ప్రేక్షకాభిమానుల హృదయాలలో శోభన్ బాబుది శాశ్వత స్తానం’సోగ్గాడు’ స్వర్ణోత్సవ కర్టెన్ రైజర్ ఈవెంట్ లో మురళీమోహన్

నటుడిగా, వ్యక్తిగా నటభూషణ శోభన్ బాబుకు ఓ ప్రత్యేకస్థానం ఉందని సీనియర్ నటుడు మురళీమోహన్ అన్నారు. శోభన్ బాబు కథానాయకుడిగా రూపొందిన ‘సోగ్గాడు’ చిత్రం 50 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అభిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్ లో స్వర్ణోత్సవ వేడుకను నిర్వహించబోతున్నారు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ అదే రోజున ఈ సినిమాను రీ రిలీజ్ చేయనుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో స్వర్ణోత్సవ కర్టెన్ రైజర్ (ముందస్తు) ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ, “నాకు తొలి అవకాశం ఇచ్చింది నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు అయితే నన్ను ప్రోత్సహించింది దాసరి నారాయణరావు, నన్ను సినిమా రంగంలోనికి రమ్మని ఆహ్వానించింది శోభన్ బాబు. నా జీవితంలో ఈ ముగ్గురినీ ఎన్నటికీ మరచిపోలేను. శోభన్ బాబుతో నేను ‘ముగ్గురు మిత్రులు’ అనే చిత్రం కూడా తీశాను. క్రమశిక్షణకు ఆయన మారుపేరు. ఆయన నుంచి నాలాంటి వారెందరో స్ఫూర్తి పొందారు. మా బ్యానర్ లో తీసిన ”అతడు’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం ఆయనకు బ్లాంక్ చెక్కు ఇచ్చి నటించమని కోరాను. కానీ ఆయన అంగీకరించలేదు. అందాల నటుడిగా నాకున్న పేరును అలానే కొనసాగించాలంటే ఇతర పాత్రలు ఏవీ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు అప్పట్లో నాకు చెప్పారు. అయన భౌతికంగా దూరమై 17 ఏళ్లు అయ్యింది. అంతకుముందు 13 సంవత్సరాలు పాటు ఆయన నటించలేదు. అంటే 30 ఏళ్లు గడిచినా శోభన్ బాబు ను గుర్తుపెట్టుకుని అభిమానులు మంచి మంచి కార్యక్రమములు నేటికీ చేస్తున్నారంటే…అది శోభన్ బాబు పట్ల వారికి ఉన్న ప్రేమ, గౌరవమే కారణం” అని అన్నారు.


సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ, “1975లో విడుదలైన ‘సోగ్గాడు’ చిత్రం తమ సంస్థకు మంచి పేరును, డబ్బును తెచ్చిపెట్టింది. సౌండ్ కు సంబంధించి నేటి టెక్నాలజీని ఉపయోగించి ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నాం. మా సంస్థ చిత్రాలను ఏఐలోకి మార్చే ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నాం” అని చెప్పారు.
నిర్మాత కైకాల నాగేశ్వరరావు మాట్లాడుతూ, అప్పట్లో శోభన్ బాబుతో ‘అడవి రాజా’, ‘ఇద్దరు దొంగలు’ చిత్రాలను తాను తీశానని, క్లాస్ హీరోగా పేరున్న ఆయనతో మాస్ చిత్రాలను తీసి..హిట్ కొట్టానని చెప్పుకొచ్చారు.


ఇంకా ఈ కార్యక్రమంలో అట్లూరి పూర్ణ చంద్రరావు, కె.ఎస్.రామారావు, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, రేలంగి నరసింహారావు, రాశీ మూవీస్ నరసింహారావు, కె.మురళీమోహనరావు, మాజీ ఎమ్మెల్యే జేష్ట రమేష్ బాబు, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి చైర్మన్ సుధాకర్ బాబు, కన్వీనర్ సాయి కామరాజు, పూడి శ్రీనివాస్, బి. బాలసుబ్రహ్మణ్యం, భట్టిప్రోలు శ్రీనివాస్ రావు, వీరప్రసాద్, విజయ్ కుర్రా రాంబాబు, తెలంగాణ శోభన్ బాబు అభిమానులు తదితరులు పాల్గొని, స్వర్ణోత్సవానికి ప్రేక్షకాభిమానులందరూ హాజరై, విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.

TFJA

Recent Posts

మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “చిరంజీవి” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా "చిరంజీవి". ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్…

7 hours ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 day ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

5 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago