ఓటీటీలో ఆకట్టుకుంటోన్న ‘మ్యూజిక్ షాప్ మూర్తి’

అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రముఖ పాత్రల్లో నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రానికి థియేటర్లో మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లో సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. బరువెక్కిన గుండెతో థియేటర్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.

ఫ్లై హై సినిమాస్‌పై హర్ష గారపాటి మరియు రంగారావు గారపాటి నిర్మించి శివ పాలడుగు రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్‌ని సైతం ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఓటీటీ సంస్థల్లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది.

ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని అంశాలతో, మంచి సందేశంతో కూడిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. థియేటర్లో వచ్చినట్టుగానే ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. సినిమాను థియేటర్లలో చూడని వారంతా ఇప్పుడు చూస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి మంచి సబ్జెక్ట్‌తో సినిమా తీసి, కుటుంబ సభ్యులతో కలిసి చూడగలిగే క్లీన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినందుకు డైరెక్టర్‌ను అభినందిస్తున్నారు. టైటిల్ రోల్‌లో కనిపించిన అజయ్ ఘోష్ సహజమైన నటనను కూడా ఆడియెన్స్ మెచ్చుకుంటున్నారు. ఎప్పటిలానే చాందినీ చౌదరి తన నటనతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నారు.

ఆమని, అమిత్ శర్మ, భాను చందర్ మరియు దయానంద్ రెడ్డి ముఖ్యమైన పాత్రలను పోషించారు. శ్రీనివాస్ బెజుగం సినిమాటోగ్రఫీ, పవన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇతర ప్రధాన ఆకర్షణలు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా పని చేశారు.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago