మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ‘సంబరాల యేటిగట్టు (SYG)’ గ్లింప్స్.. గూస్ బంప్స్ తెప్పించేలా విజువల్స్, యాక్షన్స్, హీరో లుక్

Must Read

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ పుట్టిన రోజు (అక్టోబర్ 15) సందర్భంగా ప్రెస్టీజీయస్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ‘సంబరాల యేటిగట్టు (SYG)’ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. అసుర ఆగమన అంటూ రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. దాదాపు ₹125 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ ప్రాజెక్ట్ సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రంగా మారనుంది. ఈ మూవీ వరల్డ్‌ని పరిచయం చేసేందుకు తేజ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ మాత్రం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది.

SYG Asura Aagamana Glimpse - Telugu | Sambarala Yeti Gattu | Sai Durgha Tej | Rohith | Primeshow Ent

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద ఈ మూవీని కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు నిర్మించారు. రోహిత్ కె.పి దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ‘అసుర సంధ్య వేళ మొదలైంది’ అంటూ తేజ్ చివర్లో చెప్పిన డైలాగ్, అంతకు ముందు చూపించిన విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉన్నాయి. ఇక తేజ్ ఈ మూవీ కోసం ఎంత కష్టపడ్డాడు.. ఎంతలా తన శరీరాకృతిని మార్చుకున్నాడు.. అందుకోసం ఎంత కష్టపడ్డాడు అన్న విషయాలు అర్థం అవుతున్నాయి.

SYG Asura Aagamana Glimpse - Tamil | Sambarala Yeti Gattu | Sai Durgha Tej | Rohith | Primeshow Ent

కండలు తిరిగిన ఆ దేహాన్ని చూస్తుంటే సాయి దుర్గ తేజ్ ఎంతలా శ్రమించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘సంబరాల ఏటి గట్టు’ మూవీలో ఓ యోధుడిలా కనిపించేందుకు తేజ్ వ్యాయామం, కఠినమైన డైట్ అంటూ చాలా కష్టపడుతున్నారు. ‘అసుర ఆగమనం’ అంటూ ఒక్క గ్లింప్స్‌తోనే నేషనల్ వైడ్‌గా మంటలు పుట్టించేశారు. పాన్ ఇండియా స్టాండర్డ్స్‌కి తగ్గట్టుగా విజువల్స్, బీజీఎం, యాక్షన్ సీక్వెన్స్ కనిపిస్తున్నాయి.

SYG Asura Aagamana Glimpse - Kannada | Sambarala Yeti Gattu | Sai Durgha Tej | Rohith |Primeshow Ent

ఈ మూవీని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు టీం శ్రమిస్తోంది. సినిమాటోగ్రాఫర్ వెట్రివేల్ పళనిసామి కెమెరా పనితనం గురించి గ్లింప్స్ చెబుతోంది. యాక్షన్ కొరియోగ్రఫీ మరింత ప్రత్యేక ఆకర్షణీయంగా మారనుందనిపిస్తోంది. అజనీష్ లోక్‌నాథ్ బీజీఎం అయితే గూస్ బంప్స్‌‌లా ఉంది. ఎడిటర్ నవీన్ విజయ కృష్ణ, ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్ ఈ ప్రాజెక్ట్ కోసం ప్రాణం పెట్టి పని చేస్తున్నారు.

SYG Asura Aagamana Glimpse - Malayalam | Sambarala Yeti Gattu | Sai Durgha Tej | Rohith KP

ఈ గ్లింప్స్‌తో సంబరాల యేటిగట్టు (SYG) ఓ భారీ యాక్షన్, ఎమోషనల్, పీరియాడిక్ డ్రామాగా ఉంటుందని అర్థం అవుతోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో పాన్-ఇండియా వైడ్‌గా విడుదలకు సిద్ధం అవుతోంది.

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News