‘1000 వర్డ్స్’ క్లైమాక్స్ చూసి కన్నీళ్లు వచ్చాయి.. చిత్రం ప్రత్యేక ప్రదర్శనలో రేణూ దేశాయ్

అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ దివి, మేఘన శ్రీనివాస్, వినయ్ కీలక పాత్రల్లో విల్లర్ట్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌లో ‘1000 వర్డ్స్’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాకు రమణ విల్లర్ట్ నిర్మాతగా వ్యవహరిస్తూనే డైరెక్షన్ చేశారు. కే రవి కృష్ణా రెడ్డి కో- ప్రొడ్యూసర్ గా పని చేశారు. ఈ సినిమాకు డా.సంకల్ప్ కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించగా.. శివ కృష్ణ సంగీతం అందించారు. సినిమాటోగ్రఫర్‌గా శివ రామ్ చరణ్ పని చేశారు. సోమవారం నాడు స్పెషల్‌గా ఈ మూవీని ప్రదర్శరించారు. ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్‌కు రేణూ దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చి రెడ్డి, మధుర శ్రీధర్, జ్యోతి పూర్వాజ్, సుకు పూర్వాజ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. స్పెషల్ షోను వీక్షించిన అనంతరం..

రేణూ దేశాయ్ మాట్లాడుతూ.. ‘రమణ గారు ఫోటోగ్రాఫర్‌గా నాకు తెలుసు. ఆయన ఓ కథ చెప్పాడు. బాగానే అనిపించింది. కానీ ఎలా తీసి ఉంటారా? అని అనుకున్నాను. ఈ మూవీ చూశాక అద్భుతంగా అనిపించింది. ఇది అందరికీ రీచ్ అవ్వాలి. అందరూ చూడాల్సిన, అందరికీ తెలియాల్సిన సినిమా. ఒక్క ఫోటో మీద ఇంత మంచి కథను రాసుకుని తీశారు. సినిమా చూశాక నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి. ఇంత మంచి సినిమాను తీసిన టీంకు ఆల్ ది బెస్ట్. రమణ గారికి ఇది ఆరంభం మాత్రమే. ఆయన్నుంచి ఇంకా ఇలాంటి మంచి చిత్రాలు రావాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘1000 వర్డ్స్’ అద్భుతమైన చిత్రం. అందరినీ కంటతడి పెట్టించారు. ఈ చిత్రానికి కచ్చితంగా అవార్డులు వస్తాయి. ప్రతీ ఒక్కరి హృదయాల్ని కుదిపేస్తుంది. చాలా రోజులకు ఓ చక్కటి సినిమాను చూశానని అనిపిస్తుంది’ అని అన్నారు.

హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘1000 వర్డ్స్’ ప్రాజెక్టులో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రమణ గారితో ఓ సారి ఫోటో షూట్ చేశాను. మీరు ఎప్పుడైనా సినిమా చేస్తే నాకు చెప్పండి సర్ అని అన్నాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని, పాత్రను చక్కగానే పోషించానని అనుకుంటున్నాను. సూపర్ హీరో ఏ మాస్టర్ పీస్ సినిమా షూటింగ్‌లో నాకు గాయమైంది. దాదాపు ఎనిమిది నెలలు పని లేకుండా అలా బెడ్డు మీదే ఉండిపోయాను. ఆ టైంలోనే ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఆ దేవుడే రమణ గారిని నా దగ్గరకు పంపాడనిపిస్తుంది. సంకల్ప్, శివ కృష్ణ, శివ రామ్ చరణ్‌లు ఈ ప్రాజెక్ట్‌కు చాలా కష్టపడ్డారు. వాళ్లు చాలా ఎత్తుకు ఎదుగుతారనిపిస్తుంది. మేఘన గారు, దివి గారు అద్భుతంగా నటించారు. నూరీ ఈ చిత్రానికి హీరో. నా మూడేళ్ల కొడుకు అధ్విక్ కృష్ణ మొదటి సారిగా నా సినిమాను స్క్రీన్ మీద చూశాడు. ఈ మూవీ నాకెంతో ప్రత్యేకం. నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

