ఆ నలుగురి వల్లే నేను ఇంత అభివృద్ధి అయ్యానుమాగంటి మురళీ మోహన్ … తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరు తెలియని వారుండరు. ఆయన అసలు పేరు రాజాబాబు. కానీ మురళీ మోహన్ గానే ప్రేక్షకులకు పరిచయం..ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ఆయన తనదైన ముద్ర వేశారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సందేశాత్మక చిత్రాలను అందించారు. ‘జగమే మాయ’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన మురళీ మోహన్, క్రమశిక్షణ గల నటుడిగా పేరు తెచ్చుకుని 350కి పైగా సినిమాల్లో నటించారు. చిత్ర రంగానికి ఆయన చేసిన సేవలకు గాను ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.. హీరోగా ,సహాయ నటుడిగా రాణించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. ఆయన నటించిన సినిమాల్లో కుటుంబ విలువలకు పెద్దపీట వేయడం వల్ల మహిళా ప్రేక్షకులు ఆయనను బాగా ఆదరించారు. చిన్న నిర్మాతల హీరోగా ఎదిగారు. తెలుగు చిత్రసీమలో అజాతశత్రువుగా పేరు పొందిన అతికొద్ది మందిలో మురళీ మోహన్ ఒకరు.
నిర్మాతగా ఆయన స్థాపించిన జయభేరి ఆర్ట్స్ బ్యానర్ టాలీవుడ్‌లో ఎన్నో క్లాసిక్ సినిమాలకు వేదికైంది. ఈ సంస్థ ద్వారా ఆయన నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందాయి. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడంతో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఫిలిం ఛాంబర్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవఅధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు బత్తుల జె.వి. ప్రసాద్‌రావు, సెక్రటరీ సురేష్‌కొండేటి కలిసి బొకేను అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్..ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ.. పాత్రికేయ కుటుంబంతో ఆయనకు ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన క్రమశిక్షణ జీవితం గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఆయనకు అవార్డు వరించిన సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ వారు పిలవగానే వచ్చినందకు చాలా ఆనందంగా ఉంది. 1940 జూన్ 24వ తారుఖున జన్మించారు. ఏలూరు సీఆర్‌రెడ్డి కాలేజీలో చదువుకున్నారు. బుద్ధిమంతుడు అనే మార్కులు ఉన్నాయి. హీరో కృష్ణగారు, ఈయన క్లాస్‌మేట్స్. చదువు పెద్దగా అబ్బలేదు. చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి బిజినెస్ మైండ్ తో ఉండేవారు. నేను కూడా ఒక బిజినెస్ మేన్ కావాలని అనుకున్నారు. చదువు కంటే కూడా క్యారెక్టర్ మీద మచ్చ లేకుండా ఉన్న వ్యక్తి ఆయన. వెయ్యిమంది స్టూడెంట్స్‌ని ఒక్కో విద్యార్ధి మీద 5లక్షలు ఖర్చు పెట్టి చదివించారు. వెయ్యి మంది కుటుంబాలలో వెలుగు నింపిన మనిషి మురళీమోహన్. మురళీమోహన్‌గారి సహాయంతో చదువుకుని రిజర్వ్ బ్యాంక్‌లో పని చేస్తున్నారు. విద్యా దానాన్ని మించిన గొప్ప దానం లేదు అన్నారు. అనుకోకుండా రాజకీయాల్లోకి వెళ్ళారు. గెలిచి ఓడిన ఎమ్.పీ.గా ఆయన ఉండిపోయారు. కొద్ది క్షణాల్లో రిజల్ట్ మారిపోయింది. ఏ నియోజకవర్గంలో ఓడిపోయారో అందులోనే తిరిగి గెలిచారు. ఇక ఆయన ఫ్యామిలీ విషయానికి వస్తే… ఆయనకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. మేము మా కాళ్ళ మీద మేము నిలబడతాము మీరు ఏమి చెయ్యదలుచుకున్నారో అది చెయ్యండి నాన్న అన్నారు. అంత గొప్ప సంతానం మురళీమోహన్‌గారి పిల్లలు. ఇటీవలె ఆయన 86వ జన్మదినం చేసుకున్నారు. ఈ వయసులో కూడా ఆయన ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలె ఆ చిత్ర షూటింగ్ రమడ హోటల్‌లో జరిగింది. మన నోట్లోకి వెళ్ళే ఆహారం మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తే..మన నోటి నుంచి వచ్చే మాట మన క్యారెక్టర్‌ని డిసైడ్ చేస్తుంది అంటారు. అనారోగ్య ధోరణికి టాలీవుడ్ మీడియా ఎప్పుడూ పాల్పడలేదు. టాలీవుడ్‌లో ఎప్పుడూ కూడా ఎల్లో జర్నలిజం అన్నదే లేదు. ఫిలిం క్రిటిక్స్ నిర్వహించే నూతన కమిటీ చాలా అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళు నిర్వహించే ప్రుతీ కార్యక్రమం అద్భుతం అని చెప్పాలి. మురళీ మోహన్‌గారి అసలు పేరు రాజారామ్మోహన్‌రాయ్… ఆయన తమ్ముడు వేణుగోపాల్ తిలక్ అని పెట్టారు. మురళీమోహన్‌గారి జీవితగాధను పుస్తకరూపంలో వస్తే బావుంటుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆ బాధ్యతను కూడా నేనే తీసుకోవాలనుకుంటున్నాను. నేను ఆయన జీవిత చరిత్రను రాస్తాను. ఈ ఏడాది చివరి వరకు ఆ పుస్తకాన్ని పూర్తి చేస్తాను.
