వైవిధ్యమైన పాత్రలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న నందమూరి కథానాయకుడు.. డైనమిక్ స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్. రీసెంట్‌గా విడుదలైన బింబిసార చిత్రంతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌ను సాధించిన కళ్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ 19వ చిత్రమిది. రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు.
కళ్యాణ్ రామ్ సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌గా జరిగిన గోవా షెడ్యూల్‌తో దాదాపు సినిమా పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్.సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
నటీనటులు:
నందమూరి కళ్యాణ్ రామ్, ఆషిక రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి, జయప్రకాష్, మాథ్యూ వర్గీస్, రాజీవ్ పిళ్లై, రవి ప్రకాష్, శివన్నారాయణ, చైతన్య కృష్ణ, రఘు కారుమంచి, మాణిక్ రెడ్డి, గబ్బర్ సింగ్ సాయి, శ్రీధర్, అశోకన్ విన్సెంట్, కళ్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్, సోనాక్షి వర్మ తదితరులు
సాంకేతిక వర్గం:
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్
రచన, దర్శకత్వం: రాజేంద్ర రెడ్డి
సి.ఇ.ఓ: పి.చిరంజీవి (చెర్రీ)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల (హేమంత్)
సినిమాటోగ్రాఫర్: ఎస్.సౌందర్ రాజన్
మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల
ఎడిటర్: తమ్మిరాజు
యాక్షన్ డైరెక్టర్: వెంకట్, రామ కిషన్
కొరియోగ్రాఫర్: షోభి
చీఫ్ కో డైరెక్టర్: చలసాని రామారావు
పాటలు: రామజోగయ్య శాస్త్రి, రెహమాన్
కాస్ట్యూమ్స్: రాజేష్ – అశ్విన్
స్టిల్స్: గాజుల కృష్ణ చైతన్య
పి.ఆర్.ఒ: వంశీ కాక
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…
గత ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ‘సైయారా’ కాంబో మళ్లీ మన ముందుకు రావటానికి సమాయత్తమవుతోంది. సైయారా అద్భుత విజయంతో…
ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…
అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…