”మెన్ టూ” ట్రైల‌ర్‌ విడుద‌ల

యంగ్ హీరోస్ విశ్వ‌క్ సేన్‌, సందీప్ కిష‌న్ చేతుల మీదుగా విడుద‌లైన  హిలేరియ‌స్ ఎంట‌ర్‌ట‌న‌ర్‌ ‘మెన్ టూ’ ట్రైల‌ర్‌

* న‌రేష్ అగ‌స్త్య‌, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణం.. మే 26న రిలీజ్‌

నరేష్ అగ‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, హ‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌వ‌రం, కౌశిక్ ఘంట‌శాల‌ రియా సుమ‌న్‌, ప్రియాంక శ‌ర్మ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తోన్న చిత్రం ‘#మెన్ టూ’. లాన్‌థ్రెన్ క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై శ్రీకాంత్ జి.రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మౌర్య సిద్ధ‌వ‌రం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 26న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. కొన్నాళ్లు ముందు విడుదల చేసిన ఈ మూవీ ట్రైల‌ర్ అంద‌రిలో ఆస‌క్తిని పెంచింది.

తాజాగా ఈ మూవీ నుంచి ట్రైల‌ర్‌ను యంగ్ హీరోస్ విశ్వ‌క్ సేన్‌, సందీప్ కిష‌న్ విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. ‘మెన్ టూ’ అనేది మ‌న ఇండియా పెద్ద ఎత్తున జ‌రిగిన సామాజిక ఉద్య‌మం. ఇది మీ టూ ఉద్య‌మంలో త‌ప్పుడు లైంగిక ఆరోప‌ణ‌ల‌కు వ్యతిరేకంగా ప్రారంభించబ‌డ్డ ఉద్య‌మం.

ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఫెమినిజ‌మ్ కొటేష‌న్‌తో స్టార్ట్ అయ్యింది. స్త్రీ, పురుషుల మ‌ధ్య స‌మాన‌త్వం అనే పాయింట్ మీద డిస్క‌ష‌న్ జ‌ర‌గ‌టాన్ని చూపించారు. ఆడ‌వాళ్లు లేని చోట‌నే మ‌గ‌వాళ్లు హ్యాపీగా ఉంటార‌నే విష‌యాన్ని బ్ర‌హ్మాజీ వివ‌రించారు. మ‌గ‌వాళ్లు త‌మ జీవితాల్లో ఆడ‌వారి వ‌ల్ల ప‌డే బాధ‌ల‌ను ఎంట‌ర్‌టైనింగ్ యాంగిల్‌లో వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను మ‌గ‌వాళ్లు ఎలా హ్యండిల్ చేస్తార‌నే దాన్ని కూడా చూపించారు. హిలేరియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘మెన్ టూ’ సినిమా ఉంటుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. డైలాగ్స్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. హ‌క్కులు స్త్రీల‌కే కాదు.. పురుషుల‌కు ఉంటుంద‌ని తెలియ‌జేసే సినిమా అని తెలుస్తుంది. కామెడీ, ల‌వ్‌, ఎమోష‌న్స్ ఇలా అన్నీ అంశాల క‌ల‌యిక‌గా ‘మెన్ టూ’ మూవీని రూపొందించారు. యూత్‌ను టార్గెట్ చేసి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని తెలుస్తుంది. మే 26న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.

న‌టీన‌టులు:

నరేష్ అగ‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, హ‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌వ‌రం, కౌశిక్ ఘంట‌శాల‌ రియా సుమ‌న్‌, ప్రియాంక శ‌ర్మ త‌దిత‌రులు  

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్:  లాన్‌థ్రెన్ క్రియేటివ్ వ‌ర్క్స్
నిర్మాత‌:  మౌర్య సిద్ధ‌వ‌రం
కో ప్రొడ్యూస‌ర్‌:  శ్రీమంత్ పాటూరి
ద‌ర్శ‌క‌త్వం:  శ్రీకాంత్ జి.రెడ్డి
మ్యూజిక్‌:  ఎలిషా ప్ర‌వీణ్, ఓషో వెంక‌ట్‌
సినిమాటోగ్ర‌ఫీ:  పి.సి.మౌళి
ఎడిట‌ర్‌:  కార్తీక్ ఉన్న‌వ‌
పాట‌లు, మాట‌లు:  రాకేందు మౌళి
ఆర్ట్‌:  చంద్ర‌మౌళి.ఇ
కో డైరెక్ట‌ర్‌:  సుధీర్ కుమార్ కుర్రు
పి.ఆర్‌.ఓ:  వంశీ కాకా

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

15 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

15 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

15 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago