#NaniOdela2కి మ్యూజిక్ డైరెక్టర్ గా సెన్సేషనల్ కంపోజర్ అనిరుధ్

Must Read

నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ హిట్ ‘దసరా’ తర్వాత హైలీ యాంటిసిపేటెడ్ సెకండ్ కొలబరేషన్ కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరితో మళ్లీ చేతులు కలిపారు. #NaniOdela2 దసరా సందర్భంగా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. 

సెన్సేషనల్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ #NaniOdela2కి మ్యూజిక్ అందించనున్నారు. జెర్సీ, గ్యాంగ్‌లీడర్ సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్‌ల తర్వాత నాని, అనిరుధ్‌ ల హ్యాట్రిక్ మూవీ ఇది.  

శ్రీకాంత్ ఓదెల మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్‌లో నానిని ప్రెజెంట్ చేసే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకునే, లార్జర్ దెన్ లైఫ్ కథని రూపొందించారు. మోస్ట్ ఫెరోషియస్ పాత్ర కోసం నాని మేకోవర్ కి సిద్ధంగా ఉన్నారు.   

పాషనేట్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సక్సెస్ ఫుల్ అండ్ డైనమిక్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ నానికి మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ సినిమా కానుంది.

ఈ హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ స్టొరీ టెల్లింగ్, ప్రొడక్షన్ క్యాలిటీ, టెక్నికల్ గా నెక్స్ట్ లెవల్ లో వుండబోతోంది. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు. 

తారాగణం: నాని

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

బ్యానర్: SLV సినిమాస్

మ్యూజిక్ : అనిరుధ్ రవిచందర్

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో

Latest News

Daaku Maharaaj’s Third Song “Dabidi Dibidi”

The much-anticipated third song from Daaku Maharaaj, titled "Dabidi Dibidi," is here and setting social media on fire! This...

More News