టాలీవుడ్

బేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలిస్తున్నాయి. ఈ మూవీ జూలై 14న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అల్లు అరవింద్, డైరెక్టర్ మారుతి, బింబిసార దర్శకుడు వశిష్ట, రాహుల్ సంకృత్యాన్, బన్నీ వాసు, మెహర్ రమేష్, బీవీఎస్ రవి, బుచ్చిబాబు సానా, కార్తీక్ వర్మ దండు, బలగం వేణు, వీఐ ఆనంద్, సంపూర్ణేశ్ బాబులు ముఖ్య అతిథులుగా వచ్చారు. అల్లు అరవింద్ బిగ్ టికెట్‌ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో చిత్రయూనిట్ మాట్లాడుతూ..

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘కొంత కాలం క్రితం బేబీ రషెస్ చూశాను. ఇది కల్ట్ సినిమా. రాజేష్ ఆకారం చూస్తే కల్ట్ అనిపించదు. కానీ బుర్రంతా కల్ట్. ఆయన హార్ట్‌ను ఎంత మంది బ్రేక్ చేశారో తెలియడం లేదు. సాయి రాజేష్‌ ఓ మంచి ప్రేమికుడు. కాకినాడలో ఎక్కడో చిన్న మ్యూజిక్ ప్లే చేసుకునేవాడు.. గీతా ఆర్ట్స్‌లో పని చేయించుకోవాలనేలా చేశాడు. టాలెంట్ ఉంటే ఏదైనా చేయొచ్చు అని నిరూపించాడు. విజయ్ అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాడు. వైష్ణవిది రియల్ ఎమోషన్. అలాంటి ఎమోషన్లు ఈ సినిమాలెన్నో ఉన్నాయి. ఆనంద్ గురించి విజయ్‌కి ఫోన్ చేశాను. రష్ చూశాను.. మీ తమ్ముడు ఏంటి చించేశాడు? అని అన్నాను. కొన్ని సీన్లలో ఆయన నటన చూస్తే మన కంట్లోంచి నీరు వస్తుంది. త్రీ రోజెస్ చూసినప్పుడే బాల్ రెడ్డి గురించి అడిగాను. బాల్ రెడ్డి మట్టిలో మాణిక్యం లాంటివాడు. చాక్లెట్ బాయ్ విరాజ్ అశ్విన్‌ కూడా అద్భుతంగా చేశాడు. ధీరజ్‌ త్వరగా పైకి వస్తాడు. బేబీ దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం చాలా మంది ప్రాణం పెట్టి పని చేశారు. ఈ మధ్య కాలంలో సినిమాలో ఒక్క పాట బాగుంటే చాలు ఫేట్ మారుతుంది. అలా నాకు విజయ్ బుల్గానిన్ ఆరు పాటలు ఇచ్చాడు. ఆ ఆరు పాటల కోసం నేను రెండొందల పాటలు రిజెక్ట్ చేశాను. అవన్నీ కూడా ఎంతో గొప్పగా ఉంటాయి. ఈ మూడేళ్లు మేం ఇద్దరం ఎన్నో గంటలు కలిసి పని చేశాం. నెలన్నర నుంచి మా ఇద్దరికీ నిద్ర లేదు. ఆర్ఆర్ మీద పని చేస్తూనే ఉన్నాం. క్యూబ్‌లో నిన్న సినిమా చూశాం. గుండె బరువెక్కింది. బేబీతో విజయ్‌కి పెద్ద బ్రేక్ రాబోతోంది. మా డీఓపీ బాల్ రెడ్డి ముప్పై సినిమాలు చేశాడు. ఒక్క హిట్టు లేదు. బేబీ మా 31వ సినిమా. ఇండియాలో టాప్ టెన్ సినిమాటోగ్రఫర్ల పేరు తీస్తే.. కచ్చితంగా ఆయన పేరు ఉంటుంది. బేబీలోని ఆత్మ విజయ్, బాల్ రెడ్డి వల్లే వచ్చింది. వాళ్లిద్దరే ఈ సినిమాకు కన్ను, చెవి. నేను ఎక్కువగా కోప్పడుతుంటాను. బన్నీ వాసు గారు నా వెనకాల ఉన్నాడనే ఆ పొగరు నాకు ఉండొచ్చు. సినిమాలను ప్రేమిస్తుంటారు. ఫ్రెండ్స్ కోసం నిలబడుతుంటారు. మా బేబీ కోసం కూడా నిలబడ్డారు. హృదయ కాలేయం సినిమాను చూసి మారుతి గారు బాగుందని అన్నారు. బడ్జెట్ ఎంత అని తెలుసుకుని.. నేను చూడని అమౌంట్ నాకు ఇచ్చారు. నా కొబ్బరిమట్ట కష్టాల్లో ఉంటే కాపాడారు. ఆయన సలహాలు తీసుకున్నాను. తప్పులు ఉంటే చెబుతుంటారు. రైటర్ రవి కూడా నా తప్పులు చెబుతుంటాడు. మారుతి, రవి వల్లే బేబీ ఇంత బాగా వచ్చింది. ఎడిటింగ్ రూంలో ఈ సినిమాను చేయడం జరిగింది. విప్లవ్ అద్భుతంగా సినిమాను మలిచాడు. బేబీ హిట్ అయిన తరువాత ఆయన ఏం చేశాడన్నది తెలుస్తుంది. అది మా టీంకు తెలుస్తుంది. ఈ రెండు నెలలు నేను నిద్రపోలేదు. నాతో పాటు ధీరజ్ కూడా నిద్రపోలేదు. నా డైరెక్షన్ టీంకు థాంక్స్. జూలై 14న సినిమా వస్తోంది. ఎంత నిడివి ఉన్నా కూడా మిమ్మల్ని పరిగెత్తిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది ఓ ప్రత్యేకమైన సినిమా. అందరూ ఆదరించండి’ అని అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ‘ఆనంద్, వైష్ణవి, విరాజ్ ముగ్గురూ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటారు. ఆనంద్ నటనతో అందరినీ ఏడిపిస్తాడు. ఇలాంటి తమ్ముడు ఉన్నందుకు విజయ్ గర్వపడతాడు. అంత అద్భుతంగా నటించాడు. వైష్ణవి చక్కగా నటించింది. బాల్ రెడ్డి, విజయ్ ఇలా అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. అందరూ చూసి సినిమాను ఆదరించండి. మా ఎస్‌కేఎన్ మరిన్ని మంచి చిత్రాలు తీయాలి. ఓ కల్ట్ సినిమా రాబోతోంద’ని అన్నారు.

బన్నీ వాస్ మాట్లాడుతూ.. ‘నేను, మారుతి, ఎస్‌కేఎన్ ఇలా అందరం కూర్చుని ఉంటే.. పాత రోజులు గుర్తొస్తున్నాయి. మేం ఈ రోజు ఇలా ఇక్కడ ఉండటానికి కారణం నా స్నేహితుడు అల్లు అర్జున్. ఆయన మమ్మల్ని అల్లు అరవింద్ వద్ద తీసుకెళ్లాడు. ఆయన స్కూల్ నుంచి మేం ఒక్కొక్కరం ఇలా వస్తున్నాం. సక్సెస్ అవుతున్నాం. ఈ శుక్రవారం బేబీ టీం ఫేట్ మారుతుంది. విజయ్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఆయన మరింత ఎత్తుకు ఎదుగుతాడు. రాజేష్ మంచి దర్శకుడు. మంచి సినిమాను తీశాడు. బడ్జెట్ పెరుగుతోందని అనిపించింది. కానీ ఆయన సినిమా తీయలేదు. ఓ జీవితాన్ని తీశాడు. ఎస్‌కేఎన్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. ‘నేను ఈ సినిమాను అల్లు అరవింద్ గారికి అంకితం చేస్తున్నాను. నేను చేసిన సినిమాల్లో జీఏ అని ఉంటుంది. కానీ సోలో నిర్మాతగా నన్ను నిరూపించుకోమని అల్లు అరవింద్ గారు అన్నారు. నా ఫ్రెండ్ మారుతికి ఓ మాటిచ్చాను. ఆయన డబ్బులు పోగొట్టుకోకూడదని అనుకున్నాను. టేబుల్ ప్రాఫిట్‌తో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఇదే నేను ఆయనకు ఇచ్చే గిఫ్ట్. బన్నీ వాస్, మారుతి, యూవీ వంశీ వల్లే నేను ఇండస్ట్రీలో ఉన్నాను. నా స్నేహితుడు సాయి రాజేష్‌లో ఎంతో సత్తా ఉంది. ఆ సత్తాను అందరికీ చూపించాలని ఈ సినిమాను తీశాను. అర్జున్ రెడ్డికి వేసిన ప్రీమియర్ షోలకంటే ఒక్కటైనా ఎక్కువగా వేస్తాను అని విజయ్‌కి ఓ మాటిచ్చాను. విజయ్ ప్రీమియర్ షో చూస్తున్నాడు. ఆనంద్ దేవరకొండ అన్నట్టు నేను వాళ్ల ఫ్యామిలీకి లక్కీ కాదు.. నాకే వాళ్ల ఫ్యామిలీ లక్కీ.. చాక్లెట్ బాయ్ విరాజ్, వైష్ణవిలు అద్భుతంగా నటించారు. విజయ్, బాల్ రెడ్డి ఇరగదీశారు. ఇక్కడకు వచ్చిన నా స్నేహితులు, దర్శకులకు థాంక్స్. సాయి రాజేష్ కోసం నేను ఎన్ని కష్టాలైన పడతాను. అందుకే బేబీ సినిమాను తీశాను. బేబీ జర్నీలో ధీరజ్ నాకు మంచి స్నేహితుడయ్యాడు. హై ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాతో బేబీని తీశాం. జూలై 14న సినిమాను చూసి విజయవంతం చేయండ’ని అన్నారు.

సహ నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. ‘బేబీ సినిమాను సాయి రాజేష్ అద్భుతంగా తీశారు. ఆనంద్, వైష్ణవి, విరాజ్‌లు చక్కగా నటించారు. జూలై 14న సినిమా రాబోతోంది. అందరూ చూసి విజయవంతం చేయాల’ని కోరారు.

సంపూర్ణేశ్ బాబు మాట్లాడుతూ.. ‘ఒక మామూలు వ్యక్తిని ఈ స్థాయిలో నిలబెట్టిన సాయి రాజేష్ అన్నకి, ఇక్కడకు వచ్చిన పెద్దలందరికీ థాంక్స్. బేబీ సినిమా జూలై 14న విడుదల కాబోతోంది. పాటలు, టీజర్, ట్రైలర్‌లు బాగున్నాయి. చిన్న నటుడైనా నన్ను ఆదరించినట్టుగా.. మా ఆనంద్ దేవరకొండ అన్నను కూడా ఆదరించాలి. మమ్మల్ని ఎప్పుడూ సపోర్ట్ చేసే మారుతి అన్న, ఎస్‌కేఎన్ అన్నకు థాంక్స్’ అని అన్నారు.

బుచ్చిబాబు సానా మాట్లాడుతూ..’ బేబీ సినిమాను చూస్తుంటే హిట్ అని అర్థం అవుతోంది. కొన్ని సినిమాలు విడుదలకు ముందే రిజల్ట్ తెలుస్తుంది. పాజిటివ్ వైబ్ ఉంది. ఆనంద్ స్టోరీ సెలక్షన్ బాగుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ మా ఊరే. ఒక్క పాటతో ఎక్కడికో వెళ్లాడు. ఓ బేబీని కనేందుకు తల్లి తొమ్మిది నెలలు కష్టపడుతుంది. కానీ సాయి రాజేష్‌ గారు మూడేళ్లు కష్టపడ్డారు. ఈ సినిమాను అదిరిపోద్ది’ అని అన్నారు.

బలగం వేణు మాట్లాడుతూ.. ‘బేబీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోంది. నెలక్రితమే సాయి రాజేష్ అన్నకి ఆ విషయం చెప్పాను. పాటలు అద్భుతంగా వచ్చాయి. రోజుకు రెండు సార్లైనా ఆ పాటలు వింటాను. విజయ్ గారికి ఆ విషయం చెప్పమని అన్నాను. ఈ మధ్య కాలంలో ఇంత మంచి పాటలు వినలేదు.అక్కడే సినిమా సత్తా ఏంటో అర్థం అయింది. సాయి రాజేష్ గారు మూడు సినిమాలు చేశాడు. నాకు మాత్రం కారెక్టర్ ఇవ్వలేదు. చాలా సున్నితమైన వ్యక్తి. ఇలాంటి మంచి వ్యక్తికి మంచి హిట్ రావాలి. బేబీ బ్లాక్ బస్టర్ అవుతుంది. మా బలగం సినిమాకు వైష్ఱవి డేట్స్ ఇవ్వలేదు. ఆనంద్, విరాజ్‌లకు ఆల్ ది బెస్ట్. కెమెరామెన్ బాల్ రెడ్డి మంచి టెక్నీషియన్. టీం అందరికీ కంగ్రాట్స్’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ.. ‘ఎక్కడో కాకినాడలో మ్యూజిక్ చేసుకునే నన్ను ఈ రోజు ఇలా అల్లు అరవింద్ గారి ముందు మాట్లాడేలా చేసిన సాయి రాజేష్ అన్నకి థాంక్స్. సాయి రాజేష్, విజయ్ బుల్గానిన్‌ను కలిపితేనే బేబీ సినిమా మ్యూజిక్ వచ్చింది. ఆనంద్, వైష్ణవి, విరాజ్‌ గార్ల నటనను చూసి నేను ఫ్యాన్ అయ్యాను. మళ్లీ ఇలాంటి సినిమా వస్తుందో రాదో తెలియదు. జీవితాంతం గుర్తుండిపోయే సినిమాను సాయి రాజేష్ గారు ఇచ్చారు’ అని అన్నారు.

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ప్రీమియర్స్ ఓపెన్ చేయగానే ఫుల్ అయ్యాయి. కొత్త వాళ్లం కలిసి ఈ సినిమాను చేశాం. కానీ మా సినిమాకు విపరీతమైన బజ్ ఏర్పడింది. కంటెంట్ బాగుంది కాబట్టే ఇలాంటి క్రేజ్ వచ్చింది. పక్కింటి అబ్బాయిలా కనిపించే చిత్రాలు, కంటెంట్ సినిమాలే ఎందుకు చేస్తావ్.. మీ అన్నలా మాస్ సినిమాలు చేయొచ్చు కదా? అని అందరూ నన్ను అడుగుతుంటారు. ఓ పదిమందిని కొడితే మాస్ హీరోనా? ఊరిని కాపాడితే మాస్ హీరోనా? ప్రేమలో నిజాయితీగా ఉండటమే కానీ నా దృష్టిలో మాస్. ఓ మెట్టు దిగి సారీ చెప్పడం కూడా మాసే. ఆ కోణంలో బేబీ మంచి మాస్ మూవీ. యూత్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రేమంటే ఏంటి? అని చెప్పే క్రమంలోనే సాయి రాజేష్‌ అన్న ఈ కథను రాసుకున్నారు. సాయి రాజేష్‌ గారి కోణంలో ప్రేమను చూపించబోతోన్నారు. ప్రతీ ఒక్కరూ తమను తాము నిరూపించుకునేందుకు ప్రాణం పెట్టి చేశాం. ఆడియెన్స్ కూడా సినిమాను ప్రేమిస్తారు. కుర్రాళ్లంతా వైష్ణవితో ప్రేమలో పడతారు. విరాజ్ అద్భుతంగా నటించాడు. థియేటర్లో ఇది నా మూడో సినిమా. ఇంత వరకు ఒక్క థియేట్రికల్ హిట్ లేదు. నాకు ఓ మంచి సినిమా ఇస్తా అని ఎస్‌కేఎన్ అన్న మాటిచ్చారు. ఇప్పుడు అది బేబీతో నిజం కాబోతోంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన సాయి రాజేష్ అన్నకు థాంక్స్’ అని అన్నారు.

వైష్ణవీ చైతన్య మాట్లాడుతూ.. ‘బేబీ అనేది రియాల్టీలోంచి తీసుకున్న కథ. మన చుట్టూ ఉండేవాళ్ల కథ. బేబీ మూవీ చూసి బయటకు వచ్చినప్పుడు పూర్తిగా సంతృప్తి చెంది వస్తారు. ఇవన్నీ మన జీవితాల్లో జరిగాయ్ కదా? అని కనెక్ట్ అవుతారు. యూట్యూబ్‌లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఉండేదాన్ని. సడెన్‌గా నాకు బేబీ చాన్స్ వచ్చింది. నేను చేయగలను అని, నన్ను సాయి రాజేష్ గారు నమ్మి ముందకు నడిపించారు. ఈ పాత్ర గొప్పదనం గురించి నాకు ఎంతో చెప్పి మోటివేట్ చేసిన ఎస్‌కేఎన్ గారికి థాంక్స్. జూలై 14న అందరూ సినిమాను చూడండి. ఇది నా మొదటి మెట్టు. ఆడియెన్స్ ఇచ్చే రివ్య్యూలతోనే మా భవిష్యత్తు ఆధారపడి ఉంది’ అని అన్నారు.

విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు మా బేబీ టీంకు చాలా ప్రత్యేకం. ఈవెంట్‌కు వచ్చిన అల్లు అరవింద్ గారికి థాంక్స్. అనీష్ గారు నన్ను ధీరజ్ గారికి పరిచయం చేశారు. ఆయన నన్ను సాయి రాజేష్ గారి వద్దకు తీసుకెళ్లారు. ఆయన తీసిన సినిమాలు చూశాను. కలర్ ఫోటో లాంటి సెన్సిటివ్ కథను రాశారా? అని షాక్ అయ్యాను. బేబీ సినిమాలో ఆయన రాసిన డైలాగ్‌లు మనసును హత్తుకునేలా ఉంటాయి. నేనొక గొప్ప దర్శకుడితో పని చేశాను అని గర్వంగా చెప్పుకుంటాను. ఇంత మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన సాయి రాజేష్ గారికి థాంక్స్. ఎస్‌కేఎన్ గారి సినిమా అంటే ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. ఆయనకు సినిమాలంటే ప్యాషన్. బేబీ అనేది కల్ట్ అవుతుందని నమ్మి మూడేళ్ల పాటు పని చేశారు. సాయి రాజేష్ గారి మీదున్న నమ్మకంతోనే ఈ సినిమాను చేశారు. ఇందులో ఇద్దరం హీరోలం కదా? అని అడుగుతున్నారు. కానీ డైరెక్టర్, డీఓపీ, మ్యూజిక్ డైరెక్టర్‌, ఎడిటర్‌లే హీరోలు. వారి తరువాతే మేం. సినిమా విడుదలయ్యాక ఇంకా మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఇది మా బేబీ. రేపటి నుంచి బేబీని ఆడియెన్స్ చేతుల్లో పెడుతున్నామ’ని అన్నారు

Tfja Team

Recent Posts

ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు “తల్లి మనసు”

ప్రేమమూర్తి అయిన ఓ తల్లి తన జీవిత గమనంలో ఎలాంటి భావోద్యేగాలకు గురైంది అన్న ఇతివృత్తంతో "తల్లి మనసు" చిత్రాన్ని…

57 mins ago

Thandel Theatrical Release On February 7th 2025

The highly anticipated film Thandel, starring Yuva Samrat Naga Chaitanya and directed by Chandoo Mondeti,…

2 hours ago

యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌ అలరిస్తుంది

‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను…

3 hours ago

Roti Kapda Romance A Youthful Entertainer Set to Delight Audiences

Bekkam Venu Gopal, the renowned producer behind youth-centric hits like Hushaaru, Cinema Choopistha Mava, Prema…

3 hours ago

ఆదిపర్వం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది సంజీవ్ మేగోటి

రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ పతాకంపై ఏఐ ఎంటర్ టైన్ మెంట్స్ కలయికలో నిర్మించిన చిత్రం "ఆదిపర్వం".…

3 hours ago

Adiparvam gives audiences a new experience Sanjeev Megoti

The much-anticipated film 'Adiparvam' is all set for a grand theatrical release worldwide on November…

3 hours ago