డైరెక్టర్, నిర్మాత రమణ విల్లర్ట్ మాట్లాడుతూ.. ‘గత 20 ఏళ్లుగా నేను ఓ మంచి సినిమాను చేయాలని తపిస్తూనే ఉన్నాను. నాకు కథలు రాయడం రాదు. నేను చాలా కథలు వింటూ వచ్చాను. అప్పుడే సంకల్ప్ ఈ కథతో వచ్చారు. ఓ తల్లి బిడ్డను కనేప్పుడు పడే బాధను చెప్పాలని, చూపించాలనే ఈ సినిమాను తీశాం. అరకులో పూర్తిగా షూట్ చేశాం. మేఘన గారు అమ్మ పాత్రలో అద్భుతంగా నటించారు. పురిటి నొప్పుల్ని డబ్బింగ్‌లో చూపించడంతో కన్నీళ్లు వచ్చాయి. ఇలాంటి కథకు హీరోగా ఎవరు వస్తారో అని అనుకున్నాం. ఈ కథను అరవింద్ గారికి చెబితే వెంటనే ఒప్పుకున్నారు. కథ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని అన్నారు. ఆయన మాకు ఎంతో సహకరించారు. ఆయన అద్భుతంగా నటించారు. త్వరలోనే ఆయన పెద్ద స్టార్ హీరో అవుతారు. దివి నటన చూసి అంతా ఫిదా అవుతున్నారు. దివి చాలా అందంగా ఉండటమే కాదు అంతే అద్భుతంగా నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ విజయ్ అలియాస్ నూరీ నటన చూసి నాకు ముచ్చట వేసింది. ఎంత చదువుకుంటావో చదువుకో నేనుంటాను అని మాటిచ్చాను. నాకు ఆ పిల్లాడు అంతగా నచ్చాడు. మ్యూజిక్ డైరెక్టర్ శివ కృష్ణ ఇచ్చిన ట్యూన్‌కు కీరవాణి తండ్రి గారు శివశక్తి దత్తా అద్భుతంగా రాశారు. లక్ష్మీ భూపాల గారు రెమ్యూనరేషన్ లేకుండా పాట రాసిచ్చారు. శివ రామ్ చరణ్ ఫ్రేమ్స్ చూసి నాకు అద్భుతంగా అనిపించింది. తొమ్మిది నెలలు నాతో పాటు జర్నీ చేశాడు. ఓ ఫోటోగ్రాఫర్‌కు నచ్చేలా సినిమాటోగ్రఫర్ పని చేయడం మామూలు విషయం కాదు. సంకల్ప్ నాకు ఎన్ని వర్షెన్స్ కావాలంటే అన్ని వర్షెన్స్ ఇచ్చాడు. ఎడిటర్ మనోజ్ మాకు అద్భుతంగా ఎడిట్ చేసి ఇచ్చాడు. రేణూ దేశాయ్ గారు నాకు సోదరి వంటి వారు. ఆమెకు ఈ కథ చెప్పగానే ఎమోషనల్ అయ్యారు. ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేస్తానని ఆమె ముందుకు వచ్చారు. సోనికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా పని చేశాను. వాళ్లు ఇచ్చిన కెమెరాతో షూట్ చేశాను. అపర్చర్ లైట్స్ కూడా ఇచ్చారు. కూప్ లెన్స్ ఇచ్చి సపోర్ట్ చేసిన రాజ్ కుమార్ గారికి థాంక్స్. నేను మొదటి ప్రయత్నం చేశాను. చూసిన వారంతా తప్పులు చెప్పండి. వాటిని తెలుసుకుని సరిదిద్దుకుంటాను’ అని అన్నారు.

దివి మాట్లాడుతూ.. ‘నన్ను ఇంత అందంగా చూపించిన రమణ గారికి థాంక్స్. సినిమా చివర్లో నేను ఏడ్చాను. చివరి పది నిమిషాలు హృదయాన్ని హత్తుకుంది. అందరినీ ఈ మూవీ కట్టి పడేస్తుంది. కథ విన్నప్పుడు ఇంత ఎఫెక్టివ్‌గా ఉంటుందని అనుకోలేదు. తెరపై అలా చూస్తుంటే ఓ తల్లి మాతృత్వాన్ని ఫీల్ అయ్యాను’ అని అన్నారు.

నటి మేఘన మాట్లాడుతూ.. ‘‘1000 వర్డ్స్’లో ఇంత మంచి పాత్రను రమణ గారు నమ్మకంగా నాకు ఇచ్చినందుకు థాంక్స్. సినిమా చూస్తుంటే నిజంగానే తల్లి కాకుండానే మాతృత్వాన్ని అనుభవించినట్టుగా అనిపించింది. అరవింద్, దివి గార్లతో నటించడం ఆనందంగా ఉంది. ఇలాంటి మరిన్ని మంచి పాత్రలను నేను చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ విజయ్ అలియాస్ నూరి మాట్లాడుతూ.. ‘‘1000 వర్డ్స్’లో నూరి కారెక్టర్‌ను ఇచ్చిన రమణ గారికి థాంక్స్. నాకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’ అని అన్నాడు.

