నా పాత్ర చాలా సర్ ప్రైజింగ్ గా  వుంటుంది : దక్షా నాగర్కర్

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతోంది. అభిషేక్ పిక్చర్స్ఆర్ టీ టీమ్‌ వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా ‘రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో ఈ చిత్రంలోని హీరోయిన్స్ లో ఒకరైన దక్షా నాగర్కర్ విలేఖరుల సమావేశంలో రావణాసుర విశేషాలని పంచుకున్నారు.

రావణాసుర ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?

రావణాసుర కోసం నిర్మాత అప్రోచ్ అయ్యారు. మొదట ఇందులో పాత్ర లుక్ గురించి చెప్పారు. చాలా ఎక్సయిటింగా అనిపించింది. దర్శకుడు సుధీర్ వర్మ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం.  రవితేజ గారి సినిమాలో భాగం అవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

రావణాసురలో మీ పాత్ర ఎలా వుంటుంది ? నటనకు ఆస్కారం వుండే పాత్రేనా ?

రావణాసురలో నా పాత్ర గురించి ఇప్పుడే చెప్పకూడదు. ప్రస్తుతానికి అది సస్పెన్స్. నటన విషయానికి వస్తే.. పెర్ఫార్మెన్స్ కి చాలా స్కోప్ వుండే పాత్ర చేశాను.

క్రైమ్ థ్రిల్లర్ చేయడం మీకు కొత్త కదా ? ఎలా అనిపించింది ?

నేను ఎప్పుడూ కొత్తగానే చేయాలని ప్రయత్నిస్తాను. హోరాహోరిలో మెంటల్ డిస్టర్బ్ గా వుండే అమ్మాయి గా చేశాను. హుషారు లో దిల్ చహతహే తరహ పాత్ర, అలాగే జాంబిరెడ్డి తెలుగు లో మొదటి జాంబి ఫిల్మ్. రావణాసుర కూడా చాలా డిఫరెంట్ మూవీ. ఇందులో నా పాత్ర చూసి సర్ ప్రైజ్ అవుతారు.

దర్శకుడు సుధీర్ వర్మ ఈ కథని చెప్పినపుడు ఎలా ఫీలయ్యారు ?

సుధీర్ వర్మ గారి గత  చిత్రాలు చూశాను. చాలా డిఫరెంట్ గా వుంటాయి. రావణాసుర కథని కలర్ పేలేట్ తో సహా ఎలా వుంటుందో చెప్పారు. ఆయన చెబుతున్నపుడే ఒక సినిమా చూసిన అనుభూతి కలిగింది. ఆయన డైరెక్షన్ లో పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది.

ఇందులో చాలా మంది హీరోయిన్స్ వున్నారు కదా.. మీ పాత్రకు ఎంత ప్రాధన్యత వుంటుందో అనే సందేహం రాలేదా ?

నాకు అలా ఏం అనిపించలేదు. నాకు ఒక పాత్ర ఇచ్చారు. ఆ పాత్రని ఎంత న్యాయం చేయగలనో అనే దానిపైనే ద్రుష్టిపెట్టాను. నా పాత్రతోనే ఇన్వాల్వ్ అయ్యాను.

రవితేజ గారు లాంటి పెద్ద స్టార్ తో పని చేయడం ఎలా అనిపించిది ? ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు ?

రవితేజ గారు బిగ్ స్టార్, మాస్ మహారాజా. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. చాలా హంబుల్ గా వుంటారు. సెట్స్ లో చాలా సరదా వుంటారు. ఆయనతో వర్క్ చేయడం మంచి అనుభవం.

రావణాసుర బలాలు ఏమిటి ?

రవితేజ గారు, దర్శకుడు సుధీర్ వర్మ, సుశాంత్, డీవోపీ, మా టెక్నికల్ టీం ఇలా అందరం కష్టపడి ది బెస్ట్  ఇచ్చాం. 

సుశాంత్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?

సుశాంత్ గారు చాలా సరదా మనిషి. ఈ సినిమాలో ఆయన్ని చాలా కొత్తగా చూస్తారు.

ఎలాంటి పాత్రలలో కనిపించాలని వుంది ?   

ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని వుంటుంది. చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చాను. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. చాలా నేర్చుకోవాలి. ఇటివలే ఒక యాక్టింగ్ కోర్స్ కూడా చేశాను. అందరి హీరోలతో కలసి పని చేయాలని వుంది.

కొత్తగా చేయబోతున్నా ప్రాజెక్ట్ ?

రెండు సినిమాలు సైన్ చేశాను. వివరాలు మేకర్స్ అనౌన్స్ చేస్తారు.

ఆల్ ది బెస్ట్

థాంక్స్

Tfja Team

Recent Posts

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపిన హీరో ప్రదీప్ మాచిరాజు

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

5 hours ago

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

1 day ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

2 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

2 days ago

బుక్ మై షోలో 100కె టికెట్ బుకింగ్స్ క్రాస్ చేసిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ”

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…

2 days ago

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…

2 days ago