మురళీ మోహన్ మాట్లాడుతూ… ఎన్నో సందర్భాల్లో మేము ప్రెస్ మీట్లు పెట్టాము పాత్రికేయులు వచ్చేవారు. మా సినిమాల గురించి రాసేవారు. చాలా చక్కటి కవరేజ్ ఇచ్చేవారు. ఎప్పుడూ కూడా నెగిటివిటీ రాసేవారు కాదు. అంతా మంచిగా రాసేవారు. ఫిలిం ఇండస్ట్రీకి ఫిలిం క్రిటిక్స్‌కి ఎప్పటి నుంచో కొంత అనుబంధాలు ఉన్నాయి. కేవలం టాలీవుడ్‌లో మాత్రమే కాదు. ఏ భాషలోనైనా క్రిటిక్స్‌కి ఇండస్ట్రీకి చాలా అవినాభావ సంబంధాలు ఉంటాయి. క్రిటిక్స్ వారు పిలిచి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంది నన్ను అవార్డు వచ్చాక పిలిచారు. కానీ ముందుగా క్రిటిక్స్ చేసిన తరువాత అనుకున్నా. చాలా ఇండస్ట్రీల్లో ఎల్లో జర్నలిజం. ఉంటుంది.
ఎల్లో జర్నలిజం లేనిది ఏదైనా ఉందంటే అది కేవలం టాలీవుడ్‌లోనే అని గట్టిగా చెప్పగలను. టాలీవుడ్‌లో జర్నలిస్టులు హీరోలు మధ్య స్నేహ బంధం ఉంటుంది. నేను హీరో అని ఎవ్వరూ ఫీలవ్వరు అందరూ ఫ్రెండ్స్ లా ఉంటారు. చిరంజీవిగారు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు. చెడు ఉంటే చెవిలో చెప్పండి. మంచి ఉంటే మైకులో చెప్పండి అని. అలా ఎప్పుడూ చెడు చెప్పలేదు. ఎంత మంది ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా అది కేవలం వారికి మాత్రమే పరిమితం అవుతుంది. కానీ ఫిలిం క్రిటిక్స్ చేస్తే మొత్తం ఇండస్ట్రీ అంతా వెళుతుంది. అలాంటి కార్యక్రమం ఇది. అప్పట్లో మా ఊరిలో చాలా మంది స్వాతంత్య్ర సమయరయోధులు ఉన్నారు. గాంధీగారికి మానసపుత్రిక కూడా మా ఊరిలోనే ఉండేవారు. నాకు పెద్దగా చదువు ఎందుకో ఒంటబట్టేది కాదు. అప్పట్లో వ్యాపారం చేద్దామంటే.. డబ్బులు లేవు. ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేదు. నా జీవితంలో మొదటి మలుపు గుప్త మాణిక్యాలరావుగారు అలాగే అట్లూరి పూర్ణచంద్రరావుగారు మార్చారు. పూర్ణచంద్రరావుగారు నన్ను చూసి హీరోగా అనుకున్నారు. గిరిబాబుని మొదట హీరోగా అనుకున్నారు. నన్ను చూడగానే ఆయనను విలన్‌గా చేశారు. జగమేమాయ అనే సినిమాతో హీరోగా నన్ను పరిచయం చేశారు. ఆయన దాదాపుగా 87 చిత్రాలు చేశారు. 13 భాషల్లో చేసిన ఘనత ఉంది. ఓ రోజు మీ పేరు మారిస్తే బావుంటుంది అనుకుంటున్నాను అన్నారు. నా పేరు రాజబాబు అన్నాను. ఆల్రెడీ ఉన్నారు ఆ పేరు కాబట్టి మోహన్ అని పెట్టారు. ఆంధ్రపత్రిక శ్రీనివాస్‌గారు మోహన్ అనేది పూర్తి పేరు లేదు అన్నారు. మురళీ అని యాడ్ చేయమంటే… పూర్ణయందర్‌రావుగారు మురళీ మోహన్‌గా మార్చారు. ఆయన పెట్టిన బిక్షవల్లే నేను ఇంత ఎత్తుకి ఎదిగాను. దాసరి నారాయణరావుగారిని నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను . దాదాపుగా ఆయన సినిమాలన్నిటిలో చేశాను. ఓ రోజు శోభన్‌బాబు గారు మీరు సంపాదించే ప్రతీ డబ్బు ఎక్కడ పెడతారు అన్నారు. నేను సొంత బ్యానర్ ఉంది సినిమాలు తీస్తను అన్నాను. మంచిదే అన్నారు. తరువాత నాకు నా ప్రతి రూపాయిని కూడా అప్పు చేసి మారి నేను ల్యాండ్స్ కొన్నాను అన్నారు. కలను