గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’ దసరా సెలవుల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసినట్లుగా ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం రిలీజ్, లాంగ్ దసరా హాలీడేస్ సినిమాకు బిగ్ అడ్వాంటేజ్.
రిలీజ్ డేట్ పోస్టర్‌లో బాలకృష్ణ నడిచే వాల్కనో లా వున్నారు. రెండు చేతుల్లో రెండు గన్స్ తో ఫెరోషియస్ గా నడుచుకుంటూ వస్తున్నట్లు కనిపించారు. యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో హై యాక్షన్ ఉంటుంది. అనిల్ రావిపూడి మార్క్ మంచి వినోదం, కుటుంబ భావోద్వేగాలు కూడా ఉంటాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.
భగవంత్ కేసరిలో కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్ పార్ట్‌కి వి వెంకట్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్స్
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: సి రామ్ ప్రసాద్
ఎడిటర్: తమ్మి రాజు
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
ఫైట్స్: వి వెంకట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ
పీఆర్వో: వంశీ-శేఖర్
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…