నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ, డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ విజల్ వర్తీ ట్రైలర్ లాంచ్
నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ఈ అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈరోజు సుదర్శన్ 35 MM థియేటర్‌లో భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
టీజర్ సినిమాలోని రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని పరిచయం చేయగా, ట్రైలర్ కాన్ఫ్లిక్ట్ ని ప్రజెంట్ చేసింది. సిఐ దయానంద్ చిన్న చిన్న కారణాలతో ఇతరులపై దాడి చేసే క్రూరమైన వ్యక్తి. సాధారణ మధ్యతరగతి కుర్రాడైన సూర్య తన చుట్టూ ఉన్నవారికి అన్యాయం జరిగితే సహించలేడు. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఇంటెన్స్ వార్ ని ట్రైలర్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది.
వివేక్ ఆత్రేయ 2.0 లోడ్ అయ్యింది. గ్రిప్పింగ్ ట్రైలర్ ఇంపాక్ట్ ఫుల్ స్టొరీ మెయిన్ పార్ట్ ని రివిల్ చేస్తోంది. మొదటి నుండి చివరి వరకు ఆడియన్స్ ని కట్టిపడేసింది. నెరేటివ్ అదిరిపోయింది, పెర్ఫార్మెన్స్,టెక్నికల్ వాల్యూస్ ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి.
నాని ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆదరగొట్టారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం అనిపించింది. ఎస్‌జె సూర్య డైనమిక్ పాత్రలో కనిపించారు. ప్రియాంక మోహన్ నాని క్యారెక్టర్ ప్రేమలో ఉన్న కానిస్టేబుల్‌గా ఆకట్టుకుంది.
మురళి జి సినిమాటోగ్రఫీ అత్యద్భుతంగా ఉంది, జేక్స్ బిజోయ్ తన అద్భుతమైన స్కోర్‌తో నెరేటివ్ ని ఎలివేట్ చేశారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి చాలా గ్రాండ్ గా సినిమాని నిర్మించారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై ఈ విజిల్-వర్తీ ట్రైలర్ భారీ అంచనాలను పెంచింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. సుదర్శన్ థియేటర్ నాకు చాలా స్పెషల్. మీ అందరితో కలసి ఈ ట్రైలర్ చూడటం చాలా హ్యాపీగా వుంది. ఈ మంత్ ఎండ్ కి అదిరిపోతుంది. మీ అందరితో కలసి సినిమా ఇక్కడే చూస్తాను. మీ అందరికీ ప్రేమకి థాంక్. మీరు ఇలానే ప్రేమ చూపిస్తూ వుంటే వందశాతం కష్టపడి మీకు మంచి మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తునే వుంటాను. ఈ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్పాలంటే.. ‘నాకు కోపం వచ్చింది, నాకు కోపం వచ్చిందటే వీళ్ళు నా మనుషులు, వాళ్ళ సమస్య నా సమస్య. వాళ్ళ సంతోషం నా సంతోషం’. అందుకే ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక సెలబ్రేట్ చేసుకుంటూనే ఉందాం. థాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 29న సరిపోదా శనివారం. థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుందాం’ అన్నారు,
యాక్టర్ SJ సూర్య మాట్లాడుతూ.. మీ అందరిని కలవడం ఆనందంగా వుంది. ట్రైలర్ కి మించి సినిమా వుంటుంది. సినిమా సూపర్ గా వచ్చింది. ఫెంటాస్టిక్ మూవీ. నాని గారు కష్టపడి వచ్చారు. మీ అందరి సపోర్ట్ తో ఎదిగారు. ఆయన మంచి మనిషి. ఆయన మంచి మనసుకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. నాని గారి ఈ సినిమాలో శనివారం బాషా. డి.వి.వి దానయ్య గారు చాలా భారీగా ఖర్చు చేసి ఈ సినిమా చేశారు. సోకులపాలెం అనే ఒక ఏరియాని ఫుల్ సెట్ లో వేశారు. అది చాలా బాగా వచ్చింది. చాలా మంచి కంటెంట్ వున్న సినిమా ఇది. మంచి ఎనర్జీ వున్న సినిమా ఇది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది’ అన్నారు.
హీరోయిన్ ప్రియాంక మోహన్ మాట్లాడుతూ.. చాలా రోజుల మిమ్మల్ని కలవడం ఆనందంగా వుంది. నాని గారితో గ్యాంగ్ లీడర్ తర్వాత ఈ సినిమా చేస్తున్నాను. ఆగస్ట్ 29న అందరూ ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూడండి’ అన్నారు.
నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ.. సరిపోదా శనివారం సినిమా మైండ్ బ్లోయింగ్. నాని గారు సూర్య గారు కెమిస్ట్రీ అదుర్స్. సినిమా బ్లాక్ బస్టర్’ అన్నారు
హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ .. ట్రైలర్ అదిరిపోయింది. డైలాగ్స్ చాలా బావున్నాయి, నాకు చాలా నచ్చాయి. నాని సూపర్ గా చేశారు. సూర్య సర్ స్వాగ్ అదిరిపోయింది. ఆగస్ట్ 29 న ఫీస్ట్ వుంటుంది’ అన్నారు.
నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మురళి జి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…