వీకే మూవీస్ బ్యానర్ లో జీవన్, అలేఖ్య నటీనటులుగా, ఉమాశంకర్ రెడ్డి నిర్మాతగా, అశ్విన్ కామరాజు కొప్పల దర్శకుడిగా నిర్మిస్తున్న చిత్రం “వృషభ”. ఈ చిత్రం ట్రైలర్ ను ఎమ్మెల్యే వెంకటయ్యగౌడ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమం పలమనేరులో ఘనంగా నిర్వహించారు. మూవీ టైటిల్ పోస్టర్ ను గవర్నమెంట్ హాస్పిటల్ ఛైర్మన్ ఆర్. చెంగారెడ్డి మరియు మునిసిపల్ ఛైర్మన్ పవిత్ర మురళికృష్ణ విడుదల చేశారు. ఈ కార్యక్రమం పలమనేరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ … “వృషభ” చిత్రం ట్రైలర్ చాలా బాగుంది. కొత్త కథతో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. ఈ చిత్రం బృందానికి అభినంధనలు తెలుపుతున్నానుఅన్నారు.
నిర్మాత ఉమాశంకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మా “వృషభ” చిత్రం ట్రైలర్ లాంఛ్ చేసిన ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్‌గారికి ధన్యవాదాలు. అలాగే టైటిల్ పోస్టర్ లాంఛ్ చేసిన గవర్నమెంట్ హాస్పిటల్ ఛైర్మన్ ఆర్. చెంగారెడ్డి గారికి మరియు మునిసిపల్ ఛైర్మన్ పవిత్ర మురళి కృష్ణ గారికి థ్యాక్స్. చిత్రం కథ మరియు కథనం కొత్తగా ఉంటుంది. మా దర్శకుడు అశ్విన్ కామరాజు కొప్పల చిత్రాన్ని అత్భుతంగా తెరకెక్కించారు. మనుషులకు గోవులకు మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో కథ ఉంటుంది. కొత్త కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు. మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదారిస్తారు. అదే విధంగా మా “వృషభ” చిత్రం కూడా అందరికి నచ్చే విధంగా ఉంటుందిఅని అన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు అశ్విన్ కామరాజు కొప్పల మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ గారి చేతుల మీదుగా “వృషభ” ట్రైలర్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. 1960 కాలం నాటి నేపథ్యంలో కథ ఉంటుంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరెక్కించాము. మా నిర్మాత ఉమాశంకర్ రెడ్డి ఎక్కడా కూడా ఖర్చుకు వెనకాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అందుకు వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రస్తుతం చిత్రం క్లైమాక్స్ సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తాం` అని అన్నారు.
నటీనటులుః అనిల్, మురళి క్రిష్ణారెడ్డి, లక్ష్మీ, ప్రియ, కృష్ణచైతన్య తదితరులు.
సాంకేతిక వర్గంః డీఓపీ – యూఎస్ విజయ్, ఎడిటర్ – మహేంద్రనాథ్, సంగీతం – ఎమ్.ఎల్. రాజా, కొరియోగ్రఫర్ – అనీష్,
నిర్మాత – ఉమాశంకర్ రెడ్డి, దర్శకత్వం – అశ్విన్ కామరాజు కొప్పల
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…