నేచురల్ స్టార్ నాని జనవరి 1, 2023న #Nani30 వరల్డ్ ఆవిష్కరణ

Must Read

ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్‌లోనూ ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్న అరుదైన నటుడు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం నాని నటిస్తున్న ‘దసరా’ చిత్రం మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్‌లో ఆయన్ని  ప్రెజెంట్ చేయబోతోంది. విలక్షణమైన కథలను ప్రయత్నించే నాని తన మైల్ స్టోన్ 30వ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.

#నాని30 వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా రూపొందబోతుంది. మోహన్ చెరుకూరి (సివిఎం) తన స్నేహితులు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ ..మంచి కంటెంట్ సినిమాలు తీయడానికి, బిగ్  స్క్రీన్‌పై వారి కథ-కథనంతో వైవిధ్యం చూపాలనే దృక్పథంతో ఈ బ్యానర్‌ను ప్రారంభించారు.

ఈ ముగ్గురూ వివిధ సొంత వెంచర్లు కలిగివున్నారు. చిన్ననాటి నుండి వీరికి సినిమాలపై ప్రధాన ఆసక్తి. వారి నిర్మాణంలో మల్టీపుల్ ప్రాజెక్ట్స్ ని సెట్ చేశారు. తొలి చిత్రంగా నాని 30వ ప్రాజెక్ట్‌ ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమకు అవకాశం ఇచ్చిన  నానికి కృతజ్ఞతలు తెలిపారు.

నాని కథానాయకుడిగా నటించబోతున్న ఈ చిత్రం ఖచ్చితంగా విలక్షణమైన చిత్రం అవుతుంది. మేకర్స్ జనవరి 1వ తేదీ సాయంత్రం 4:05 గంటలకు #Nani30 వరల్డ్ ని ఆవిష్కరిస్తారు.

ఈ బ్లాక్ అండ్ వైట్ పోస్టర్‌లో, నాని కుర్చీలో కూర్చుని తన ఫోన్‌లో బ్రౌజ్ చేస్తున్నాడు.

#నాని30కి సంబంధించిన దర్శకుడు, ఇతర ముఖ్యమైన వివరాలు న్యూ ఇయర్ సందర్భంగా తెలియజేస్తారు.

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News