సరికొత్తగా మెగాస్టార్ చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ రీ- రిలీజ్..

సరికొత్తగా మెగాస్టార్ చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ రీ- రిలీజ్.. రీల్ టు 3D ప్రింట్ కోసం ఎంతో శ్రమించిన చిత్రయూనిట్

టాలీవుడ్ నుంచి వచ్చి అతి పెద్ద సక్సెస్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన చిత్రం ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిన సినిమా ఇది. 1990వ సంవత్సరం మే నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనమే. అయితే ఈ ఏడాది ఈ సినిమా 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మే 9న మళ్లీ థియేటర్లలో విడుదలకు సిద్ధం చేశారు. అది కూడా 2D అండ్ 3D ఫార్మాట్లలో.

ఈ సోషియో-ఫాంటసీ డ్రామాకు విజనరీ దర్శకుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా.. వైజయంతి మూవీస్ బ్యానర్‌ పై ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌కి ఒక గేమ్‌చేంజర్‌గా ఆయన ఇప్పటికీ భావిస్తుంటారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా శ్రీదేవి నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. అమ్రిష్ పురి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామిరెడ్డి, బేబీ శాలిని, బేబీ షామ్లీ వంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రలు పోషించారు.

అయితే ఈ క్లాసిక్ చిత్రాన్ని లేటెస్ట్ ప్రింట్ తో నేటితరం ప్రేక్షకుల ముందు పెట్టాలనే సవాలుతో చిత్ర బృందం ఎంతో కష్టపడింది. మూడు సంవత్సరాల పాటు ఎన్నో చోట్ల, ఎంత వెతికినా కూడా అసలైన నెగటివ్ దొరకలేదు. చివరికి దొరికిన కాపీ కూడా చాలా దెబ్బతిని ఉంది. అయినప్పటికీ, ప్రసాద్ కార్పొరేషన్ సహకారంతో చిత్రబృందం అవిశ్రాంతంగా శ్రమించి ప్రైమ్ ఫోకస్ సాయంతో 3D రూపానికి తీసుకురావడంలో విజయవంతమయ్యారు.

2018లో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ నెగటివ్ రీల్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రతి మూలకు ఫోన్ చేసి, చిన్న థియేటర్లలోనూ ఉపయోగపడే రీల్ ఉందేమో అడిగి తెలుసుకుంది చిత్రబృందం. అయితే కొన్నిచోట్ల రీల్స్ పూర్తిగా డికంపోజ్ కాగా, చివరకు 2021లో విజయవాడలోని అప్పారావు అనే వ్యక్తి వద్ద ఉపయోగపడే ప్రింట్ రీల్
ఒకటి దొరికిందని చిత్రబృందం చెబుతోంది. అదికూడా దుమ్ము దూళితో నిండిపోయి మసకబడిపోయిన స్థితిలో ఉండగా.. చిత్రయూనిట్ అంతా ఎంతో కష్టపడి పునరుద్ధరణ ప్రారంభిచారట. రీల్ ఎక్కడ ఎక్కడ కట్ అయిందో అక్కడ దానికి మరమ్మతు చేసి, జాగ్రత్తగా స్కాన్ చేశారు. ఫ్రేమ్ వారీగా ఉన్న డిజిటల్ స్క్రాచెస్‌ను తొలగించారు. తర్వాత చిత్రాన్ని 8K రెజల్యూషన్‌లో డిజిటైజ్ చేసి, 4K అవుట్‌పుట్‌గా మార్చారు. భారతీయ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ ప్రయత్నించని విధంగా, చిత్రాన్ని 3D రూపంలోకి మార్చే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.

అనేక ఏళ్ల శ్రమ, నిబద్ధతతో పునరుద్ధరించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు సరికొత్తగా థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. గతంలో కంటే మెరుగైన అనుభూతితో 2D, 3D ఫార్మాట్లలో మే 9 నుంచి మళ్లీ థియేటర్లలో మీరు ఈ ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రాన్ని ఎంజాయ్ చేయొచ్చు. సో.. మెగా ఫ్యాన్స్ అండ్ టాలీవుడ్ ఆడియన్స్ బీ రెడీ

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago