‘జెట్లీ’ తో మార్నింగ్ షోనే ఫుల్ మీల్స్ పెడతాం: గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ రితేష్ రానా

మైత్రీ మూవీ మేకర్స్ ప్రజెంట్స్, సత్య, రితేష్ రానా, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘జెట్లీ’ హ్యుమర్ ఫిల్డ్ యాక్షన్ గ్లింప్స్ రిలీజ్

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిరంజీవి (చెర్రీ),  హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ చిత్రంతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా తెలుగులో పరిచయం కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ ఈరోజు సినిమా గ్లింప్స్‌ను లాంచ్ చేశారు.

సత్య వాయిస్ లో వేమన శతకంతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. అకస్మాత్తుగా అల్లకల్లోలం ప్రయాణికులను భయాందోళనకు గురికావడం, తుపాకీ కాల్పులు, హైజాక్ గురించి సూచిస్తూ, సత్య పరిచయం కావడం ఆకట్టుకుంది

సత్య పాత్రను పూర్తిగా హ్యూమర్ టచ్‌తో డిజైన్ చేశారు. మేకోవర్ తో అతని స్క్రీన్ ప్రెజెన్స్ మరింత హైలైట్ అవుతూ, సత్య ట్రేడ్‌మార్క్ కామిక్ టైమింగ్ అదిరిపోయింది.

సత్య–వెన్నెల కిషోర్ మధ్య వచ్చే డైలాగ్స్ గ్లింప్స్‌కు మరింత చార్మ్‌ని యాడ్ చేశాయి. నివ్వు ఏ టైర్ హీరో అని అడిగినప్పుడు, “జనరల్ కంపార్ట్‌మెంట్” అంటూ సత్య అన్సర్ ఇవ్వడం ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అయ్యింది.

ఈ గ్లింప్స్‌లో లీడ్ హీరోయిన్ రియా సింఘా, అజయ్, హర్షతో పాటు ఇతర ముఖ్య పాత్రలన్నింటినీ కూడా ఎఫెక్టివ్‌గా పరిచయం చేశారు.

మత్తు వలదరా వెనుక ఉన్న మెయిన్ టీం ఈ సినిమా క్రియేటివ్ ఇంజిన్‌ గా పని చేస్తున్నారు. మ్యూజిక్ కాల భైరవ, సినిమాటోగ్రాఫర్ సురేష్ సారంగం, ఎడిటర్ కార్తీక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్ నార్ని శ్రీనివాస్ తో కలిసి రితేష్ రానా  మరోసారి యూనిక్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశారు.

ఈ గ్లింప్స్ రితేష్ రాణా స్టైల్‌కు సిగ్నేచర్‌గా నిలిచే హ్యూమర్‌తో పాటు హై-ఎనర్జీ యాక్షన్ మేళవించిన ఒక ఫన్-ప్యాక్డ్ ఎక్స్ పీరియన్స్ ని ప్రామిస్ చేస్తోంది.

గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో సత్య మాట్లాడుతూ.. రితేష్, చెర్రీ గారితో మళ్ళీ కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది.  మా మధ్య మంచి క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటుంది.  ఇందులో స్పెషల్ హీరోలా అంటూ ఏమీ ఉండదు. యాక్షన్ లో కూడా కామెడీని ఫీల్ అవుతారు. మత్తు వదలరా సక్సెస్ తర్వాత నాకు వచ్చిన అవకాశాలు పెరిగాయి. చెర్రిగారితో  సినిమా అనగానే నేను ఇంకేది ఆలోచించలేదు. నేను కథని డైరెక్టర్ నే ఫాలో అవుతాను. ఆ క్యారెక్టర్ తగ్గట్టు స్పాట్లో నాకు ఏదైనా అనిపిస్తే అది చెప్తాను. అయితే మొత్తం అంతా డైరెక్టర్ మీదే ఉంటుం.ది ఈ సినిమా కోసం యాక్షన్ చేశాను. నాన్చక్ నేర్చుకున్నాను.

