చంద్ర సత్తా ఏంటో నిరూపించింది. ఈ మంత్ అఫ్ మధు అమెజాన్ ప్రైమ్ అలాగే ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇది కేవలం అవార్డు మాత్రమే కాదు, నవీన్ చంద్ర టాలెంట్‌కు, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి గుర్తింపు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆల్రెడీ ఒక స్టార్ అయిన నవీన్ చంద్ర.. 2011లో “అందాల రాక్షసి” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కంటెంట్‌లో బలం ఉన్న కథలనే ఎంచుకుంటూ, తెలుగు సినిమా ఫీల్డ్‌ని ఏలారు. ప్రస్తుతం “గేమ్ ఛేంజర్” వంటి పాన్ ఇండియా సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన “ఇన్స్పెక్టర్ రుషి” వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌ని కూడా షేక్ చేస్తున్నారు

ఆయన ఇంకా ఎన్నో అద్భుతమైన పాత్రలతో, సినిమాలతో మనల్ని అలరించబోతున్నారు అందులో ఎటువంటి సందేహం లేదు.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago