టెంపుల్ మీడియా పతాకంపై సి. జగన్మోహన్ ( మాయాబజార్ జగన్మోహన్ ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘S-99 ‘. ఇటీవలే ఫస్ట్ లుక్ ను ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ రిలీజ్ చేసిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే.. కాగా ఈ చిత్ర మొదటి టీజర్ ను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేయగా, రెండవ టీజర్ ను నేడు మురళీమోహన్ విడుదల చేసారు.
ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ’ గతంలో మాయాబజార్ ను కలర్ చేసి ఈ సినిమా విజయాన్ని అందుకున్న జగన్మోహన్ గారు తాజాగా S-99 చిత్రానికి డైరెక్షన్ చేయడం జరిగింది.S-99 టీజర్ 2 విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా మాయాబజార్ లాగా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నాను’అని అన్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జగన్మోహన్ మాట్లాడుతూ, ‘S-99 ‘ రెండవ టీజర్ను మురళీమోహన్ గారు లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది.ఇంకా ఈ సినిమాకు సంబంధించిన నాలుగు టీజర్ లను సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ నెలలో రిలీజ్ చేసి, సినిమాను త్వరలోనే రిలీజ్ చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్వేతా వర్మ, ప్రొడ్యూసర్ యతీష్ పాల్గొన్నారు.
హీరో: జగన్మోహన్
హీరోయిన్: శ్వేతా వర్మ
కెమెరా:వీ. శ్రీనివాస్
ఎడిటర్: సనాల్ అనిరుదన్
డైరెక్టర్: జగన్మోహన్
ప్రొడ్యూసర్స్: యతీష్ అండ్ నందిని
పి ఆర్ ఓ :బి. వీరబాబు
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…