డైరెక్టర్ రితేష్ రానా మాట్లాడుతూ .. ఇక్కడి విచ్చేసిన సత్య గారి ఫ్యాన్స్ కి నమస్కారం, సత్యతో మూవీ అనగానే రియా సైన్ చేసింది. తన అందం అభినయం సత్యాతో సరి సమానంగా ఉంది. ఈ సినిమా డిఓపి సురేష్ సారంగం సత్య క్లోజప్స్ తీస్తున్నప్పుడు కెమెరా కనిపెట్టింది ఇతని కోసమే ఏమో అని చెప్పాడు. కార్తీక్ శ్రీనివాస్ సత్య కాకుండా వేరే వాళ్ళ సీన్స్ ఎలా ఎడిట్ చేయాలని ఎడిట్ రూమ్ లో తంటాలు పడుతున్నారు. ఆల్రెడీ సత్య యాక్టింగ్ తో వాయిస్తున్నాడు నేనెందుకు మళ్లీ వాయించడం అని కాలభైరవ అన్నాడు. కాస్ట్యూమ్ డిజైనర్ తేజ తన డిజైన్ చేసిన కాస్ట్యూమ్  కి సత్య వల్లే అందం వచ్చిందని ఫీలయ్యాడు. ఫైట్ మాస్టర్ అంజి సత్య దగ్గర చాలా ఫైటింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నానని చెప్పాడు. ప్రొడక్షన్ డిజైనర్స్ మేము ఎన్ని సెట్స్ వేసిన ఈ సినిమాకి పెద్ద ఎసెట్ సత్య అని అన్నారు. ఒక డైరెక్టర్ గా నాకు జన్మనిచ్చింది సత్య. నా గాడ్ ఫాదర్ సత్య గారే. ఆయన బ్రేక్ ఇవ్వడం వల్లే నేను లంచ్ చేసి వచ్చాను( నవ్వుతూ). సత్య అభిమానులందరికీ ఒక మాట చెప్తున్నాను. మీకు మార్నింగ్ హెవీ బ్రేక్ ఫాస్ట్ చేసే అలవాటు లేకపోతే మార్నింగ్ సోకి రాకండి. ఎందుకంటే మేము మార్నింగ్ షో నే ఫుల్ మీల్స్ పెడతాం.  

నిర్మాత చెర్రీ మాట్లాడుతూ.. నవంబర్ 17న ఈ సినిమా మొదలుపెట్టాం. ఇప్పటికే 60శాతం షూటింగ్ పూర్తయింది. బ్యాలెన్స్ జనవరి ఫెబ్రవరి నాటికి పూర్తయిపోతుంది. సమ్మర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం. ఇది అవుట్ అఫ్ ది బాక్స్ మూవీ. యూనిక్ కాన్సెప్ట్. సినిమా అంతా ఫ్లైయిట్ లో షూట్ చేశాం. సినిమా చాలా ఎక్సయిటింగ్ గా వుంటుంది. రితేష్ రానా, సత్యతో మరోసారి కలిసి పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి కంటెంట్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అందరికీ థాంక్.  

రియా సింఘా మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం చాలా అనందంగా వుంది. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. టీం అందరికీ థాంక్ యూ. ఈ సినిమాతో తెలుగులోకి రావడం హ్యాపీగా వుంది.

తారాగణం: సత్య, రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్  
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: రితేష్ రానా
నిర్మాతలు:  క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు  
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్ (నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి)  
కథ – స్క్రీన్‌ప్లే: రితేష్ రానా & జయేంద్ర ఎరోలా
డైలాగ్స్: రితేష్ రానా
సంగీతం: కాల భైరవ
D.O.P: సురేష్ సారంగం
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్: తేజ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్
యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్ చున్ అంజి
కో-డైరెక్టర్: చుక్కా విజయ్ కుమార్
డైరెక్షన్ గ్యాంగ్: ప్రభావ్ కర్రి, పి.వి.సాయి సోమయాజులు, విక్రమ్ రామిరెడ్డి, కౌశిక్ రాజు
పోస్టర్స్: శ్యామ్
PRO: వంశీ – శేఖర్

TFJA

Recent Posts

అంగరంగ వైభవంగా ‘భావ రస నాట్యోత్సవం – సీజన్ 1’

'మదాలస - స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్' ఆధ్వర్యంలో 'భావ రస నాట్యోత్సవం - సీజన్ 1' అంగరంగ వైభవంగా…

9 hours ago

యానిమల్, స్పిరిట్ ఫేం హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ లో ‘త్రికాల’ సినిమా నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన అదిరిపోయే పాట యాలో ఈ గుబులే ఎలో రిలీజ్

అర్జున్ రెడ్డి, యానిమల్ పాన్ ఇండియా హిట్స్ తో పాటు నేషనల్ అవార్డ్ అందుకున్న హర్షవర్దన్ రామేశ్వర్ … ఇప్పుడు…

1 day ago

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి స్పెషల్ బర్త్ డే యాక్షన్ ప్యాక్డ్ పోస్టర్ రిలీజ్

యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌  ‘టైసన్…

1 day ago

యంగ్ స్టార్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు బర్త్ డే విశెస్ తెలిపిన “రామమ్” మూవీ టీమ్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "రామమ్". ఈ రోజు ఈ యంగ్ స్టార్ హీరో పుట్టినరోజు…

2 days ago

ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ “స్కై”

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…

2 days ago

వేసవిలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ‘మండాడి’ చిత్రయూనిట్ సన్నాహాలు.. హైలెట్‌గా నిలవనున్న సెయిల్ బోట్ రేసింగ్ సీక్వెన్సెస్

RS ఇన్ఫోటైన్‌మెంట్ నుండి 16వ ప్రాజెక్ట్‌గా 'మండాడి' చిత్రం రాబోతోంది. మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో…

2 days ago