‘అన్నీ మంచి శకునములే‘ చిత్రం ప్రేక్షకులకు మర్చిపోలేని ఓ మంచి బహుమతి: గౌతమి
ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘అన్నీ మంచి శకునములే‘. మిత్ర విందా మూవీస్ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలని పెంచింది. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ హీరోయిన్ గౌతమి విలేకరుల సమావేశంలో ‘అన్నీ మంచి శకునములే‘ విశేషాలని పంచుకున్నారు.
ఇది మీకు సెకండ్ ఇన్నింగ్ ఆ.. థర్డ్ ఇన్నింగ్ ఆ?
ఎలా అయినా అనుకోవచ్చు. ఇన్నింగ్ ఉండటమే సంతోషం.(నవ్వుతూ)
ఇప్పటికీ షూటింగ్, సినిమాని ఎంజాయ్ చేయగలుగుతున్నారా ?
ఎంజాయ్ చేయగలుగుతున్నాను కాబట్టే ఇంకా చేయగలుగుతున్నాను. ఈ విషయంలో సంతోషపడుతున్నాను.. ఒక రకంగా గర్వపడుతున్నాడు. సినిమా నా ఫస్ట్ లవ్ అనే అనొచ్చు. సినిమా అనేది ఎండ్ లెస్. నటిగా కాకుండా సినిమాకి సంబధించిన చాలా విభాగాల్లో పని చేశాను. కానీ ఇప్పటికీ అదే ఎక్సయిట్ మెంట్. నేర్చుకోవడానికి చాలా వుంది. ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ ఇంకా ఆసక్తికరంగా వుంది. యంగ్ స్టర్స్ చాలా ఇంపాక్ట్ ఫుల్ సినిమాలు చేస్తున్నారు.
అన్నీ మంచి శకునములే లో మీ పాత్ర ఎలా వుంటుంది ?
ఇందులో నా పాత్ర పేరు మీనాక్షి. చాలా లవ్లీ క్యారెక్టర్. ఒక డ్రీమ్ మదర్, వైఫ్, ఫ్రెండ్ ఎలా వుండాలని వుంటుందో మీనాక్షి పాత్ర అలా వుంటుంది. తను ఫ్యామిలీని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది.. నా కెరీర్ ప్రారంభంలో రాజేంద్రప్రసాద్ గారి తో నటించాను. మళ్ళీ ఇప్పుడు అదే జోడి లో చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన ఇప్పటికీ తను ఉండే సన్నివేశం పై, అందులో కనిపించే నటీనటులపై ఎంతో ప్రత్యేక శ్రద్ధ వహించడం నాకు చాలా ముచ్చటేసింది. నిజంగా అలాంటి అంకితభావం కావాలి.
నరేష్ గారు, షావుకారు జానకీ, ఊర్వశి గారు ఇలా అందరూ కలిసి నటించడం ఎలా అనిపించింది ?
చాలా సంతోషంగా వుంది. అంత మంది మంచి నటులని నందిని గారు, స్వప్న గారు ఎలా ఒక్క దగ్గరకు చేర్చారో నాకు తెలీదు కానీ నిజంగా అద్భుతం. ప్రేక్షకులకు మర్చిపోలేని బహుమతి.
ఇందులో మీ ప్రయాణం ఎలా మొదలైయింది ?
స్వప్నగారు ఫోన్ చేశారు. ”గౌతమి గారు ఇందులో ఒక పాత్ర వుంది. మీరు తప్ప ఎవరూ కనిపించడం లేదు. ఒకసారి వింటారా ?’ అని అడిగారు. విన్నాను. చాలా నచ్చింది. అలా జర్నీ మొదలైయింది.
ఈ చిత్రంలో మహిళా దర్శకురాలు, మహిళా నిర్మాత.. అంతా ఫిమేల్ డామినేషన్ కనిపిస్తుంది కదా ?
మంచిదే కదండీ(నవ్వుతూ). అయితే నేను ఎప్పుడూ జెండర్ ని బట్టి ప్రతిభ, సామర్థ్యాన్ని జడ్జ్ చేయను. ఒక లక్ష్యం వుంటే దాని కోసం ఎవరైనా ప్రయత్నించాల్సిందే. ఈ విషయంలో అయితే అద్భుతమైన ప్రొడ్యూసర్, అద్భుతమైన డైరెక్టర్. నందిని రెడ్డి గోల్డెన్ హార్ట్ డైరెక్టర్. తను ఎప్పుడూ ప్రశాంతంగా వుంటుంది. స్వయం నియంత్రణ వున్న దర్శకురాలు. స్వప్నగారు విషయానికి వస్తే ఒక గొప్ప నిర్మాతకు ఉండాల్సిన లక్షణాలన్నీ తనలో కనిపించాయి. నేను ఎక్కడో చెన్నైలో వుంటే వెదికి పట్టుకొని మరి కథని ఆ పాత్రని చెప్పించారు. ఒక దర్శకుడి విజన్ కి తగ్గట్టు పని చేసి, వారికి ఏం సమకూర్చాలో తెలిసిన నిర్మాత. ప్రియాంక, స్వప్న ఇద్దరూ వండర్ ఫుల్ ప్రోడ్యుసర్స్. ఈ విషయంలో అశ్వినీదత్ గారికి నిజంగా హ్యాట్సప్. ఇద్దరు పిల్లల్ని ఎంతో చక్కగా ప్రోత్సహించి ఇంత గొప్ప స్థితికి తీసుకొచ్చారు.
టీజర్ లో కొబ్బరి నీళ్ళు సీన్ చాలా బ్యూటిఫుల్ గా వుంది.. అలాంటి సీన్స్ ఇంకా వుంటాయా ?
మీరు స్క్రీన్ పై చూడాల్సిందే. నందిని గారు ఒకొక్క పాత్రని చాలా బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దారు. సినిమా చూసినప్పుడు ప్రేక్షకుల మనసులో ఒక హాయి వుంటుంది. వెన్నెల కిషోర్ టైమింగ్ చాలా బావుంటుంది. అలాగే ఈ సినిమాలో అందరూ కూడా మంచి టైమింగ్ వున్న నటులే. ఇంత మంచి టాలెంట్ తో పని చేసినప్పుడు మన స్థానం మనం నిలబెట్టుకోవాలంటే చాలా ఎలర్ట్ గా వుండాలి. అది ఎక్సయిటింగా అనిపించింది.
కొత్త సినిమాలు గురించి ?
బోయపాటి గారి సినిమా చేస్తున్నాను. అలాగే ఒక వెబ్ సిరీస్ పూర్తయింది. అలాగే మరో అమెజాన్ వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ వున్నాయి.
మీ ప్రాజెక్ట్స్ చూస్తుంటే.. వచ్చిన గ్యాప్ ని ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనుకోవచ్చా ?
నేను వర్క్ హాలిక్. ఏదో పని ఉండాల్సిందే. ఇన్నాళ్ల తర్వాత కూడా ఇలాంటి మంచి పాత్రలు వెతుక్కుంటూ రావడం ఒక గౌరవంగా భావిస్తున్నాను.
మీ అమ్మాయికి నటనపై ఆసక్తి ఉందా ?
మా అమ్మాయి ఫిల్మ్ మేకింగ్ చదువుతోంది. తనకు కెమెరా వెనుక ఉండటం ఇష్టం.
ఆల్ ది బెస్ట్
థాంక్స్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…