భజే వాయు వేగం సినిమాతో నా కెరీర్ లో ముందడుగు పడుతుంది – హీరో కార్తికేయ

భజే వాయు వేగం సినిమాతో నా కెరీర్ లో బలమైన ముందడుగు పడుతుంది – ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో హీరో కార్తికేయ

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా “భజే వాయు వేగం”. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 31న “భజే వాయు వేగం” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఈ రోజు “భజే వాయు వేగం” ట్రైలర్ ను హైదరాబాద్ ఐమాక్స్ లో ఘనంగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

యూవీ కాన్సెప్ట్స్ చైతన్య మాట్లాడుతూ – మా భజే వాయువేగం సినిమా ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. మీ దగ్గర నుంచి మంచి రివ్యూస్ వస్తాయని ఆశిస్తున్నాను. థ్యాంక్యూ. అన్నారు.

డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ – భజే వాయు వేగం ఒక మంచి ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. మా మూవీ గురించి డీటెయిల్డ్ గా తర్వాత మాట్లాడుతాను. యూవీ సంస్థలో పదేళ్లుగా ట్రావెల్ చేస్తున్నా. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ప్రాజెక్ట్ ఒప్పుకున్న హీరో కార్తికేయకు కృతజ్ఞతలు. టీజర్, ట్రైలర్ లో హీరోయిన్ ఐశ్వర్య మీనన్ సీన్స్ ఎక్కువ రివీల్ చేయలేదు. ఎందుకంటే ఆమె ఉన్న సీన్స్ చాలా కీలకంగా ఉంటాయి. అవి రివీల్ చేస్తే కథలో ట్విస్ట్ తెలుస్తుందని అనుకున్నాం. సినిమాలో మాత్రం ఐశ్వర్య పర్ ఫార్మెన్స్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద చాలా టైమ్ స్పెండ్ చేశాను. రేపు థియేటర్ లో మీకు ఆ ఎక్సీపిరియన్స్ తెలుస్తుంది. మార్చిలో మా మూవీ రిలీజ్ చేయాలని అనుకున్నాం. ఐపీఎల్, పరీక్షలు ఇలాంటి వాటిలో ప్రేక్షకులు బిజీగా ఉంటారని రెండు నెలలు ఆగి రిలీజ్ చేస్తున్నాం. రియల్ ఇన్సిడెంట్స్ తో బేస్ అయిన సినిమా కాదిది. కానీ మనం ఎక్కడో చదివిన విషయాల ఇంపాక్ట్ కథలో ఉంది. ఒక కామన్ మ్యాన్ అసాధారణ సమస్యలో ఇరుక్కుంటే అందులో నుంచి ఎలా బయటపడ్డాడు అనేది అన్ని ఎమోషన్స్ కలిపి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో చూపిస్తున్నాం. అన్నారు.

డైలాగ్ రైటర్ మధు శ్రీనివాస్ మాట్లాడుతూ – భజే వాయు వేగం ట్రైలర్ చూస్తే మీరంతా ఈ సినిమా క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ అనుకుంటారు. సినిమా చూస్తే ఇందులో మిగతా అనేక అంశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఫాదర్ సన్ రిలేషన్, ఒక మంచి లవ్ స్టోరి. బ్రదర్స్ మధ్య బాండింగ్ ..వంటి ఎమోషన్స్ తో కథ సాగుతుంది. అసాధారణమైన క్రైమ్ బ్యాక్ గ్రౌండ్ లో నడిచే యాక్షన్ ప్యాకేజి ఈ సినిమా. భజే వాయు వేగం చిత్రంలో నేను పార్ట్ అయినందుకు హ్యాపీగా ఫీలవుతున్నా. అందుకు యూవీ వారికి, హీరో కార్తికేయ, దర్శకుడు ప్రశాంత్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

హీరోయిన్ ఐశ్వర్య మీనన్ మాట్లాడుతూ – మా భజే వాయు వేగం సినిమా ట్రైలర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ నెల 31న రిలీజయ్యే సినిమా కూడా అలాగే నచ్చుతుంది. స్పై సినిమా కంటే ముందు నేను సైన్ చేసిన చిత్రమిది. దర్శకుడు ప్రశాంత్, యూవీ ప్రొడక్షన్స్ కు థ్యాంక్స్. ఈ సినిమా మా టీమ్ అందరికీ మిరాకిల్స్ చేయాలి. హీరో కార్తికేయతో కలిసి నటించడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. అతను లవ్ లీ కోస్టార్. భజే వాయు వేగం సినిమాను తప్పకుండా చూడండి. అన్నారు

హీరో కార్తికేయ మాట్లాడుతూ – నేను ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో కథ విన్నప్పటి నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతుందా మూవీ అని ఎక్కువగా ఎదురుచూసింది భజే వాయు వేగం సినిమాకే. నేను ఎలాంటి కథ చేద్దామని అనుకున్నానో, నా సినిమాలో ఎలాంటి ఎమోషన్, ఎలాంటి డ్రామా ఉండాలని అనుకున్నానో, ఎలాంటి క్యారెక్టర్ పోషించాలని అనుకున్నానో..అవన్నీ వందశాతం కుదిరిన సినిమా ఇది. నాకు పర్పెక్ట్ మూవీని డైరెక్టర్ ప్రశాంత్, మిగతా టీమ్ డిజైన్ చేశారు. నా కెరీర్ మొదలై ఆరేళ్లవుతోంది. ఎనిమిది తొమ్మిది సినిమాల్లో నటించాను. వాటిలో కొన్ని హిట్ అయ్యాయి, మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. లాస్ట్ మూవీ బెదురులంక బాగా పే చేసింది. ఒక పర్పెక్ట్ మూవీతో నా అడుగు ముందుకు పడలేదని అనిపిస్తుంటుంది. ఆ వెలితిని భజే వాయు వేగం తీరుస్తుంది. కమర్షియల్ సినిమాలో ఇవి ఉండాలని కావాలని పెట్టిన సినిమా కాదిది. కథకు ఏం కావాలో అదే చేసుకుంటూ వెళ్లాం. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ కథలో సహజంగా కుదిరాయి. సినిమా చూస్తున్న వాళ్లు కథలో లీనమవుతారు. ఆ ఎమోషనల్ డ్రైవ్ నుంచే ప్రతి ఒక్క అంశాన్ని అనుభూతి చెందుతారు. కథలోని లవ్, ఎమోషన్, యాక్షన్, డ్రామా వంటివన్నీ డైరెక్ట్ గా మీ మనసును తాకుతాయి. మా మూవీకి వచ్చే క్రెడిట్, మేమింత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నామంటే కారణం దర్శకుడు ప్రశాంత్ కే దక్కుతుంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చేవారంతా ఒక ప్యాషన్ తో వస్తారు. చేసే పనిలో సంతృప్తి వెతుక్కుంటారు. మా టీమ్ అందరికీ అలాంటి వెలకట్టలేని సంతృప్తినిచ్చిన సినిమా భజే వాయు వేగం. మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ ఈ సినిమా బెటర్ గా వచ్చేలా తమ ఎఫర్ట్స్ పెట్టారు. హీరోయిన్ ఐశ్వర్య పర్ ఫార్మెన్స్ కు మంచి పేరొస్తుంది. రాహుల్ టైసన్ కీ రోల్ చేశాడు. తనికెళ్ల భరణి గారి పాత్రకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ఆర్ఎక్స్ 100 తర్వాత నాకు భజే వాయు వేగం మరో బెంచ్ మార్క్ మూవీ అవుతుంది. మా మూవీ టీజర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా థ్యాంక్స్. అన్నారు.

నటీనటులు – కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు

టెక్నికల్ టీమ్-
మాటలు: మధు శ్రీనివాస్
ఆర్ట్: గాంధీ నడికుడికర్
ఎడిటర్: సత్య జి
సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్
మ్యూజిక్ (పాటలు) – రధన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – కపిల్ కుమార్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్-శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ – అజయ్ కుమార్ రాజు.పి
ప్రొడ్యూసర్: యూవీ కాన్సెప్ట్స్
దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి చంద్రపు

Tfja Team

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

16 hours ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

2 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago