కుంభమేళా ఫేమ్ మోనాలిసా కథానాయికగా ‘లైఫ్’ చిత్రం ఘనంగా ప్రారంభం

కుంభమేళాలో పూసలమ్ముతూ విశాలమైన కనులతో సోషల్ మీడియా ద్వారా అందరినీ ఆకట్టుకున్న మోనాలిసా తెలుగులో కథానాయికగా మారింది. సాయిచరణ్ హీరోగా వెంగమాంబ క్రియేషనర్స్ బేనర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి లైఫ్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. నిర్మాత అంజన్న నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్నారు. లైఫ్ సినిమా బుధవారం నాడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రారంభమైంది.

సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి పూజతో లైఫ్ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు సురేష్ క్లాప్ కొట్టగా, నిర్మాత డీఎస్ రావ్ కెమెరా స్విచ్చాన్ చేయగా శివన్నారాయణ గౌరవ దర్శకత్వం వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నిర్మాత అంజన్న మాట్లాడుతూ.. ఈరోజు సినిమాను ప్రారంభించాం. అలాగే రెగ్యులర్ షూటింగ్ కూడా జరుగుతుంది. సరికొత్త ప్రయోగంగా లైఫ్ సినిమాను ఆరంభించాం. కుంభమేళాలో చిన్న వ్యాపారం చేసి ఇండియా మొత్తం ప్రజాదరణ పొందిన అమ్మాయితో సినిమా చేస్తే క్రేజ్ వస్తుందని అనుకున్నాను. అనుకున్నట్లుగా దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో మోనాలిసా ను హీరోయిన్ గా ఎంపిక చేశాం. ఈ చిత్ర కథ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితాల్లో చోటుచేసుకుంటున్న ఘటన ఆధారంగా వుంటుంది. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రముఖులందరికీ పేరు పేరునా దన్యవాదాలు తెలియజేస్తున్నాను.

గీత రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. వెంగమాంబ క్రియేషనర్స్ పై రూపొందుతోన్న లైఫ్ చిత్రంలో మోనాలిసా, సాయి చరణ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. గేయ రచయితగా చంటిగాడులో నాకు అవకాశం వచ్చేలా దర్శకురాలికి నన్ను పరిచయం చేసి, అనంతరం కొన్ని సినిమాలు డైరెక్ట్ చేసిన శ్రీను కోటపాటి మరలా కమ్ బ్యాక్ గా దర్శకుడిగా రావడం ఆనందంగా వుంది. కథ ప్రకారం సన్నివేశాలకు తగినట్లుగా సాహిత్యం రాసే అవకాశం వచ్చింది. ఈ సినిమాకు కీబోర్డ్ ప్లేయర్ దినేష్ రీరికార్డింగ్ చేయడం చాలా ఆనందంగా వుంది. మంచి బాణీలు తను సమకూరుస్తున్నాడు. మాటల రచయితతోపాటు ఇందులో పనిచేసిన టెక్నీషియన్లంతా సీనియర్లు పనిచేస్తున్నారు. అంజన్న నిర్మాణంలో సాగుతున్న ఈ చిత్రం యూత్ ఫుల్ సినిమా. హీరో హీరోయిన్లకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నాను.

హీరో సాయి చరణ్ మాట్లాడుతూ..  దర్శకుడుని నేను కలిసిన రోజునే కథకు సరిపోతావని చెప్పారు. యూత్ కు బాగా  కనెక్ట్ అయ్యే కథాంశంతో లైఫ్ చిత్రం రూపొందుతోంది. ఇందులో చక్కటి సందేశం కూడా ఇమిడి వుంది. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని అన్నారు.

సీనియర్ నటుడు సురేష్ మాట్లాడుతూ.. నిర్మాత అంజన్న గారు దొంగాట సినిమా డిస్ట్రిబ్యూటర్ గా నాకు పరిచయం. ఓరోజు నాకు ఫోన్ చేసి సినిమా చేస్తున్నాను. మీరు ఓ పాత్ర వేయాలన్నారు. వెంటనే ఓకే చెప్పాను. అలాగే దర్శకుడు శ్రీను కూడా నేను నటించిన కొన్ని సినిమాలకు డైరెక్టన్ డిపార్ట్ మెంట్ లో పనిచేశారు. ఇందులో సపోర్టింగ్ కేరెక్టర్ ప్లే చేస్తున్నాను. ఇక లైఫ్ సినిమా కథగా చెప్పాలంటే, సాఫ్ట్ వేర్ నేపథ్యంలోసాగే కథ. చిన్న సినిమాలకు మంచి సపోర్ట్ ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాను.

దర్శకుడు శ్రీను కోటపాటి మాట్లాడుతూ.. అంజన్న గారికి కథ చెప్పగానే బాగుంది. అయితే మోనాలిసా డేట్స్ తీసుకువస్తే కథకు న్యాయం జరుగుతుందని చెప్పారు. అలా ఆమెను సంప్రదించడం అంగీకరించడం జరిగాయి. ఇది యూత్ ఫుల్ సినిమా. ఇందులో నేటి తరానికి చక్కటి సందేశం కూడా ఇమిడి వుంది.

మోనాలిసా మాట్లాడుతూ..  హైదరాబాద్ కు రావడం చాలా ఆనందంగా వుంది. నాతో తెలుగు సినిమా చేయడం చెప్పలేని ఆనందంగా ఉంది. ఇప్పుడు తెలుగు రాదు కానీ తెలుగు త్వరలో నేర్చుకుంటా, హీరోయిన్ గా చేస్తున్న లైఫ్ సినిమా అందరికీ మంచి లైఫ్ ఇస్తుందని భావిస్తున్నాను. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.

నటీనటులు: మోనాలిసా భోంస్లే, సాయి చరణ్, సయాజీ షిండే, సీనియర్ నటుడు సురేష్, ఆమని, తులసి, వినయ్, రచ్చ రవి, దేవి, శ్రుతి, రోహిత, సుష్మ, బోస్, బార్బీ

సాంకేతిక నిపుణులు
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కోటపాటి శ్రీను
నిర్మాత: అంజయ్య విరిగినేని
DOP : మురళీ మోహన్ రెడ్డి
సంగీతం:సుకుమార్
రీ రికార్డింగ్: దినేష్
సాహిత్యం : కాసర్ల, శ్యామ్ JP
డైలాగ్: శ్రీరామ్ ఏదోటి, గుత్తి మల్లికార్జున్, భాస్కర్
స్టంట్ మాస్టర్ : నందు
ఆర్ట్ డైరెక్టర్: బేబీ సురేష్
స్టిల్స్: ఎం. శ్రీను
కాస్ట్యూమర్స్: అప్పారావు, డి. శ్రీనివాసరావు
కాస్ట్యూమ్ డిజైనర్: ప్రవళిక
మేకప్: కమలాకర్
కొరియోగ్రాఫర్లు: స్వర్ణ, కెకె ప్రేమ్
ప్రొడక్షన్ కంట్రోలర్:  శర్మ PLM ఖాన్
ప్రొడక్షన్ ఆర్గనైజర్: ఎం. శ్రీనివాసరావు
ప్రొడక్షన్ డిజైనర్: డా. సిహెచ్. రత్నాకర్ రెడ్డి
పీఆర్వో. వంశీ శేఖర్

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago