‘నా సామిరంగ’ -2024 సంక్రాంతికి థియేట్రికల్ రిలీజ్

కింగ్ నాగార్జున అక్కినేని, విజయ్ బిన్ని, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సినిమా టైటిల్ ‘నా సామిరంగ’ -2024 సంక్రాంతికి థియేట్రికల్ రిలీజ్

కింగ్ నాగార్జున అక్కినేని పుట్టినరోజు సందర్భంగా అభిమానులను ఆనందపరిచే విధంగా ఆయన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. పలు ప్రముఖ చిత్రాలకు పనిచేసిన పాపులర్  కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని మాస్ జాతరగా రూపొందుతున్న ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రిచ్  ప్రొడక్షన్ డిజైన్, అత్యుత్తమ టెక్నికల్ స్టాండర్డ్స్ తో రూపొందనున్న ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

మరో బిగ్ సర్ ప్రైజ్ గా మేకర్స్ ఒక గ్లింప్స్ , ఫస్ట్-లుక్ పోస్టర్ ద్వారా సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘నా సామిరంగ’ అనే క్యాచీ టైటిల్‌ని ఖరారు చేశారు. టైటిల్ వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఏఎన్ఆర్ కల్ట్ హిట్ ‘సిపాయి చిన్నయ్య’ లోని నా సామి రంగ అనే ఐకానిక్ సాంగ్.

నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బీడీ తాగుతూ మాసీ హెయిర్ స్టయిల్, గడ్డంతో మాస్ అవతార్‌ లో కనిపించారు.  టైటిల్ గ్లింప్స్  ‘నా సామి రంగ’ వరల్డ్ ని మనకు పరిచయం చేస్తుంది. పలాస ఫేమ్ కరుణ కుమార్ & అతని గూండాల బ్యాచ్ హీరోని చంపడానికి చూస్తున్నప్పుడు..  సింబాలిక్‌గా కింగ్‌గా పరిచయం అవుతారు. ఇక నాగార్జున ఎంట్రీతో అసలు మాస్ జాతర మొదలవుతుంది. అతని పేరు వినగానే ప్రత్యర్థులు వణుకుతున్నప్పుడు అతను వారిపై దాడి చేయడం మొదలుపెడతాడు. నాగార్జున మాస్ లుక్‌, ఎక్స్ టార్డీనరీ  స్క్రీన్ ప్రెజెన్స్ సీక్వెన్స్‌కు బలాన్ని తెచ్చింది. విజువల్స్ అత్యుత్తమంగా వున్నాయి.  బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ ఎలివేషన్స్ ఇస్తుంది. ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్‌తో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

నాగార్జున కు అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించి ఆస్కార్, జాతీయ అవార్డును గెలుచుకున్న లెజెండరీ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ,  డైలాగ్స్ అందించారు.  ఇందులో విభిన్న క్రాఫ్ట్‌ లలో పాపులర్  సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

మేకర్స్ మరో సర్ ప్రైజ్ అప్‌డేట్‌ ఇచ్చారు. ‘నా సామిరంగ’ 2024 సంక్రాంతికి థియేట్రిక‌ల్ రిలీజ్ అవుతుంది. సినిమాల విడుద‌ల‌కు సంక్రాంతి చాలా పెద్ద సీజ‌న్, అలాగే ఈ పండుగ‌కు అనేక హిట్‌లు సాధించిన నాగార్జున‌కు ఇది మోస్ట్ ఫేవరేట్ సీజన్. ఇది అక్కినేని అభిమానులకు నిజమైన పండుగ కానుంది. పండగ సెలవుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ వినోదాత్మక సినిమాకే ఉంటుంది.

తారాగణం: కింగ్ నాగార్జున అక్కినేని, కరుణ కుమార్

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: విజయ్ బిన్ని
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సంగీతం: ఎంఎం కీరవాణి
సమర్పణ: పవన్ కుమార్
కథ, డైలాగ్స్: ప్రసన్న కుమార్ బెజవాడ
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

1 day ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

1 day ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

1 day ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago