టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. చైతుకి ఆటో మైబైల్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కారు రేసింగ్స్ అన్నా, ఫార్ములా వన్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో తెలియజేశారు. అలాగే ఆయన ఇప్పుడు తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్ కార్లను, మోటార్ సైకిల్స్‌ను కూడా సేకరిస్తుంటారు. అలాంటి ఇష్టమైన రంగంలోకి చైతన్య అడుగు పెట్టారు . ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్)లో పోటీ పడే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని నాగ చైతన్య సొంతం చేసుకున్నారు. దీని వల్ల ఆయన ఐఆర్ఎఫ్ నిర్వహించే ఫార్ములా 4లో భాగమయ్యారు. దీనికి సంబంధించిన రేసులు ఆగస్ట్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ సందర్బంగా అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ ‘‘నాకు చిన్నప్పటి నుంచి మోటార్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఫార్మాలా వన్‌ను ఎంతగానో ప్రేమిస్తాను. ఫార్ములా వన్‌లోని హైస్పీడ్ డ్రామా, వేగంగా కార్లు, బైక్స్ నడపటంలోని థ్రిల్ నన్నెంతగానో ఆకట్టుకుంటుంది. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ నాకు కాంపిటేషన్ కంటే ఎక్కువ అని నేను భావిస్తాను. నా ఫ్యాషన్‌ను చూపించుకునే చక్కటి వేదిక ఇదని నేను భావిస్తున్నాను. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్‌ను సొంతం చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఫ్యాన్స్‌కు ఐఆర్ఎఫ్ అనేది మరచిపోలేని అనుభూతినిస్తుందనటంలో సందేహం లేదు. అలాగే దీంతో ఇండియన్ మోటార్ స్పోర్ట్స్ నెక్ట్స్ రేంజ్‌కి చేరుకుంటుంది. న్యూ టాలెంట్ బయటకు వస్తుంది’’ అని అన్నారు
ఇండియన్ రేసింగ్ లీగ్‌లో పాల్గొంటున్న ఆరు టీమ్స్‌లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఒకటి. ఇందులో నాగచైతన్య భాగం కావటం అనేది స్పీడ్ గేమ్‌కి మరింత ఆకర్షణగా మారింది. ఇంకా ఇందులో అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ భాగమయ్యారు.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…