హైద‌రాబాద్‌, తెలంగాణ‌లో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై స్పందించిన మ్యూజిక్ స్కూల్ డైరెక్ట‌ర్ పాపారావు బియ్యాల‌

సీబీఎస్ఈ ఇంట‌ర్మీడియ‌ట్ ఫలితాలు శుక్ర‌వారం రోజున విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. అదే సంద‌ర్భంలో తెలంగాణ రాష్ట్రంలోని హైద‌రాబాద్‌, నిజమాబాద్ ప్రాంతాల‌కు చెందిన విద్యార్థులు త‌క్కువ మార్కులు తెచ్చుకోవ‌టంతో ఇటు త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఒత్తిడిని త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌ల‌పై మ్యూజిక్ స్కూల్ ద‌ర్శ‌కుడు పాపార‌వు బియ్యాల స్పందించారు. 

పాపారావు బియ్యాల ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా వ‌ర్క్ చేశారు. ఆయ‌న మ్యూజిక్ స్కూల్ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారారు. ఇసైజ్ఞాని, మ్యాస్ట్రో ఇళ‌యరాజా సంగీత సార‌థ్యం వ‌హించిన  ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కత్వం వ‌హించ‌టంతో పాటు నిర్మించారు. పిల్ల‌ల‌తో క‌ళ‌ల ప‌ట్ల ఆస‌క్తిని పెంపొందించాల్సిన త‌ల్లిదండ్రులు, టీచ‌ర్స్‌, స‌మాజం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. విద్యార్థుల‌పై విద్యాప‌ర‌మైన ఒత్తిడిని పెంచేస్తోంది. ఇది వారిలోని ఎదుగుద‌ల‌ను ఆపేస్తోంది. ఈ విష‌యాన్ని మ్యూజిక్ స్కూల్ అనే మ‌ల్టీలింగ్వువ‌ల్ చిత్రం ద్వారా ఎంట‌ర్‌టైనింగ్‌గా వివ‌రించారు. డ్రామా టీచర్‌గా శ‌ర్మ‌న్ జోషి, మ్యూజిక్ టీచ‌ర్‌గా న‌టించిన శ్రియా శ‌ర‌న్.. ఓ లొకేష‌న్‌లో త‌ల్లిదండ్రులు, టీచ‌ర్స్ ద్వారా విద్యాప‌ర‌మైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న కొంత మంది పిల్ల‌ల‌తో క‌లిసి సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అనే సంగీత నాట‌కాన్ని రూపొందించ‌టానికి క‌ష్ట‌ప‌డట‌మే మ్యూజిక్ స్కూల్ ప్ర‌ధాన క‌థాంశం. 

హైద‌రాబాద్‌, నిజమాబాద్‌లలోజరిగిన ఘ‌ట‌నల‌పై ద‌ర్శ‌కుడు పాపారావు బియ్యాల మాట్లాడుతూ ‘‘చుట్టూ సమాజం కారణంగా వారు నిర్ణయించుకున్న కొన్ని ప్రమాణాల కారణంగా గొప్ప సామర్థ్యం ఉన్న కుర్రాడు త‌న ప్రాణాల‌ను కోల్పోవ‌టం మ‌న దుర‌దృష్టం. ఈ విష‌యాన్నే మా మ్యూజిక్ స్కూల్ చిత్రం ద్వారా తెలియ‌జేశాం. విద్యార్థుల శ్రేయ‌స్సు, అభివృద్ధి ముఖ్య‌మ‌ని తెలియ‌జేసేలా ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అన్నారు. 

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన మ్యూజిక్ స్కూల్ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. 

మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం సారథ్యం వ‌హించిన ఈ చిత్రంలో శ్రియా శ‌ర‌న్‌, శర్మ‌న్ జోషి, ప్రకాష్ రాజ్‌, ఓజు బారువా, గ్రేసీ గోస్వామి, బెంజిమ‌న్ గిలాని, , సుహాసిని ములె, మోనా, లీలా సామ్‌స‌న్‌, బ‌గ్స్ భార్గ‌వ‌, విన‌య్ వ‌ర్మ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, వ‌కార్ షేక్‌, ఫ‌ణి, ఇత‌ర చిన్న పిల్ల‌లు. 

యామిని ఫిల్మ్స్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందించిన ఈ చిత్రాన్ని త‌మిళంలో అనువాదం చేసి మే 12న రిలీజ్ చేశారు. హిందీలో పి.వి.ఆర్ రిలీజ్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago