తెలుగు చలన చిత్ర పైరిశ్రమ లో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భం గా మెగాస్టార్ చిరంజీవి గారికి ,బ్లాక్‌బస్టర్ ‘చూడాలని ఉంది’ మేకర్స్ కు కృతజ్ఞతలు తెలిపిన హీరో తేజ సజ్జ
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘చూడాలని ఉంది’. నిర్మాతా అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంతోనే బాలనటుడిగా అరంగేట్రం చేశారు హీరో తేజ సజ్జ. ఈ సినిమా విడుదలై నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు గుణశేఖర్, నిర్మాత అశ్వినీ దత్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఓ నోట్ రాశారు తేజసజ్జ.
‘’25 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు. ఏమి జరుగుతుందనే అవగాహన లేకుండా పరిశ్రమలో అడుగు పెట్టాను. నా జీవితం మారిపోయింది.
ఎంతో దయకలిగిన లెజెండ్‌తో తెరపై నా మొదటి పెర్ఫార్మెన్స్ మొదలైయింది. ఇప్పుడు హనుమాన్ కోసం ఎదురుచూస్తున్నాను. ఇదంతా కలలా అనిపిస్తుంది. ఈ కల మీ అందరివలనే జీవం పోసుకుంది.
మీరంతా నా కుటుంబం. ఈ రోజు నేను ఈ స్థానంలో ఉండటానికి కారణం మీ ప్రేమ, ఆదరణ.
గుణశేఖర్ గారు, చిరంజీవి గారు, అశ్వినీదత్ గారు మీరంతా ఒక్కసారిగా నా జీవితాన్ని మార్చేశారు
ఎప్పటికీ మీకు కృతజ్ఞతతో వుంటాను.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…