‘మాయా పేటిక’ మూవీ నుంచి లవ్ సాంగ్ ‘షన్న షన్న..’ ను రిలీజ్

విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్‌, సిమ్ర‌త్ కౌర్, ర‌జ‌త్ రాఘ‌వ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం ‘మాయా పేటిక’. రమేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విడుదలకు సన్నద్ధమవుతోన్న ఈ సినిమా నుంచి బుధ‌వారం ‘షన్న షన్న..’ అనే లిరికల్  సాంగ్‌ను ..హైద‌రాబాద్ బ‌షీర్ బాగ్‌లోని సెయింట్ జోసెస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్‌లో చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. కాలేజ్ స్టూడెంట్స్ న‌డుమ ఈ ల‌వ్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. సాంగ్‌కి స్టూడెంట్స్ నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. గుణ బాల‌సుబ్ర‌మ‌ణ్య‌న్ సంగీతం అందించిన ఈ పాట‌ను శ్రీమ‌ణి రాయ‌గా.. య‌శ‌స్వి కొండెపూడి, ప్ర‌జ్ఞ నాయ‌ని పాడారు. ఈ సంద‌ర్భంగా…

హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ ‘‘‘థాంక్యూ బ్రదర్’ సినిమా తర్వాత నేను నటించిన చిత్రమిది.  ప్రేక్షకుల నుంచి మళ్లీ నేను అంతే ప్రేమను ఎదురు చూస్తున్నాను.  ప్రస్తుతం మన జీవితం మన చేతుల్లో కాకుండా.. ఎక్కువగా సెల్ ఫోన్‌లోనే ఉంటుంది. అలాంటి మొబైల్ కాన్సెప్ట్‌తో సినిమా ఇది.  నేను ఎంతో ఇష్టపడి చేసిన పాత్ర ఇది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మంచి క్యారెక్టర్ క్రియేట్ చేసి.. అందులో నాకు అవకాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు ర‌మేష్‌గారికి, నిర్మాత‌ల‌కు థాంక్స్‌’’ అన్నారు.

డైరెక్టర్ రమేష్ రాప‌ర్తి మాట్లాడుతూ ‘‘మాయ పేటిక’ సినిమా స్కిప్ట్ సరికొత్తగా ఉంటుంది. సెల్ ఫోన్ ఆధారంగా ఈ స్క్రిప్ట్ రూపొందించాం. మీ సెల్ ఫోన్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయో ఈ సినిమాలోనూ మంచి విజువల్స్, మంచి సాంగ్స్, మంచి కామెడీ ఉన్నాయి. ఫుల్ ప్యాకేజీ సినిమా ఇది.  నన్ను నమ్మిన నిర్మాతలు శరత్, తారక్‌లకు..సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ అందరికీ థ్యాంక్స్’’  అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ ‘‘రొటీన్‌కి భిన్నంగా సినిమా తీయాలని అనుకున్నాం. కరోనా సమయంలో థ్యాంక్ యూ బ్రదర్ మూవీ ద్వారా కొత్త కథను, కొత్త సినిమాను మీ ముందుకు తీసుకువచ్చాం. మీరిచ్చిన ధైర్యంతో రెండో సినిమా మాయ పేటికను నిర్మించాం. ఇదొక సెల్‌ఫోన్ బేస్ ఆధారంగా తీశాం. ఈ సినిమాకు సహకరించిన నటీనటులు, డైరెక్టర్ రమేష్ అందరికీ థ్యాంక్స్. త్వరలోనే రిలీజ్ అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.

న‌టీన‌టులు:

విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్‌, సిమ్ర‌త్ కౌర్, ర‌జ‌త్ రాఘ‌వ్, సునీల్, పృథ్వీరాజ్‌, శ్రీనివాస్ రెడ్డి, హిమ‌జ‌, శ్యామ‌ల త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

స‌మ‌ర్ప‌ణ‌:  మాగుంట వెంక‌ట నారాయ‌ణ రెడ్డి
బ్యాన‌ర్‌: జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్మెంట్స్
నిర్మాత‌లు: మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి
ద‌ర్శ‌క‌త్వం:  ర‌మేష్ రాపర్తి
సినిమాటోగ్ర‌ఫీ:  సురేష్ ర‌గుతు
ఎడిట‌ర్‌:  డి.వెంక‌టేష్ ప్ర‌భు, న‌వ్ క‌ట్స్‌
సంగీతం:  గుణ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్‌
ఆర్ట్‌:  పురుషోత్త‌మ్‌

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

8 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago