యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో సక్సెస్‌ఫుల్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో చేస్తుంది. తాజాగా గురువారం ఈ మూవీ తమిళ ట్రైలర్‌ను చెన్నైలో విడుదల చేశారు. కోలీవుడ్ స్టార్ కార్తి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంంలో డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్, డైరెక్టర్ వెంకట్ ప్రభు సహా చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ సందర్బంగా…
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఎస్.ఆర్.ప్రభు మాట్లాడుతూ ‘‘ఇప్పుడు మన ఇండియన్ సినిమాల్లో భాషా పరమైన హద్దులు చెరిగిపోతున్నాయి. అందుకు సినిమాలకు పెడుతున్న టైటిల్స్.. వాటిని ఆదరిస్తోన్న ప్రేక్షకులే. బాహుబలి రిలీజ్ తర్వాత మనకు ఇది అలవాటుగా మారిపోయింది. బాహుబలి రిలీజ్ సమయంలో ఆ టైటిల్ అర్థమేంటని ఎవరూ అడగలేదు. ఇప్పుడు తండేల్ సినిమా విషయంలోనూ అలాగే ఎవరూ టైటిల్‌కు అర్థమేంటని ఎవరూ అడగటం లేదు. ప్రేక్షకులు సినిమాకు మంచి ఆదరణను చూపిస్తున్నారు. ‘తండేల్’ అంటే లీడర్ అని అర్థం. ఆ విషయాన్ని మనం ట్రైలర్‌లోనే చూపించారు. సినిమాను ఎంతో ప్యాషనేట్‌గా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారని చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇక ఈ మూవీని తమిళంలో విడుదల చేసే అవకాశం కలిగించిన అల్లు అరవింద్‌గారికి థాంక్స్. సాధారణంగా ఈ రోజుల్లో ఓ నిర్మాతగా 10-15 ఏళ్లు ఉంటే చాలా గొప్ప విషయం. కానీ ఆయన ఐదు దశాబ్దాలుగా నిర్మాతగా కొనసాగుతున్నారు. ఇది సాధారణమైన విషయం కాదు. ఎన్నో గొప్ప సినిమాలను నిర్మించిన సినిమాను తెలుగులో విడుదల చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు అరవింద్‌గారికి థాంక్స్. నేను నాగచైతన్యగారితో కలిసి పని చేయాలని అనుకుంటాను. అందుకని నేను కథలు విన్న ప్రతీసారి వాటిని చైతన్యగారికి పంపుతుంటాను. సాయిపల్లవి ఓ సినిమా చేసిందంటే చాలా మంచి సినిమా అయ్యుంటుందనే నమ్మకాన్ని ఆమె ఈరోజు అందరి మనసుల్లో సంపాదించుకున్నారు. తండేల్ ఆ కోవలో ప్రేక్షకులను మెప్పిస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. ఇందులో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు. దర్శకులు చందూ మొండేటిగారికి, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌గారికి థాంక్స్. ప్రేమకథా చిత్రాలకు సంగీతాన్ని అందించటానికి మ్యూజిక్ డైరెక్టర్స్ ఎప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తిని చూపిస్తుంటారు. దేవిశ్రీగారు తనదైన శైలిలో అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఫిబ్రవరి 7న తండేల్ సినిమా రిలీజ్ అవుతోంది. తప్పకుండా సినిమా అందరినీ మెప్పిస్తుంది’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘‘తండేల్’ సినిమాను డైరెక్టర్ చందూ మొండేటిగారు, నిర్మాత బన్నీవాసుగారు వన్ లైనర్స్‌గా చెప్పినప్పుడు ఎంతగానో నచ్చేసింది. ఓ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. అది సినిమా అంతా కొనసాగుతూ వచ్చింది. ఈ జర్నీని నేను ఎంతో ఎంజాయ్ చేశాను. అల్లు అరవింద్‌గారికి నేను చిన్నప్పటి నుంచే తెలుసు. చాలా మంచి వ్యక్తి. ఆయనకు స్పెషల్ థాంక్స్. చైతన్య నాకు చాలా మంచి స్నేహితుడు. ఈ సినిమా కోసం తను పూర్తిగా మారారు. తన పోస్టర్‌ను ముందుగా చూసినప్పుడు ఇది నాకు తెలిసిన చైతన్య కాదే అనిపించింది. చాలా కష్టపడ్డారు. సాయి పల్లవి పేరు చెబితే చాలు. అద్భుతంగా నటించింది. ఆమె డాన్స్‌కు నేను పెద్ద అభిమానిని. విజువల్స్ చాలా గొప్పగా ఉన్నాయి. చక్కటి కథ. ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన కార్తిగారికి థాంక్స్. వెంకట్ ప్రభు, కార్తీక్ సుబ్బరాజ్‌గారికి థాంక్స్. వివేకన్‌గారు అద్భుతమైన లిరిక్స్‌ను అందించారు. ట్యూన్స్‌కు ఆయన తన సాహిత్యంతో ప్రాణం పోశారు. తండేల్ చిత్ర యూనిట్‌కు స్పెషల్ థాంక్స్. సినిమాను ఫిబ్రవరి 7న థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు.
హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ ‘‘మా తండేల్ చిత్ర యూనిట్‌ను ఆశీర్వదించటానికి ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ కథను ఓ రియల్ స్టోరీలాగా ముందుగా చెప్పారు. తర్వాత దాన్ని అందమైన ప్రేమ కథగా మార్చారు. ఈ జర్నీకి మూడేళ్ల సమయం పట్టింది. పిక్చరైజేషన్‌కి ఏడాదిన్నర సమయం పట్టింది. చైతన్య అద్భుతంగా తన పాత్రలో ఒదిగిపోయి ప్రాణం పెట్టి నటించారు. దేవిశ్రీగారు అందమైన పాటలను ఇచ్చారు. సినిమా రిలీజ్‌కు ముందే ఆడియెన్స్ పాటలను పెద్ద హిట్ చేసి మా అందరికీ ఎనర్జీని ఇచ్చారు. అరవింద్‌గారు నాకు తండ్రితో సమానం. ఏడాదిన్నర పాటు సినిమాను షూట్ చేసినప్పుడు ఎక్కడా ఇబ్బంది లేకుండా మా టీమ్‌కు సపోర్ట్‌ను అందించారు. కరుణాకరన్‌గారికి తెలుగు ఇండస్ట్రీలోకి స్వాగతం చెబుతున్నాను. అద్భుతంగా నటించారు. ఈ జర్నీలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఫిబ్రవరి 7న సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘మా తండేల్ సినిమా యూనిట్‌కు సపోర్ట్ చేయటానికి వచ్చిన కార్తి, కార్తీక్ సుబ్బరాజ్, వెంకట్ ప్రభులకు థాంక్స్. ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. రేపు మీరు థియేటర్స్‌కు వచ్చి చూస్తే మేం ఎంత మంచి సినిమా చేశామనేది తెలుస్తుంది. నాగచైతన్య, సాయిపల్లవి నటనను రేపు థియేటర్స్‌లో చూసి అప్రిషియేట్ చేస్తారు. మా డైరెక్టర్ చందూ మొండేటిగారు అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. ఇది జరిగిన కథ. 20 మంది దగ్గర నుంచి రైట్స్ తీసుకున్నాం. వారు పాకిస్థాన్‌లో జైలు జీవితం గడిపి వచ్చినవారు. దాన్ని చందు రెండున్నర గంటల సినిమాను చక్కగా తెరకెక్కించారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు మరో హీరో. తను 25 ఏళ్లుగా హిట్స్ ఇస్తూనే ఉన్నాడు. నాతో చాలా సినిమాలకు పని చేశాడు. కరుణాకరన్‌గారు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తను చక్కగా నటించారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న ఎస్.ఆర్.ప్రభుకి స్పెషల్ థాంక్స్’’ అన్నారు.
కోలీవుడ్ స్టార్ కార్తి మాట్లాడుతూ ‘‘నాకు టాలీవుడ్‌లో చాలా గొప్ప ప్రేమ దొరికింది. తండేల్ మూవీ 2018లో జరిగిన రియల్ స్టోరీ అని తెలిసి ఆశ్చర్యపోయాను. మన జాలర్లు పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడి వారికి దొరికిపోవటం, అక్కడి నుంచి తప్పించుకని రావటం.. ఇదంతా చక్కటి ప్రేమ కథగా తెరకెక్కించారు. 20 మంది దగ్గర రైట్స్ తీసుకుని, మూడేళ్లు స్క్రిప్ట్ తయారు చేసి, ఏడాదిన్నర పాటు షూటింగ్ చేశారంటే ఆ సినిమా అంటే వాళ్లకెంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. చందు మొండేటి కెరీర్‌లో చాలా హిట్ మూవీస్ చేశారు. అదే కోవలో ఈ సినిమాను ఎంతగానో నమ్మి ఈ సినిమా కోసం అద్భుతమైన సినిమాగా చేశారు. అల్లు అరవింద్‌గారు చాలా ఏళ్లుగా నిర్మాతగా కొనసాగుతున్నారంటే మామూలు విషయం కాదు.. కేవలం బిజినెస్ మాత్రమే కాదు, ప్యాషన్ కూడా ఉండాలి. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి. తండేల్ చాలా పెద్ద సక్సెస్‌ను సాధించాలి. కరుణాకరన్ తెలుగులోనూ గొప్ప పేరు తెచ్చుకోవాలి. చిన్న ఒక సీన్ ఉన్నా, ఓ నటుడిగా తన టాలెంట్‌ను చూపించే కొద్ది మంది నటుల్లో ఆయన ఒకరు. దేవిశ్రీప్రసాద్ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. ఎంతో కష్టపడుతుంటాడు. తనకు అభినందనలు. సాయిపల్లవి చేసే ప్రతీ పాత్రను అద్భుతంగా చేస్తుంది. ప్రతీ ఎమోషన్‌ను చక్కగా పలికిస్తుంది. అందుకనే అందరికీ తను ఎంతగానో నచ్చుతుంది. ఎ.ఎన్.ఆర్‌గారు, నాగార్జునగారితో ఇక్కడి వారికి మంచి అనుబంధం ఉంది. నేను నాగార్జునగారితో కలిసి పని చేశాను కూడా. నాతో మంచి అనుబంధం ఉంది. నాగ చైతన్య ఇన్నోసెన్స్‌లా కనిపించే అద్భుతమైన యాక్టర్. తనపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించకుండా ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. తండేల్ కోసం ఎంతో కష్టపడ్డారు. ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతోన్న సినిమా తమిళంలో పెద్ద హిట్ అవుతుంది. సినిమాను తమిళంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రభుకి అభినందనలు’’ అన్నారు.
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ ‘‘నాకు చెన్నై అంటే ఎప్పుడూ ప్రత్యేకమైన అభిమానమే. కార్తిగారికి స్పెషల్ థాంక్స్. ఆయన తొలి సినిమా నుంచి రీసెంట్‌గా రిలీజైన సత్యం సుందరం వరకు మనల్ని అలరిస్తూనే ఉన్నారు. ఇంకా ఎన్నో గొప్ప సినిమాలతో మెప్పించాలని కోరుకుంటున్నాను. నాన్నగారు ఎప్పుడూ కార్తి గురించి ప్రస్తావిస్తూనే ఉంటారు. ఆయన మా ఇంట్లో సభ్యుడిగా ఎప్పుడో మారిపోయారు. అలాగే వెంకట్ ప్రభుగారికి, కార్తీక్ సుబ్బరాజ్‌గారికి థాంక్స్. తండేల్ జర్నీ గురించి చెప్పాలంటే ముందు డైరెక్టర్ చందు ఓ డాక్యుమెంటరీలా కథను చెప్పారు. ఎంతో ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. శ్రీకాకుళం నుంచి వెళ్లిన కొంత మంది జాలర్లు గుజరాత్‌కు వెళ్లి. అక్కడి నుంచి అనుకోకుండా పాకిస్థాన్‌లో ఎంట్రీ ఇచ్చి అక్కడ అరెస్ట్ అయ్యి తప్పించుకుని వచ్చారు. ఇదొక పెద్ద జర్నీ. ఆ కథ వినగానే చాలా ఎగ్జయిట్ అయ్యాను. నేను శ్రీకాకుళం వెళ్లి అక్కడి వారిని గమనించాను. చిన్న చిన్న విషయాలను తెలుసుకుని మరీ నటించాను. చందు మొండేటిగారు ఇలాంటి సినిమాను నాపై నమ్మకంతో చేసినందుకు నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి సినిమాలు చేసే అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. దాంతో మన బెస్ట్ ఎఫర్ట్ ఇచ్చే చాన్స్ వస్తుంది. ఇలాంటి కథ మన ఆడియెన్స్‌కు తెలియాలనే ఇన్‌స్పిరేషన్‌తో ఈ సినిమాను చేశాం. శ్రీకాకకుళంలోని తండేల్స్ నా రియల్ హీరోస్. అరవింద్‌గారు, బన్నీవాస్‌గారికి థాంక్స్. అరవింద్‌గారితో నా జర్నీ 100% లవ్ సినిమాతో ప్రారంభమయ్యాను. ఆ సినిమా రిలీజ్ తర్వాత నటుడిగా నాకు పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఆయనతో కలిసి వర్క్ చేయటం గొప్ప అనుభూతినిచ్చింది. అలాగే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ నిజమైన రాక్‌స్టార్. లవ్ స్టోరికీ అద్భుమైన మ్యూజిక్ ఉండాలి. దేవిశ్రీసాంగ్స్ రిలీజైన తర్వాత సినిమాపై హైప్స్ నెక్ట్స్ రేంజ్‌కు పెరిగిపోతూ వచ్చాయి. పాటలు అంత గొప్పగా చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సాయి పల్లవి ఎంతో స్పెషల్. ప్రతీ ఒక్కరూ ఆమెతో వర్క్ చేయాలనుకుంటారు. లవ్‌స్టోరీ తర్వాత తండేల్‌లో సాయిపల్లవితో కలిసి నటించటం మరచిపోలేని జర్నీ. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అంటే ఓ బ్రాండ్. తండేల్ సినిమాను ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వారికి స్పెషల్ థాంక్స్. భవిష్యత్తులో వారితో కలిసి పని చేయాలనుకుంటున్నాను. నరేన్‌గారికి, కరుణాకరన్‌గారికి థాంక్స్. వివేకన్‌గారు చక్కటి లిరిక్స్ అందించారు. ఫిబ్రవరి 7న తండేల్ సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ సినిమాను థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.
తారాగణం: నాగచైతన్య, సాయిపల్లవి, కరుణాకరన్, నరేన్ తదితరులు
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: చందూ మొండేటి
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాసు
బ్యానర్: గీతాఆర్ట్స్
మ్యూజిక్: దేవిశ్రీ ప్రసాద్
డీఓపీ: శమ్దాత్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగల
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్‌షో
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…