నిజం చేసే వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నేను నమ్మాను. నేను నీతిగానే చేస్తాను. నిజాయితీగానే చేస్తాను అని ఇన్నాళ్ళలో ఎక్కడా తప్పుజరగకుండా జాగ్రత్తగా చూసుకున్నాను. ఏ ఇండస్ట్రీలో కూడా నాకు మచ్చ లేదు. శోభన్‌గాబుగారిని కూడా నేను నా జీవితంలో మర్చిపోలేను ఆ నలుగురు నాకు చేసిన సహాయం మర్చిపోలేను. నేను ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు. కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. అలా నేను ఏదీ కూడా ప్రచారం చేసుకోలేదు. కేవలం మౌత్ టు మౌత్ వెళ్ళడం నేను సహాయం చేయడం జరిగింది. వాళ్ళందరూ మంచితనంగా చెపుతుంటే చాలా ఆనందంగా ఉంది. మనం ఎంత ఉన్నా.. ఎంత సంపాదించినా నాలుగు మెతుకులు తప్పా ఏం తింటాం. ఇప్పటికీ నేను ఒక అపార్ట్‌మెంటులో ఉంటాను. నేను చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను అన్నారు. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచిన ప్రతి ఒక్కరికీ చాలా కృతజ్ఞతలు అన్నారు.
ప్రెసిడెంట్ బత్తుల ప్రసాద్ మాట్లాడుతూ…మురళీ మోహన్‌గారి అసలు పేరు రాజాబాబు. మాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు ఆనందంగా ఉంది. ఆయనకు అవార్డు రావడం చాలా గర్వంగా ఫీలవుతున్నాను అన్నారు.
జనరల్ సెక్రటరీ సురేష్ కొండేటి మాట్లాడుతూ…సినిమా పాత్రికేయులు అందరూ హ్యాపీ. ఈ సన్మానికి ఒప్పుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ ముందుండే వ్యక్తి మురళీ మోహన్‌గారు. నా విషయంలో కూడా చాలా ఎంకరేజ్ చేశారు. ప్రతి సందర్భంలోనూ ఆయన నా వెంట ఉన్నారు. బావున్నప్పుడు ప్రతి ఒక్కరూ వెనక ఉంటారు. నాకు వచ్చిన చిన్న చిన్న ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మురళీ మోహన్‌గారు ప్రతి క్షణం వెన్నంటే ఉంటూ నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు అన్నారు.
వైస్ ప్రెసిడెంట్ జనార్ధన్ మాట్లాడుతూ… మురళీ మోహన్‌గారిని విద్య రంగంలో సినిమా రంగంలో రాజకీయరంగంలో ఇలా అన్ని రంగాల్లో చాలా మంచి అనుభవం ఉంది. పిలవగానే ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి వచ్చినందుకు ఆయనకు చాలా థ్యాంక్స్ ఆయనకు మరిన్ని అవార్డులు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
వైస్‌ప్రెసిడెంట్ అబ్దుల్ మాట్లాడుతూ.. ఇంత చక్కటి కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఇలాంటివి అవార్డులు మరిన్ని ఆయనకు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
సీనియర్ పాత్రికేయులు సుబ్బారావు మాట్లాడుతూ… మురళీ మోహన్‌గారు మంచి నటులు మంచి నిర్మాత ఇవన్నీ అందరికీ తెలిసందే. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం ఆనందంగా ఉంది. విద్యా దానం చేయడం చాలా ఆనందం. నేను కూడా ఒక ఇద్దరికి రికమెండ్ చేయడం జరిగింది. చాలా ఆనందం. ఎంతో మందిని ఆయన చదివించారు. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు.
ఎగ్జిక్యూటివ్ మెంబర్ అప్పాజీ మాట్లాడుతూ.. ఆరున్నర దశాబ్దాల ఫిలిం క్రిటిక్స్‌కి మెంబర్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మురళీమోహన్‌గారికి పద్మశ్రీ వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాలుపంచుకోవడం నా అదష్టంగా భావిస్తున్నాను. మురళీమోహన్‌గారు ఒక స్ఫూర్తి ప్రదాత. ఆయనను మరిన్ని అవార్డులు వరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ బాలిరెడ్డి మాట్లాడుతూ.. పద్మశ్రీ మురళీ మోహన్‌గారికి అభినందునులు నమస్కారాలు. ఇప్పటికే లేట్ అయింది. కానీ ఇప్పటికైనా వచ్చింది. భారతదేశం ప్రభుత్వం గుర్తించినందుకు ఆనందం. ఆయన నాన్ కాంట్రవర్షియల్‌గా ఉండేవారు. రియల్ ఎస్టేట్‌లో కూడా ఆయనకు ఎక్కడా కాంట్రవర్సీ లేదు. ఆ తప్పు ఎక్కడా ఆయన చెయ్యలేదు. సినిమా కళాకారుడు ఒక్క సినిమాని మాత్రమే నమ్ముకోకుండా ఇతర రంగాల్లో కూడా గుర్తింపుని సాధించారు. హైదరాబాద్‌లో జయభేరి పేరు మారుమ్రోగుతుంది. ఎంతోమందికి ఆ రంగంలో కూడా ఉపాధి కల్పించారు. పద్మశ్రీరావడం చాలా ఆనందం ఆయనకు తెలుగు సినీ రంగం ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పటు చేయాలని నేను కోరుతున్నాను అన్నారు.
ఎగ్జిక్యూటివ్ మెంబర్ మామిడాల గిరిధర్ మాట్లాడుతూ… రంపచోడవరంలో నేను మొదటి సారి ఆయనను కలిశాను. నమ్మినబంటు షూటింగ్‌లో కలిసి ఇంటర్వ్యూ తీసుకున్నాను. దురదృష్టవశాత్తు ఆ ఇంటర్వ్యూ పబ్లిష కాలేదు. తిరిగి మళ్ళీ చినబాబు షూటింగ్‌లో ఇంటర్వ్యూ చేశాను. సితారలో వినాయకరావుగారు తీసుకెళితే ఆయన ద్వారా వెళ్ళి నేను ఇంటర్వ్యూ చేశాను. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పర్సన్‌ని నేను చూడలేదు. ఆయన ఎవరినైనా చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. ఇలాంటి మంచి మనసున్న మనిషిని సినిమా ఇండస్ట్రీలో నాకు ఎక్కడా కనిపించలేదు అన్నారు.
ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆర్.డిఎస్ ప్రకాశ్ మాట్లాడుడూ… ఆయన పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మురళీ మోహన్‌గారు మా మంచి మురళీ మోహన్ అని రాస్తాను నేను. ఒకొక్కరికి ఒక్కో పేరు ఉంటుంది. సూపర్‌స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి లాగా మా మంచి మురళీమోహన్ అంటారు. నా హోమియో టుడే మ్యాగజైన్‌లో అల్లూరామలింగయ్యగారి ట్రీట్‌మెంట్ గురించి ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు అన్నారు.
ప్రశ్న జవాబులు
–హైదరాబాద్ శోభన్‌గారు అని మంచి కామెంటు ఇచ్చారు బాలిరెడ్డిగారు. రియల్ ఎస్టేట్ మెగాస్టార్ మురళీమెహన్ అని చిరంజీవి అన్నారు. శోభన్‌గబాబుగారు చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. నేను చాలా వాటికి చేస్తున్నాను. పబ్లిసిటీ చేసుకోను. నాకు ఇష్టముండదు.
ఇంకా ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ శ్యామ్ కుమార్, శ్రీమతి పర్వీన్‌బాబి, ట్రెజరర్ భరద్వాజ, ఎగ్జిక్యైటివ్ మెంబర్ చందూ రమేష్, కేశవచారి, నవీన్, కుమారస్వామి తది తరులు పాల్గొన్నారు.
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…