దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ ఫ్రాంచైజీ “మిర్జాపూర్ : ది మూవీ” టీజర్ విడుదలైంది. ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన మిర్జాపూర్ కథ ఇప్పుడు తొలిసారిగా భారీ స్థాయిలో థియేటర్లలోకి రానుంది.
2018లో ప్రారంభమైన మిర్జాపూర్ కథా ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఈ సినిమా కొత్త మరియు ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 4, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
టీజర్‌లో అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి దివ్యేందు తమ పాత్రలతో మరోసారి కనిపించగా, అభిమానుల అభిమాన పాత్ర బబ్లు పండిట్‌గా జితేంద్ర కుమార్ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే రవి కిషన్ కొత్త పాత్రలో చేరి కథకు మరింత బలం చేకూర్చారు.
ఇక అభిషేక్ బెనర్జీ, రసిక దుగల్, శ్వేత త్రిపాఠి Abhishek తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుర్మీట్ సింగ్ దర్శకత్వం వహించగా, పునీత్ కృష్ణ కథను అందించారు. రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
‘మిర్జాపూర్: ది మూవీ’ హిందీతో పాటు తెలుగులో కూడా విడుదల కానుండటం విశేషం. అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం థియేటర్లలో భారీ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…