ప్రస్తుతం కొత్త కాన్సెప్టులనే ఆడియెన్స్ ఎక్కువ ఆదరిస్తున్నారు. నవ తరం తీస్తున్న చిత్రాలకు తెలుగు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే సుదర్శన్ పరుచూరి ‘మిస్టర్ సెలెబ్రిటీ’ అనే చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మాతలుగా రాబోతోన్న ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.
ఇది వరకు మిస్టర్ సెలెబ్రిటీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్‌ను పరుచూరి గోపాలకృష్ణ రిలీజ్ చేశారు. అక్టోబర్ 4న ఈ చిత్రం రానుందని ప్రకటించారు.
అనంతరం పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘మా మనవడు పరుచూరి సుదర్శన్ నటించిన మిస్టర్ సెలెబ్రిటీ అక్టోబర్ 4న రాబోతోంది. మమ్మల్ని ఆదరించినట్టుగానే మా మనవడ్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. కొత్త దర్శకుడైనా కూడా సినిమాను బాగా తీశారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. అక్టోబర్ 4న తప్పకుండా మిస్టర్ సెలెబ్రిటీ సినిమాను చూడండి’ అని కోరారు.
పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ‘మమ్మల్ని ప్రేక్షకులు ఈ నలభై ఏళ్లుగా ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మా మనవడు పరుచూరి సుదర్శన్ అక్టోబర్ 4న మిస్టర్ సెలెబ్రిటీ ద్వారా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గొప్పగా నిర్మించారు. దర్శకుడు అద్భుతంగా సినిమాను తీశారు. మా మనవడ్ని ఆదరించి ఈ సినిమాను విజయవంతం చేయండి’ అని కోరారు.
తారాగణం: వరలక్ష్మి శరత్ కుమార్, సుదర్శన్ పరుచూరి, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ – RP సినిమాస్
నిర్మాత -చిన్న రెడ్డయ్య, ఎన్.పాండురంగారావు
రచయిత, దర్శకుడు – చందిన రవి కిషోర్
కెమెరామెన్ – శివ కుమార్ దేవరకొండ
సంగీతం – వినోద్ యజమాన్య
పాటలు – గణేష్, రాంబాబు గోసాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వెంకట్ రెడ్డి
ఎడిటర్ – శివ శర్వాణి
పీఆర్వో – సాయి సతీష్
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…