రైటర్ సంకల్ప్ మాట్లాడుతూ.. ‘నేను రాసిన కథ ఇంత మందికి నచ్చింది. ఇంత మంది చప్పట్లు కొట్టడం చూస్తుంటే ఆనందంగా ఉంది. మా నూరికి యాక్టింగ్ రాదు. చాలా నేర్చుకుని ఎంతో అద్భుతంగా నటించాడు. నాకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’ అని అన్నారు.

సినిమాటోగ్రఫర్ శివ రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘మా ఈ ప్రయాణంలో రేణూ దేశాయ్ గారు చాలా సపోర్ట్ చేశారు. రమణ గారు ఓ మంచి చిత్రం తీయాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అలాంటి టైంలోనే సంకల్ప్ మంచి కథను ఇచ్చారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన రమణ గారికి థాంక్స్. ఆయన వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చింది. మా కోసమే మా హీరో అరవింద్ కృష్ణ గారు ఈ సినిమా చేసినట్టుగా అనిపిస్తుంది’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శివ కృష్ణ మాట్లాడుతూ.. ‘నాకు అవకాశం ఇచ్చిన రమణ గారికి థాంక్స్. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు. ఈ పాటలు ఇంత బాగా రావడానికి ఆయనే కారణం. నా మీద నమ్మకంతో పెద్ద సింగర్లను కూడా ఇచ్చారు. అరవింద్ గారు అద్భుతంగా నటించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ రుణపడి ఉంటాను’ అని అన్నారు.

నేపథ్య సంగీత దర్శకుడు రాజా మాట్లాడుతూ.. ‘సంకల్ప్ వల్లే నా ప్రయాణం మొదలైంది. ఈ సినిమాకు ఆ యూనివర్స్ వల్లే అంతా కలిశాం. నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం పని చేశాం. ఈ చిత్రం మున్ముందు ఎన్నో అవార్డులు గెలుస్తుంది’ అని అన్నారు.

మనోజ్ మాట్లాడుతూ.. ‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా రమణ గారికి థాంక్స్. ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. అందరినీ కదిలిస్తుంది’ అని అన్నారు.

అచ్చి రెడ్డి మాట్లాడుతూ.. ‘‘1000 వర్డ్స్’ సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ కంటతడి పెడతారు. నూరీ ఈ సినిమాకు అసలు హీరో. మంచి ఫీల్‌తో ఈ మూవీని తీశారు. రమణ గారి నుంచి ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలి’ అని అన్నారు.

ఆప్తా ప్రెసిడెంట్ త్రినాథ్ ముద్రగడ మాట్లాడుతూ.. ‘‘1000 వర్డ్స్’ సినిమా హార్ట్ టచింగ్‌గా అనిపించింది. రమణ గారు ఈ మూవీని అద్భుతంగా తీశారు. ఈ ప్రాజెక్ట్‌కు అన్ని అవార్డులు రావాలి’ అని అన్నారు.

మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. ‘‘1000 వర్డ్స్’ చూసి కంటతడి పెట్టేసుకున్నాను. హీరో అరవింద్ అద్భుతంగా నటించాడు. రమణ గారు ఈ మూవీని చక్కగా తీశారు. టెక్నికల్‌గా ఈ మూవీ నెక్ట్స్ లెవెల్లో ఉంది. ఫిల్మ్ మేకర్లకు ఈ మూవీ ఇన్ స్పిరేషనల్‌గా ఉంటుంది. ఇంత మంచి చిత్రాన్ని ఈ మధ్యలో చూడలేదు. అన్ని అవార్డులు ఈ మూవీకి రావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

నటి జ్యోతి పూర్వాజ్ మాట్లాడుతూ.. ‘‘1000 వర్డ్స్’ అద్భుతంగా ఉంది. అసలు టైం ఎలా గడిచిందో అర్థం కాలేదు. క్లైమాక్స్ చూసి ఎమోషనల్ అయ్యాను. అందరూ అద్భుతంగా నటించారు. రమణ గారు ఈ మూవీని చక్కగా తీశారు’ అని అన్నారు.

సుకు పూర్వాజ్ మాట్లాడుతూ.. ‘‘1000 వర్డ్స్’ ఒక ఎక్స్‌పీరియెన్స్‌లా ఉంది. రమణ గారి అనుభవం కనిపిస్తుంది. కథను నడిపించిన తీరు అద్భుతంగా అనిపించింది. చాలా బాగా తీశారు. అంతర్జాతీయంగా అవార్డులు వస్తాయనిపిస్తుంది. మా హీరో అరవింద్ కృష్ణ బాగా చేశారు.’ అని అన్నారు.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

8 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago